శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.పిల్లలు జన్మత: శాస్త్రవేత్తలు. తమ చుట్టూ ఉన్న అజ్ఞాత ప్రపంచాన్నిశోధించి సాధించాలని తాపత్రయపడుతుంటారు. ఈ సంగతి తల్లిదండ్రులకి కూడా తెలుసు. మాట, నడక నేర్చిన నాటి నుండీ, పిల్లల్లో తెలుసుకోవాలనే ఉత్సుకత వారిని ఈ అన్వేషణా మార్గంలో ముందుకు తోస్తుంది. కాని ఎందుచేతనో వయసు పెరుగుతున్న కొలది ఆ ఉత్సాహం క్రమంగా అణగారిపోతుంది. మనిషి జీవితంలో ఇదొక తీవ్రమైన నష్టంగా భావించాలి.


ఈ సమస్యని చక్కదిద్దడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వైజ్ఞానిక విద్యని ఇంకా అభివిద్ధి పరచాల్సిన అవసరం ఉంది. టీచర్ల శిక్షణని పెంచాలని, విద్యాప్రణాలికలని మెరుగుపరచాలని ఇలా నిపుణులు ఎన్నో సూచనలు చేశారు.

ఈ అధ్యయనాలు, వాటికి ఆధారంగా ఉన్న సిద్ధాంతాలు, చాలా వరకు ఓ మౌలిక విషయాన్ని విస్మరిస్తున్నాయి. విజ్ఞానం యొక్క అంతరంగం లోకి విద్యార్థులు తొంగి చూసేలా వీలు కల్పిస్తూ, విజ్ఞానం యొక్క అత్యధ్భుత సారాన్ని ఆస్వాదించేటట్టు చెయ్యకుండా, ఈ శిక్షణలన్నీ కేవలం సాంకేతిక వివరాలలో, పద్ధతుల వినియోగంలో యాంత్రికమైన దక్షతని పెంచే తీరులోనే పనిచేస్తున్నాయి.

అసలు నేను మాట్లాడిన పిల్లల్లో చాలా మందిలో సైన్సులోని ప్రగాఢ, మౌలిక ప్రశ్నల కనీస మాత్ర అవగాన కూడా లేదు. చిన్న చిన సాంకేతిక వివరాలను మాత్రమే నిరంతరం అవపోసన పడుతూ అదే అసలు విజ్ఞానం అన్న భావనలో ఉంటారు. ఈ విశ్వం ఎక్కణ్ణుంచి పుట్టింది? జీవం ఎలా ఆవిర్భవించింది? మెదడు చర్యలలో చైతన్యం ఎలా అభివ్యక్తం అవుతోంది? వారి శిక్షణలో ఇలాంటి ప్రశ్నల ప్రసక్తే రాదు. సంగీతం నేర్చుకునే విద్యార్థులకి ఎప్పుడూ స్వరజతులే నేర్పిస్తూ, మహావాగ్గేయకారులు రాసిన కృతుల జోలికే పోకుండా సాగే సంగీత బోధన లాగానే, ఈ విధమైన సైన్సు బోధన పిల్లల్లో సైన్సు పట్ల విస్మయం కలుగజేయదు. కళ్లింతచేసి ’అబ్బా! సైన్స్ అంటే అదా?” అని అబ్బురపడనీయదు.

ఈ సందర్భంలో, ఊరికే ఒక అవగాహన కలగడానికి, భౌతిక శాస్త్రాన్నే తీసుకుంటే గత శతాబ్దంలో ఎన్నో విప్లవాత్మకమైన పరిణామాలు వచ్చాయి. ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతం, సామాన్య సాపేక్షతా సిద్ధాంతం, క్వాంటం సిద్ధాంతం మొదలైనవి భౌతిక యదార్థం పట్ల మన దృక్పథాన్ని సమూలంగా మార్చేసిన కొన్ని అద్భుత పరిణామాలు. ఇక గత పదేళ్లలోనే విశ్వ విన్యాసం గురించిన మన అవగాహనలో కొన్ని సంచలనాత్మక మర్పులు వచ్చాయి. సుదూరమైన భవిష్యత్తులో విశ్వం ఎలా ఉంటుంది అన్న విషయంలో కొన్ని కొత్త సిద్ధాంతాలు బయలుదేరాయి.

