శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.



ఒక ఋషిలా న్యూటన్ తన అధ్యయనాలలో, ప్రయోగాలలో మునిగిపోయాడు న్యూటన్. కొన్ని సార్లు రోజుల తరబడి చీకటి గదిలో తన పుస్తకాల్లో, ధ్యానాల్లో బాహ్య ప్రపంచపు ధ్యాస లేకుండా మునిగిపోయేవాడు. రకమైన జీవన సరళి వల్ల తన ఆరోగ్యం మీద దుష్పరిమాణాలు యవ్వనం నుండే కనిపించసాగాయి. రాత్రిళ్ళు తన గదిలో నుండి దూరదర్శినితో తోకచుక్కలని చూసేవాడు. 1664 లో డిసెంబర్ నెలలో ఒక రోజు తెల్లవారు 4:30 గంటలకి కనిపించిన తోకచుక్క గురించి తన నోట్స్ పుస్తకంలో రాసుకున్నాడు. ఆకాశంలో అంత వేగంతో కదిలే వస్తువు లక్షణాలేంటి అని ఆలోచించేవాడు.

 

న్యూటన్ తన నోట్బుక్ లో తను చూసిన తోకచుక్క గురించి చేసిన వర్ణన, గీసిన చిత్రం

రాత్రి పూట ఖగోళ పరిశీలన ఒక రకమైన వ్యసనంగా పరిణమించింది. కారణం చేత అతనికి వేళ కాని వేళల్లో పడుకోవడం అలాటయ్యింది అంటాడు న్యూటన్ దూరపు బంధువైన జాన్ కాండ్యూట్ అనే వ్యక్తి. ట్రినిటీ లో మాస్టర్ (ప్రిన్సిపాలు లాంటి పదవి) గా పని చేసిన జాన్ నార్త్ అనే వ్యక్తి న్యూటన్ జీవన సరళి గురించి ఇలా అంటాడు -
ఎప్పుడూ ప్రయోగాల్లో మునిగిపోతాడు. ప్రయోగ సామగ్రి అందుబాటులో లేకపోతే ప్రాణం మీదకి వచ్చేలా పఠనంలో మునిగిపోతాడు.”

సైన్స్ పేరు చెప్పుకుని కొన్ని ప్రమాదకరమైన పనులు చేసేవాడు న్యూటన్. సూర్యుడి కేసి క్షణకాలం చూసి  దృష్టి వెంటనే మరేదైనా వస్తువు మీదకి మరల్చితే వస్తువు చుట్టూ పలువన్నెల లాస్యం కాసేపు కనిపిస్తుంది. మనోఫలకం మీద కాసేపు నాట్యాలాడి సమసిపోయే కాంతులు న్యూటన్ కి ఎంతో విస్మయం కలిగించేవి. ఇలాంటి కృత్యాల వల్ల న్యూటన్ చూపు దెబ్బతింది. కనుక కొన్ని నెలల పాటు చీకటి గదిలో నూనె దీపాల మసక వెలుతురులో తన పుస్తక పఠనంలో కాలక్షేపం చేశాడు. అలాంటి స్థితిలో కూడా కళ్ళు మూసుకుని సారి సూర్యుణ్ణి తలచుకుంటే విరాజమానమైన సూర్యబింబం కోటి కాంతులు చిలికిస్తూ మనోఫలకం మీద ప్రత్యక్షమయ్యేది. ఒక విషయం మీద రోజుల తరబడి, ఆహారవ్యవహారాలని లక్ష్యపెట్టక, మహోగ్రంగా ధ్యానించే తత్వం న్యూటన్ కి చాలా చిన్నతనం నుండే అలవడింది. తదనంతర కాలంలో అతణ్ణి ఎవరో అడిగారు, ఇంత తక్కువ కాలంలో ఇన్నివిషయాలు ఎలా కనుక్కున్నావని. అందుకు న్యూటన్ సమాధానం -  నిశ్చల మనస్సులో, ఎడతెరిపిలేని ధ్యానంలో సత్యం సాక్షాత్కరిస్తుంది.”

