మరి రాజ్యాల రాతలనే మార్చే గ్రహాలు, పాపం సామాన్య వ్యక్తులని వదిలిపెడతాయా? ఆ విధంగా ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియాలో వ్యక్తి స్థాయి జ్యోతిష్యం మొదలయ్యింది. క్రమేపీ అది 2000 ఏళ్ల క్రితం గ్రీకు, రోమన్ ప్రపంచాలలో వ్యాపించింది. అలనాడు మానవ జీవనం మీద జ్యోతిష్య ప్రభావం యొక్క ఆనవాళ్లుగా కొన్ని పదాలని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి disaster అనే ఇంగ్లీష్ పదం ‘చెడు తార’ (dis = చెడు, aster = తార) అనే అర్థం గల గ్రీకు పదం నుండి వచ్చింది. అలాగే influenza (ఇది ఒక రకమైన ఫ్లూ వ్యాధి) అన్న పదం ఇటాలియన్ భాషలో ‘జ్యోతిష్య ప్రభావం’ అన్న అర్థం గల పదం...
postlink