ఇవన్నీ చాలా మౌలికమైన, బృహత్తరమైన పరిణామాలు. కాని హైస్కూలు స్థాయి లోనో, ఇంకా చిన్న తరగతుల స్థాయిలోనో ఇలాంటి విప్లవాల ప్రస్తావన చాలా అరుదుగానే వస్తుంటుంది. ఒక్క భౌతిక శాస్త్రంలోనే కాదు, జీవ, రసాయన, గణిత శాస్త్రాలలో కూడా ఈ ఒరవడే మనకి కనిపిస్తోంది.

ఈ బోధనా పద్ధతికి మూలంలో సైన్సు బోధన నిలువుగా, అంటే ఓ కచ్చితమైన వరుసక్రమంలో సాగాలన్న ఒక నమ్మకం ఉంది. ముందు ’అ’ నేర్చుకుంటే, ఆ తరువాత ’ఆ’ నేర్చుకుంటే, అటు పిమ్మట ’ఇ’... ఇలా సాగుతుందీ బోధన. మరి ఇందులో మొదటి మెట్టు అయిన ’అ’ అనే అంశం కొన్ని వందల ఏళ్ల క్రితం కనుక్కోబడ్డ విషయం అయినప్పుడు, అక్కణ్ణుంచి మొదలుపెట్టి నెమ్మదిగా ఆధునిక యుగం వరకు రావాలంటే మరి చాలా కాలమే పడుతుంది. ఇక స్కూల్లో తప్పనిసరిగా జరిగే కార్యక్రమాలు – సమీకరణాలు సాధించడం, రసాయన చర్యలని విశ్లేషించడం, కణాలలో అంతర అంశాల చర్యలన్నీ జ్ఞాపకం పెట్టుకోవడం – మొదలైనవన్నీ తుచ తప్పకుండా చేసుకుంటూ పోతే మరి నిస్సందేహంగానే స్వర్గారోహణంలా నిలువు దిశలో చాలా దూరమే పోవాల్సి ఉంటుంది.


కాని సైన్స్ అంటే కేవలం ఈ సాంకేతిక వివరాలే కాదు. ఆ వివరాల వెన్నుక ఉన్న అందమైన, లోతైన భావనలు కూడా సైన్సే. చెప్పే తీరులో చెప్తే, మరీ ఎక్కువ సాంకేతిక వివరాలు గుప్పించకుండా, అత్యంత ఆధునిక ఆవిష్కరణలని, సిద్ధాంతాలని స్కూలు పిల్లలకి అర్థమయ్యేలా చెప్పొచ్చు. వివరాలు పెద్దగా లేకపోయినా, మూల భావాలని వ్యక్తం చెయ్యగలిగామంటే ఆ భావాలే పిల్లలలో సాంకేతిక వివరాలు కూడా నేర్చుకోవాలన్న ఆకాంక్ష కలుగజేస్తాయి. ఎప్పుడూ వైజ్ఞానిక ఫలితాలకి, లెక్కలు చెయ్యడానికి మాత్రమే ప్రాధాన్యత నిస్తున్నప్పుడు, పిల్లలు సైన్సు భావాల తన్మయత్వంలో తారామండలాన్ని దాటి తేలిపోయే అవకాశాన్ని చేజార్చుకుంటున్నారు.

సైన్సు ఓ అత్యద్భుతమైన సాహసగాధ. మనిషి తన గురించి, తన పరిసరాల గురించి తెలుసుకోడానికి కొన్ని వేల ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నాల చరిత్ర అది. ఈ సుదీర్ఘ మానవ భావపరిణామ నాటకాన్ని, అందులో ఉత్సాహాన్ని, మహత్తుని వ్యక్తం చేసేలా ఉండాలి సైన్సు బోధన. సంగీతం, కళ, సాహిత్యాల స్థాయిలో వాటికి సమానంగా సైన్సు కూడా ఉంచేట్టుగా మన సంస్కృతిని మలచుకోవాలి. సైన్సు జీవన సారంలో లోతుగా ఇమిడిపోవాలి.

ఇరాక్ లో పోరాడుతున్న ఆ సైనికుడు మాత్రమే కాదు, మనని ఎన్నో రకాలుగా వేరుచేసే కుటిల అడ్డుగోడల కన్నా అతీతమైన విశ్వరహస్యం కోసం చేసే ఓ మానవసహజ అన్వేషణ ప్రతీ ఒక్కరు తప్పకుండా చేపట్టాల్సిన ఓ గురుతర బాధ్యత, ప్రతీ పసివాడికి అదో జన్మహక్కు.

- బ్రయాన్ గ్రీన్.

