శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

ప్రాజెక్ట్ స్కూల్ లైబ్రరీ

Posted by V Srinivasa Chakravarthy Saturday, July 4, 2015


ప్రియమైన బ్లాగర్లకి

గత ఏడాది చేపట్టిన ‘ప్రాజెక్ట్ స్కూల్ లైబ్రరీ’ ముగిసింది. ఆంధ్రా, తెలంగాణా ప్రాంతాల్లో 330 తెలుగు మీడియం బడులకి ఉచితంగా ఈ కింది 6 పుస్తకాలు పంపడం జరిగింది.
1.     ఆల్బర్ట్ ఐన్‍స్టయిన్ – వైజ్ఞానిక విప్లవకారుడు
2.    ఐసాక్ న్యూటన్ – జీవితం, కృషి
3.    పాతాళానికి ప్రయాణం – జూల్స్ వెర్న్ రాసిన Journey to the Center of the Earth కి అనువాదం
4.    రసాయనిక శాస్త్ర చరిత్ర – 1వ భాగం. ఐసాక్ అసిమోవ్. (తెలుగు అనువాదం)
5.    రసాయనిక శాస్త్ర చరిత్ర – 2వ భాగం. “
6.    రసాయనిక శాస్త్ర చరిత్ర – 3వ భాగం. “
ఇందులో భాగంగా వ్యాస రచన పోటీ కూడా నిర్వహించబడింది. అందులో పాల్గొన్న విద్యార్థులకి ఉచితంగా వాళ్లు అడిగిన పుస్తకాల ప్రతులు పంపించడం జరిగింది.
ఈ ఏడాది కూడా ఇదే ప్రాజెక్ట్ మళ్లీ నిర్వహించబోతున్నాం. ఈ సారి మరి కొన్ని కొత్త, సైన్స్ పుస్తకాలు ప్రచురించి పంపడం జరుగుతుంది.
ఈ ప్రాజెక్ట్ లో ఎవరైనా స్కూలు టీచర్లు పాల్గొని, పుస్తకాలు పిల్లలకి అందే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. పుస్తకాలలోని అంశాలని టీచర్లు చదివి, పిల్లల చేత చదివించి, ఆ విషయాలు పిల్లలతో చర్చించే ప్రయత్నం చేస్తే బావుంటుంది. అలాంటి ఆసక్తి కల టీచర్లు ఎవరైనా ఉంటే నన్ను సంప్రదించవలసిందని మనవి.

-      శ్రీనివాస చక్రవర్తి

16 comments

  1. నమస్కారం. నాపేరు చైతన్య కుమార్‌ సత్యవాడ. నాది పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి. నేను జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, టి.నర్సాపురం నందు సైన్సు ఉపాద్యాయునిగా పనిచేయుచున్నాను. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని కనుక, నా ఖాళీ సమయాల్లో నిరుద్యోగ అభ్యర్ధులకు అవసరం అయ్యే స్టడీమెటీరియల్‌ను రూపొందించి, నవచైతన్య కాంపిటీషన్స్‌ పేరుతో ఒక బ్లాగు ప్రచురిస్తున్నాను. మీరూ చూడవచ్చు. www.menavachaitanyam.blogspot.com
    మీ శాస్ర్తవిఙ్ఞానం బ్లాగులో ప్రాజెక్ట్‌ సైన్సు లైబ్రరీ నేను చదివాను. మరికాస్త వివరంగా చెప్పగలరా? మా పాఠశాలనుంచి పాల్గొనడానికి, పుస్తకాలను మా పాఠశాల లైబ్రరీకు పొందడానికి నేను ఏమి చేయాలి?
    మీ
    చైతన్యకుమార్‌ సత్యవాడ
    ఫోన్‌ 9441687174
    email menavachaitanyam@gmail.com

     
  2. నమస్కారం. నాపేరు చైతన్య కుమార్‌ సత్యవాడ. నాది పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి. నేను జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, టి.నర్సాపురం నందు సైన్సు ఉపాద్యాయునిగా పనిచేయుచున్నాను. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని కనుక, నా ఖాళీ సమయాల్లో నిరుద్యోగ అభ్యర్ధులకు అవసరం అయ్యే స్టడీమెటీరియల్‌ను రూపొందించి, నవచైతన్య కాంపిటీషన్స్‌ పేరుతో ఒక బ్లాగు ప్రచురిస్తున్నాను. మీరూ చూడవచ్చు. www.menavachaitanyam.blogspot.com
    మీ శాస్ర్తవిఙ్ఞానం బ్లాగులో ప్రాజెక్ట్‌ సైన్సు లైబ్రరీ నేను చదివాను. మరికాస్త వివరంగా చెప్పగలరా? మా పాఠశాలనుంచి పాల్గొనడానికి, పుస్తకాలను మా పాఠశాల లైబ్రరీకు పొందడానికి నేను ఏమి చేయాలి?
    మీ
    చైతన్యకుమార్‌ సత్యవాడ
    ఫోన్‌ 9441687174
    email menavachaitanyam@gmail.com

     
  3. చైతన్య గారు,
    రేపే మీ బడికి పుస్తకాలు పంపుతాను. ఆ పుస్తకాలని మీ స్కూల్ లైబ్రరీలో ఉంచి పిల్లలకి అందేలా చేస్తే చాలు. పుస్తకాలని చదివిన పిల్లలు వాటిలో ఏదో ఒక పుస్తకం మీద క్లుప్తంగా వ్యాసం రాసి నాకు పంపినట్టయితే, ఆ పుస్తకాల్లో ఆ పిల్లలు కోరిన పుస్తకం కాపీ వారికి ప్రత్యేకంగా పంపబడుతుంది. వ్యాసపోటీ వివరాలు పుస్తకాల తో పాటు వచ్చే ఉత్తరంలో ఉంటాయి.

