పైతాగొరాస్ కప్పు
ఇదో తమాషా కప్పు.
ఇందులో పోసుకుని తాగితే తప్పనిసరిగా మోతాదులో తాగాల్సి ఉంటుంది.
ప్రలోభం కొద్ది
కాస్త ఎక్కువ పోసుకుంటే అంతా రసాభాస అవుతుంది!
ఇది ఎలా పని
చేస్తుంది?
కప్పు మధ్యలో
చిన్న స్తంభం లాంటి నిర్మాణం కనిపిస్తోంది (fig 1). ఆ స్తంభం లోపల రహస్యంగా ఓ సైఫన్ (syphon) లాంటి ఏర్పాటు వుంది (fig 2). కప్పులో రసం నింపుకుంటున్నప్పుడు
లోపల సైఫన్ లో కుడా పానీయం నిండుతూ వుంటుంది. కప్పులో పానీయం యొక్క మట్టం ఒక స్థాయి
కన్నా మించితే సైఫన్ లో రెండవ వైపుకి పానీయం ప్రవహిస్తుంది. ఇక అక్కణ్ణుంచి సైఫన్ ద్వారా
కప్పులో ఉన్న పానీయంలో కొంత భాగం (నిర్ణీత మట్టం కన్నా అధికంగా వున్న భాగం) కప్పు కింద
వున్న రంధ్రం ద్వారా కిందికి కారిపోతుంది.
అతిగా
తాగబోయిన వాడి పరిస్థితి “తడిసి” మోపెడు అవుతుంది!!!
Looooool, damm good
Taara
nice post