20 comments

 1. శ్రీనివాస చక్రవర్తి గారు,
  పిల్లలలకు సైన్స్ సులువుగా అర్థం అయ్యేలా వివరైంచడానికి ఏవైనా పుస్తకాలు వుంటే చెప్తారా? మా బాబు కి 5 సంవత్సరాలు వాడికి చూసిన ప్రతిదీ తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా ఎక్కువ. బాల్ ఆడుతూవుంటే బాల్ ఎందుకు కిందే పడుతుంది పైకి ఎందుకు పోదు అని అడుగుతాదు. పార్క్ లో జారుడు బల్ల మీద జారుతూ వుంటే ఎందుకు కొన్ని స్లో గా , మరికొన్ని చాలా ఫాస్ట్ గా జారుతాయి అని అడుగుతాడు. ఇంకా మొట్టమొదట ఊర్లు ఎలా ఏర్పడ్డాయి, కార్లు, బైక్ లు వీటిల్లో వున్న ఇంజన్లు ఎలా పని చేస్తాయి, సైకిల్ కు ఇంజన్ పెడితే ఏమవుతుంది, వాటర్ ఫిల్టర్ ఎలా పని చేస్తుంది ఇలా చాలా విషయాల గురించి అడుగుతూ వుంటాదు. వాడికి అర్థం అయ్యేలా వివరిచండానికి ఎవైనా పుస్తకాలు వుంటే చెప్పండి.

   
 2. "కాని సైన్స్ అంటే కేవలం ఈ సాంకేతిక వివరాలే కాదు. ఆ వివరాల వెన్నుక ఉన్న అందమైన, లోతైన భావనలు కూడా సైన్సే." - అది నిజం. సైన్సు కూడా ఒక సౌందర్యారాధనే.
  చెప్పే తీరులో చెప్తే, మరీ ఎక్కువ సాంకేతిక వివరాలు గుప్పించకుండా, అత్యంత ఆధునిక ఆవిష్కరణలని, "సిద్ధాంతాలని స్కూలు పిల్లలకి అర్థమయ్యేలా చెప్పొచ్చు. వివరాలు పెద్దగా లేకపోయినా, మూల భావాలని వ్యక్తం చెయ్యగలిగామంటే ఆ భావాలే పిల్లలలో సాంకేతిక వివరాలు కూడా నేర్చుకోవాలన్న ఆకాంక్ష కలుగజేస్తాయి." - అంతే కాదు అటువంటి ఆలోచనలలో ఉన్న ఆనందాన్ని అందుకోగలుగుతారు.
  వ్యాసం బావుంది.
  మీ బ్లాగు గురించి తెలిసినప్పట్నుంచీ అప్పుడప్పుడూ వచ్చి చూస్తున్నాను.
  చాలా మంచి పని చేస్తున్నారు. అభినందనలు.

   
 3. శ్రీనివాస చక్రవర్తి గారు,

  మీ బ్లాగ్ వల్ల తెలుగులో వున్న కొన్ని సైన్స్ పుస్తకాల గురించి తెలుసుకున్నాను. ధన్యవాదాలు.

   
 4. స్నేహ గారు:

  మీ అబ్బాయి చాలా ఘటికుడిలా ఉన్నాడు. ఇంగ్లీష్ లో అయితే అలాంటి పిల్లలకి పనికొచే పుస్తకాలు కోకొల్లలు. ఇక అమెరికా లో అయితే సమస్యే ఉండదు.

  పుస్తకాలు, పత్రికలు, సైన్స్ కిట్స్... ఇలా ఎన్నో. కాని తెలుగులో కూడా ఇలాంటి సదుపాయాలు ఉంటే బావుంటుంది. ఇండియాలో వ్యవస్థ ఎలా ఉన్నా పిల్లలు మాత్రం బంగారాలు. పెద్ద నగరాల్లోనే కాక, చిన్న పల్లెల్లో కూడా ఆణిముత్యాల్లాంటి పిల్లలు ఎదురవుతుంటారు. ఆ బంగారాలకి సానపట్టే విధంగా, వేల మార్గాలలో వారు ఎదిగే అవకాశాలని కల్పించే విధంగా, మన వ్యవస్థ కూడా రూపుదిద్దుకుంటే బావుంటుంది. కాని వ్యవస్థ అంత వేగంగా మారలేదు. అందుకే ప్రపంచ సాహిత్యంలో ఎక్కడ ఏ మంచి, విలువైన భావన ఉన్నా, పరిజ్ఞానం ఉన్నా దాన్ని తెలుగులోకి తెచ్చుకుంటే, ఆ జ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని, సత్తాగల వారు స్వశక్తితో వేగంగా ఎదగగలుగుతారని ఓ నమ్మకం.