     
  4. THANKYOU SIR

     
  5. జిల్లాపరిషత్ హైస్కూల్, దిరిశవంచ, పెదారికట్ల(పోస్ట్), ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 523245,. మీకు వీలైతే పుస్తకాలు పంపగలరు.

     
  6. ప్రాజెక్ట్ స్కూల్ లైబ్రరీలో భాగంగా మీరు పంపిన పుస్తకాలు మా పాఠశాలకు అందాయి సర్,. ధన్యవాదాలు.

     
  7. http://bhaskar321.blogspot.in/2015/07/blog-post_17.html

     
  8. నేను జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల,లోలుగు,పొందూరు మండలం,శ్రీకాకుళం జిల్లా లో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేయుచున్నాను. మా పాఠశాల లైబ్రరీకి ఏవైనా పుస్తకాలు పంపించగలరా?

    కె.వి.రమణ,ఉపాధ్యాయులు
    https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF:Kvr.lohith

     
  9. కె.వి. రమణ గారు. తప్పకుండా పంపుతాను. మీ పూర్తి చిరునామా పిన్ కోడ్ తో పాటు దయచేసి పంపండి.

     
  10. k.venkataramana
    school assistant(physical science)
    D.No.1.1.47,
    Balaga 1st ward
    Srikakulam-532001



     
  11. ప్రాజెక్ట్ స్కూల్ లైబ్రరీలో భాగంగా మీరు పంపిన పుస్తకాలు మా పాఠశాలకు అందాయి సర్,. ధన్యవాదాలు.

     
  12. శ్రీనివాస చక్రవర్తి గారికి,
    మీరు పంపిన పుస్తకాలలో విషయాలు చాలా ఆసక్తి కలిగించే విధంగా ఉన్నాయి.మా విద్యాబోధనలో మీ పుస్తలాల పాత్ర ఎంతో ఉంది. న్యూటన్ గమన నియమాల పాఠం చెప్పేటప్పుడు మీరు అందించిన న్యూటన్ జీవిత చరిత్ర పుస్తకంలో విషయాలను తెలియజేసాను. అందులో అంశాలు సాధారణ విద్యార్థులకు కూడా ప్రేరణ కలిగించే విధంగా ఉన్నాయి. యిటువంటి పుస్తకాలనుయిచ్చి ఎంతో ఉపకారం చేసినందుకు ధన్యవాదాలు.

    కె.వి.రమణ,

     
  13. రమణ గారు! పుస్తకాలు మీ బోధనలో ఉపయోగపడుతున్నందుకు సంతోషం. పిల్లలకి కూడా అవి స్ఫూర్తి దాయకంగా ఉన్నాయంటే నాకు కావలసింది అంతకన్నా ఏముంది!!!

     
  14. శ్రీనివాస చక్రవర్తి గారికి నమస్కారం.

    నా పేరు జయన్న​.

    నేను ZPHS, పూడూరులో తెలుగు ఉపాధ్యాయుడిగా

    ,పాఠశాల గ్రంథాలయ బాధ్యులుగా పనిచేస్తున్నాను.
    వీలైతే మా పాఠశాల విద్యార్థులకు మీ పుస్తకాలు
    పంపితే రుణపడి ఉంటాం.
    ధన్యవాదాలు
    Address:
    N.Jayanna,SA,
    ZPHS,PUDUR
    Gadwal Mandal
    Mahabubnagar Dist.
    PIN: 509125

     
  15. గౌ. శ్రీనివాస చక్రవర్తి గారికి నమస్కారములు.
    ఆర్యా!
    మీరు పంపిన పుస్తకాలు ఈ రోజే(11.03.2016) అందినవి. చాలా సంతోషం. ధన్యవాదాలు. మీ శ్రమ, మీ ఉదారత వృధా కాకుండా మా బడి పిల్లలలో శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించడానికి ఈ పుస్తకాలను సద్వినియోగ పరుచగలనని హామి ఇస్తున్నాను. మరో సారి ధన్యవాదాలు

     
  16. Uma Says:
  17. నమస్కారం. మీరు చేపట్టిన ‘ప్రాజెక్ట్ స్కూల్ లైబ్రరీ’ బోధనలో ఉపయోగపడుతున్నందుకు మా ధన్యవాదాలు. నేను ప్రాథమిక ఉన్నత పాఠశాల, M.కోటపాడు గ్రామం, మాడుగుల మండలం, విశాఖజిల్లాలో ఉన్నతోపాధ్యాయునిగా పనిచేయుచున్నాను. మా పాఠశాల లైబ్రరీకి ఏవైనా పుస్తకాలు పంపించగలరని ఆశిస్తున్నాము.
    Address
    CH. Venkateswarlu (Head Master)
    UPS School
    M. Kotapadu
    Madugula Mandalam
    KJ Puram Post
    Visakahapatnam District Pin 531028

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts