మూలం - ఐజాక్ అసిమోవ్
జీవశాస్త్రం
ఎలా మొదలయ్యింది?
మనకి తెలిసిన
జీవశాస్త్రానికి కొన్ని వేల ఏళ్ల చరిత్ర వుంది. జంతువులని వేటాడి పొట్టపోసుకోవడం నేర్చిన
మానవుడికి జంతు శరీరం నిర్మాణం గురించి తెలియకపోలేదు. తన శరీరానికి ఏవో వ్యాధులు సోకుతాయని
గుర్తించిన మానవుడి, వాటి నివారణ కోసం ఏదో ఒక రకమైన వైద్యాన్ని ఎప్పుడో కనిపెట్టి ఉంటాడు.
కాని అతినెమ్మదిగా, అనిశ్చితంగా సహస్రాబ్దాల పాటు పురోగమించిన జీవశాస్త్రంలో కొన్ని
శతాబ్దాల క్రితం ఓ విప్లవం మొదలయ్యింది.
గెలీలియో తదితరులు
సాధించిన ఆధునిక వైజ్ఞానిక విప్లవం వల్ల భౌతిక శాస్త్రం మాత్రమే కాక, జీవశాస్త్రం కూడా వేగంగా పురోగమించింది.
శాస్త్రీయ పద్ధతులతో చేసిన అధ్యయనాల వల్ల క్రమంగా దేహనిర్మాణ శాస్త్రం (anatomy), జీవక్రియాశాస్త్రం
(physiology), కణ శాస్త్రం (cytology) మొదలైన
ముఖ్యమైన జీవశాస్త్ర రంగాలు ఊపిరి పోసుకున్నాయి. దేవుడు జీవరాశులని సృష్టించాడు అనే
భావన స్థానంలో, కొన్ని కోట్ల సంవత్సరాలుగా నెమ్మదిగా సాగే జీవపరిణామం వల్ల జీవరాశులు
ఏర్పడ్డాయనే విప్లవాత్మకమైన భావన మానవ సమాజాన్ని తట్టి లేపింది.
జీవశాస్త్ర
చరిత్రలో ఆ అద్భుత పరిణామాలన్నీ ఎలా జరిగాయో ఈ పుస్తకంలో చదవండి.
0 comments