మనకి తెలిసిన చరిత్రలో క్రీ.శ. ఒకటవ శతాబ్దానికి చెందిన ఇటాలియన్ తాత్వికుడు లూసియస్ ఏనియస్ సెనెకా ఈ
పట్టకాల గురించి రాశాడు. పలు సమతల ముఖాలు గల
గాజు కడ్డీలకి ఓ ప్రత్యేకమైన లక్షణం వుంటుందన్నాడు. అలాంటి కడ్డీల మీద
కాంతి వాలు కోణం వద్ద పడినప్పుడు ఆ
కడ్డీలలోంచి ఇంద్రధనుస్సులో కనిపించే కాంతులు పుడతాయని అతడు వర్ణించాడు. ప్లైనీ ద ఎల్డర్ అనే మరో ఇటాలియన్ తాత్వికుడు ఐరిస్ అనే మణి కి కూడా ఇలా తెల్లని కాంతిని రంగుకాంతులుగా మార్చే లక్షణం వుందని రాశాడు.
రంగులు ఎలా పుడతాయి అన్న సమస్య గురించి ఆ
రోజుల్లో కొన్ని చిత్రమైన సిద్ధాంతాలు చలామణిలో వుండేవి.
వాటిలో ముఖ్యమైనది క్రీ.పూ. నాలుగవ శతాబ్దానికి చెందిన అరిస్టాటిల్ ప్రతిపాదించిన రంగుల సిద్ధాంతం. అరిస్టాటిల్ కాలంలో పంచభూతాలు (మట్టి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం) అనే భావన చాలా ప్రధానంగా వుండేది.
ఎన్నో భౌతిక ప్రక్రియలని ఈ
పంచభూతాలనే భావన
సహాయంతో వివరించడానికి ప్రయత్నించేవారు. రంగులకి ఈ
భూతాలకి సంబంధం వుందన్నాడు అరిస్టాటిల్. పైగా రంగులన్నీ తెలుపు,
నలుపు అనే రెండు వర్ణాల మిశ్రమం అన్నాడు.
తెలుపు, నలుపుల పాలు మారుతుంటే రంగు మారుతుంటుంది అని భావించాడు. పూర్తి తెలుపు,
పూర్తి నలుపు అనే ధృవాల మధ్య వరుసగా పసుపు,
ఎరుపు, వయొలెట్, ఆకుపచ్చ, నీలం వున్నాయన్నాడు. పంచభూతాలలో నీరు,
గాలి, మట్టి అనే భూతాలని తెలుపు రంగుతోను,
అగ్నిని పసుపు రంగుతోను ముడిపెట్టాడు. అయితే అసలు ఈ “భూతాలు” అంటే ఏమిటి, వాటికి రంగులకి సంబంధం ఎలా వచ్చింది? మొదలైన ప్రశ్నలకి కచ్చితమైన సమాధానాలు లేవు.
1637
లో ఫ్రెంచ్ తాత్వికుడు రేనే
దే కార్త్ రంగుల గురించి కొన్ని ఆసక్తికరమైన పరిశీలనలు చేశాడు. వర్షపు చినుకులు పట్టకాలలా పని చేసి తెల్లని కాంతిని రంగులుగా మార్చుతాయి కనుకనే ఇంద్రధనుస్సు ఉద్భవిస్తుందని రాశాడు.
ఇలాంటి నేపథ్యంలో న్యూటన్ తను కొని తెచ్చుకున్న పట్టకంతో ఓ
చక్కని ప్రయోగం చేసి చూశాడు. వూల్స్ థార్ప్ లో
తను ఉండే ఇంట్లో, మేడ మీద పడగ్గదిలో గోడకి 1/8
ఇంచిల కన్నం చేశాడు. ఆ కన్నం లోంచి సూర్య కాంతి సన్నని కాంతి పుంజం రూపంలో గదిలోకి ప్రసరించేలా ఏర్పాటు చేసుకున్నాడు.