   
 5. లలిత గారు:
  మీ వెబ్ సైట్ చాలా బావుంది. మీరు చేస్తున్న కృషికి అభినందనలు.

   
 6. శ్రీనివాస చక్రవర్తి గారు,

  మేము చెన్నై లో ఉంటున్నాం. మీ బ్లాగ్ లో తెలుగు లో సైన్స్ పుస్తకాలు చూసాను. అవి చెన్నై లో ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా? లెదా ఆన్‌లైన్ లో కొనడానికి అవకాశం వుంటే చెప్పగలరు.

  స్నేహ

   
 7. ramnarsimha Says:
 8. I paragraph is excellent.

  Your blog is very nice.

  Thank you.

  rputluri@yahoo.com

   
 9. gaddeswarup Says:
 10. Once I collected a list of acience books in Telugu bat I cannot find it now. I am visiting Hyderabad in August and try to get the list and send to Sri Chakravarty. From what I remember 'Jana vignana Vedika' published several books. I saw several science books in a library in Nadimpalli, Repalle Taluk, Guntur Dt ( Gadde Lalita Devi Memorial Library) by authors like Mahidhara Ramamohana rao (?) and others. I may also visit that library in August. I think Kodavatiganti Kutumba Rao and Arudra wrote one book each but they may be outdated. There are also some nice science topics in the blog 'science kaburlu'. That blogger may have access to some books. Even if one can find them, the problem is accessibility. I am sorry for this meager information but will try to send more information in August-September.

   
 11. gaddeswarup Says:
 12. Kodavatiganti Rohiniprasad (Kutumbarao's son) has a science blog http://rohiniprasadkscience.blogspot.com/
  He is a physicist who used to work in BARC and then moved to USA. I underatand that he is moving to Hyderabad soon. He may be another person who will know about science writing in Telugu.

   
 13. నమస్కారం.
  మెదటగా టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
  సమూహము గురించి చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను.
  తెలుగు బ్లాగులు విస్తృతంగా వాడుకలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ యుగములో అన్ని తెలుగు బ్లాగులను ఒక గూటిలోనికి తేవాలనే మా ప్రయత్నం .మీకు నచ్చిన ,మీరు మెచ్చిన బ్లాగులను ఈ బ్లాగులో చేర్చవచ్చును.
  సమూహము ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి.
  సమూహము మీ బ్లాగునుంచి టపాలను మరియు ఫోటోలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం.
  మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో సమూహము లింకు ను వుంచి ప్రోత్సహించండి. సమూహము లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి .
  దయచేసి మీ సలహను / సూచలను ఇక్కడ తెలపండి మీ వ్యాఖ్యలు మాకు అమూల్యమైనవి .
  -- ధన్యవాదముతో
  మీ సమూహము

   
 14. ranjani Says:
 15. ^ గద్దె స్వరూప్ గారూ
  ఆరుద్ర గారు అనువదించిన సైన్సు పుస్తకం ఇది : ఆధునిక విజ్ఞానం - అవగాహన
  http://www.archive.org/details/adhunikavijnanam025634mbp

  మూల పుస్తకం 1956 నాటిది. అందులోని విషయాల పరిజ్ఞానమూ అలనాటిదే !!

   
 16. ranjani Says:
 17. & కొడవటిగంటి కుటుంబరావుగారి అణుశక్తి మానవ కళ్యాణానికా - మారణహోమానికా
  అనే పుస్తకాన్ని ఆర్కైవు లో చూడవచ్చును (ప్రస్తుతానికి ఇమేజిల రూపంలో లభ్యం)
  Anusakti Manavakalyananika? Maranahomanika? (1945)

  http://www.archive.org/details/anusaktimanavaka00kutusher

   
 18. బ్లాగర్ల వ్యాఖ్యానాలకి, అందులో పొందుపరచబడ్డ విలువైన సమాచారానికి కృతజ్ఞతలు.
  రంజని గారు:
  ఆరుద్రగారి పుస్తకం చాలా బావుంది. ముఖ్యంగా శైలి... అలాంటి శైలిలో కొన్ని అన్ని శాస్త్రరంగాలలోను కొన్ని వేల పుస్తకాలు వచ్చే పదేళ్లలోను తెలుగులో (భాతీయ భాషల్లో) వెలువడితే ఎంత బావుంటుంది!
  స్వరూప్ గారు:
  కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారి రచనలు గురించి నాకు తెలుసు. మెదడు గురించి ఆయన రాసిన కొన్ని వ్యాసాలు చదివాను. చాలా బావుంటాయి.
  ఇలా అక్కడక్కడ తెలుగు సైన్స్ సాహిత్యంలో చక్కని కృషి జరుగుతోంది. అయితే ఈ ప్రయత్నాలన్నీ చెదురుమొదురుగా ఉంటున్నాయి.

