ఆకాశ వీధిలో అపరంజి బొమ్మ
ఇది పిల్లల కోసం రాసిన సై-ఫై నవల. (నా మొదటి నవల కూడాను ;-)
దీన్ని ఎమెస్కో వాళ్లు ప్రచురించారు.
ఈ కథలో హీరో అమోఘ్ అనే ఏడో క్లాసు పిల్లవాడు. ఇతగాడికి సైన్స్ అంటే వల్లమాలిన అభిమానం. అది తన తండ్రి నుండి అబ్బింది. తండ్రి ఒక ఖగోళశాస్త్రవేత్త. తల్లి పీడీయాట్రీషియన్.
ఒక రోజు అర్థ రాత్రి తల్లి దండ్రులు ఇంట్లో లేని సమయంలో, అమోఘ్ చెల్లెలు అనూహ్యని ఎవరో అపహరిస్తారు. ఆ హఠాత్ పరిమాణానికి అదిరిపోయిన అమోఘ్ చెల్లెలి కోసం గాలింపు మొదలెడతాడు.
ఆ ప్రయత్నంలో అతడికి మెరిసే టైటేనియం దేహంతో ముద్దెచ్చే విస్సూ అనే రోబో సహాయపడతాడు. ఆ గందరగోళంలో వాళ్ల పని అమ్మాయి రత్న, కుక్క పిల్ల మిట్టీ కూడా ఆ అన్వేషణా ప్రయత్నంలో పాల్గొంటారు.
కొన్ని రహస్య సందేశాలని అనుసరిస్తూ ఆ విచిత్ర బృందం తప్పి పోయిన పాప కోసం సౌరమండలం అంతా గాలిస్తూ పోతుంది. వారి యాత్రలు వారిని వీనస్ గ్రహం మీద వెలసిన ఓ అద్భుతమైన మేఘ నగరం వద్దకు తీసుకుపోతాయి...
మిగతా కథ పుస్తకంలో చదవండి...
Hi sir mek ads display avthunaya blogspot lo