ఆ పుంజాన్ని తన పట్టకం లోంచి పోనిచ్చాడు. అప్పుడు పట్టకం అవతలి వైపు నుండి వచ్చిన కాంతులు అవతలి పక్క వున్న గోడ మీద పడగా ఏర్పడ్డ చిత్రం చూసి
న్యూటన్ ఆశ్చర్యపోయాడు. హరివింటి వన్నెలన్నీ ఆ
గోడ మీద అందంగా లాస్యం చేస్తున్నాయి. అయితే దే కార్త్ వర్ణించిన విధంగా రంగులు వలయాకార రేఖలుగా ఏర్పడలేదు. అందుకు భిన్నంగా సమాంతరమైన చారలుగా గోడ మీద ప్రత్యక్షం అయ్యాయి.
ఆ చారలలో ఒక చివర ఎరుపు, అవతలి చివర వయొలెట్ రంగులు కనిపించాయి.
న్యూటన్ పట్టకంతో చేస్తున్న ప్రయోగం
పట్టకం లోంచి తెల్లని కాంతి ప్రసరించినప్పుడు పలు రంగులు పుడతాయన్న విషయం న్యూటన్ కొత్తగా కనుక్కున్నది కాదు. అది అంతకు ముందే తెలుసు. కాని అలా ఎందుకు జరుగుతుంది అన్న దానికి న్యూటన్ కి పూర్వులు ఇచ్చిన వివరణ ఇలా ఉండేది. న్యూటన్ కి
పూర్వులు కాంతి ఒక తరంగం అని భావించారు. కాంతి ఒక తరంగం అని వాదించిన వారిలో ప్రథముడు రేనే దే కార్త్. తెల్లని కాంతి లో వుండే తరంగాలు పట్టకం లోంచి ప్రసరించినప్పుడు “కలుషితమై” పలు రంగులుగా వ్యక్తమవుతాయి. అది గాజులోంచి కాంతి ప్రసారం అయినందువల్ల జరిగిన దుష్ప్రభావం అన్నమాట. కనుక ఎంత ఎక్కువ గాజు లోంచి కాంతి ప్రసరిస్తే అంతగా ఆ “కాలుష్యం” జరుగుతుందని అనుకోవాలి.
కాని అలాంటి ఆలోచన తప్పని న్యూటన్ నిరూపించదలచాడు. పట్టకంతో పైన చెప్పుకున్న ప్రాథమిక ప్రయోగం చేశాక మరో చక్కని, రెండవ ప్రయోగం కూడా చేసి అంతవరకు పట్టకం గురించి, రంగుల గురించి వున్న ఓ అపోహని తొలగించాడు.
కింద చిత్రంలో చూపించినట్టు ఈ
సారి రెండు పట్టకాలని ఒక
దాని తరువాత మరొకటి ఉండేలా ఏర్పాటు చేశాడు. మొదటి పట్టకంలోంచి ప్రసారమైన తెల్లని కాంతి అవతలికి వచ్చి రెండవ పట్టకంలోకి ప్రవేశిస్తుంది. పూర్వులు అనుకున్నది నిజం
అయితే రెండవ పట్టకం లోంచి పైకి వచ్చిన కాంతిలో మరిన్ని రంగులు కనిపించాలి.
కాని అందుకు విరుద్ధంగా రెండవ పట్టకం లోంచి బయటికి వచ్చిన కాంతి తెల్లని కాంతి అని న్యూటన్ నిరూపించాడు.
న్యూటన్ చేసిన ‘రెండు పట్టకాల ప్రయోగం.’
తెల్లని కాంతి మొదటి పట్టకం లోంచి ప్రసారమై ఏడు రంగులుగా విడిపోతుంది. ఆ ఏడు రంగుల కాంతి రెండవ పట్టకం లోంచి ప్రసారమై మళ్లీ తెల్లని కాంతిగా బయటికి వస్తుంది.
ఈ రకమైన ప్రభావానికి కారణం కాంతి వక్రీభవనమే నని
న్యూటన్ మొదటే గుర్తించాడు. ఒక యానకం లోంచి మరో యానకం లోకి ప్రవేశించిన కిరణం రెండు యానకాల సరిహద్దు వద్ద వంగుతుంది. దీన్నే వక్రీభవనం అంటారు.
(ఇంకా వుంది)
Nice information.
Can u suggest any blogs regarding programming.
Nice information.
Can u suggest any blogs regarding programming.
2 పట్టకాల ప్రయోగం is new to me. Randomly I landed on this page but learnt a new point which is worth!