  తెలుగులో సైన్స్ రచయితలు అందరూ కూడబలుక్కుని ఓ బృహత్ ప్రణాళికతో, ఓ ’సిలబస్’ తయారుచేసుకుని, ఒక్కొక్కరు వారికి నైపుణ్యం ఉన్న రంగాల్లో, తగు రీతిలో తెలుగులో వైజ్ఞానిక సాహిత్యాన్ని సృష్టిస్తే బావుంటుంది. అలాంటి ప్రయత్నంలో పాలుపంచుకోడానికి నేనైతే సిద్ధం!

   
 19. ranjani Says:
 20. శ్రీనివాస చక్రవర్తిగారూ,
  రచనా నైపుణ్యమూ, సైన్సు విషయాల అవగాహనా ఉన్న తెలుగు
  బ్లాగర్లు కొందరు కలిసి ఒక్క చోట తమ రచనలని పెడితే ఆసక్తి ఉన్న
  అందరికీ చాలా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది..

  ఇటీవలే చూసిన మరో చక్కటి సైన్సు విషయం టపా చంద్రమౌళి గారి
  సోలార్ ఫోర్స్:(translated from NGC documentary)
  http://mouliantharmadhanam.blogspot.com/2010/06/translated-from-ngc-documentary.html

   
 21. ramnarsimha Says:
 22. Sir,

  I totally support Ranjani garu..

  Plz consider her suggestion..

   
 23. ranjani Says:
 24. ^ Thank You Ramnarsimha garu. However uniting together for
  posting of regional science articles was proposed by the
  blogger, Srinivasa Chakravarthy garu himself.

  I just responded to his idea..

   
 25. gaddeswarup Says:
 26. Sneha garu,
  Plese see whether this site helps:
  http://www.howstuffworks.com/
  If you click on 'science' at top right and see in:
  http://science.howstuffworks.com/
  there is a section on "Everyday Science".

   
 27. ramnarsimha Says:
 28. Ranjani garu,

  Thanks..for reply..

   
 29. స్నేహ గారు:
  మా సైన్స్ పుస్తకాలు ప్రచురిస్తున్నది ’మంచి పుస్తకం’ ప్రచురణలు. నా స్నేహితుడు సురేష్ కొసరాజు, ఆయన భార్య భాగ్యలక్ష్మి గారు దాన్ని నడిపిస్తున్నారు. ఒక సారి ఈ వెబ్సైట్ చూడండి.
  http://manchipustakam.in

  ఆ సైట్ లోనే వారి కాంటాక్ట్ సమాచారం ఉంది. మీకు నచ్చిన పుస్తకాలు చెప్తే మెయిల్ లో పంపుతారు. సైన్స్ యే కాక మిగతా రకాల పిల్లల పుస్తకాలు తెలుగులో ఎన్నో ఉన్నాయి ఆ సైట్ లో. ఏవైనా సమస్య ఉంటే చెప్పండి.

  రంజనిగారు, రామ్ నరసింహ్ గారు:
  మా నాగప్రసాదు, నేను ఎన్నో సార్లు అనుకున్నాము. తెలుగులో అక్కడక్కడ ఉన్న సైన్స్ లింకులని ఒక చోట చేరుస్తూ ఓ సైట్ తయారుచెయ్యాలని. ఇంతవరకు కుదరలేదు. నాగప్రసాదు ఈ మధ్యనే తన చదువు పూర్తిచేసుకుని ఉద్యోగంలో చేరడం జరిగింది. కనుక కొంచెం బిజీగా ఉన్నాడు. ఇక్కడ మా శిష్యులని అడుగుతాను అలాంటిదేమైనా వీలవుతుందేమో. వీలైనంత త్వరలో అలాంటిది చెయ్యడానికి ప్రయత్నిస్తాను.

  చంద్రమౌళి గారి సైట్ చాలా బావుంది.

   
 30. ramnarsimha Says:
 31. Sir,

  Thanks..for informing about www.manchipustakam.net

   

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email