భౌతిక శాస్త్ర సాహిత్యంతో పాటు గణిత సాహిత్యం కూడా న్యూటన్ అధ్యయనాలలో చోటు చేసుకుంది. రోజుల్లో న్యూటన్ యొక్క గణిత అధ్యయనాల గురించి తదనంతరం తనకి ఆప్త మిత్రుడు, మేటి గణితవేత్త అయిన ఏబ్రహామ్ మ్వా ఇలా అంటాడు. ఒకసారి న్యూటన్ కి  జ్యోతిశ్శాస్త్రానికి సంబంధించిన పుస్తకం దొరికింది. విజ్ఞానానికి విరుద్ధమైన శాస్త్రం అయినా అందులో ఏముందో నన్న కుతూహలం కొద్దీ పుస్తకాన్ని తిరగేశాడు. జ్యోతిశ్శాస్త్రంలో గ్రహ గతుల గురించి జ్ఞానం తెలియాలి కనుక పుస్తకంలో ఎన్నో చోట్ల గ్రహాల స్థానాలని సూచించే చిత్రాలు వున్నాయి. చిత్రాలని అర్థం చేసుకోవాలంటే త్రికోణమితి (trigonometry)  అవసరం అన్న సంగతి తెలుసుకున్నాడు. త్రికోణమితి చదువుకోవడం కోసం రంగం మీద పుస్తకం తెచ్చి చదువుకోవడం మొదలెట్టాడు. అయితే పుస్తకం అంత సులభంగా కొరుకుడు పడలేదు. త్రికోణమితి రావాలంటే ముందు జ్యామితి (geometry)  తెలియాలి. కనుక జ్యామితి మీద ప్రాచీన గ్రీకు గణితవేత్త యూక్లిడ్  రాసిన పుస్తకం తెచ్చుకుని చదవడం ఆరంభించాడు. పుస్తకం న్యూటన్ కి అమితంగా నచ్చేసింది. అందులో ప్రతీ సూత్రం, ప్రతీ సిద్ధాంతం ఎంతో తర్కబద్ధంగా వర్ణించబడడం, నిరూపించబడడం అతడి మనసుని ఆకట్టుకుంది. తరువాత విలియమ్ ఆట్రెడ్ రాసిన Key to Mathematics (గణిత కౌముది)  అనే పుస్తకాన్ని క్షుణ్ణంగా చదివాడు. అది కాక ప్రఖ్యాత ఫ్రెంచ్ తాత్వికుడు, గణితవేత్త అయిన రేనే దే కార్త్’ (Rene des Cartes) విశ్లేషణాత్మక జ్యామితి (analytical geometry)  మీద చేసిన రచనలు కూడా చదివాడు. విధంగా కేవలం స్వాధ్యాయం చేతనే రోజుల్లో లభ్యమైన గణిత ఉపకరణాలని, భావనలని లోతుగా అర్థం చేసుకున్నాడు న్యూటన్. అయితే తదనంతర కాలంలో గ్రహ గతుల గురించి తన నూతన భావాలని వ్యక్తం చెయ్యడానికి గణితం సరిపోదని, మరో కొత్త గణితం అవసరం అవుతుందని త్వరలోనే గుర్తించాడు.

కాలచక్రం గిర్రున తిరిగింది. నాలుగేళ్ళు ఇట్టే గడచిపోయాయి. 1665 లో బీ.యే. ఫైనలు పరీక్షలు తీసుకోవలసిన సమయం వచ్చింది. ఉన్న విజ్ఞానాన్ని లోతుగా అర్థం చేసుకోవడం వేరు, పరీక్షల్లో మార్కులు సంపాదించడం వేరు. రెండిటికీ  పెద్దగా సంబంధం లేకపొవడం పరీక్షా పద్ధతిలోనే విచారకరమైన విషయం. ట్రినిటీ కాలేజిలో రోజుల్లో అవలంబించబడ్డ పద్ధతులు చాలా పాతకాలపు నాటివి. ఎక్కువగా తర్కానికి, సంవాదానికి ప్రాముఖ్యత వుండేది. అలాంటి మతిలేని పరీక్షల మీద నమ్మకం లేకపోయినా న్యూటన్ పరీక్షలు తీసుకున్నాడు.

మొత్తం వైజ్ఞానిక చరిత్రలోనే అగ్రస్థానంలో నిలిచిన మహా శాస్త్రవేత్త 25  మంది తీసుకున్న పరీక్షలో రెండవ స్థానంలో నిలిచాడు.

(ఇంకా వుంది)

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts