అసలే
ఎంతో
కాలంగా
హూక్
మీద
కాస్త
కచ్చ
వున్న
ఓల్డెన్
బర్గ్
ఆ
ఉత్తరాన్ని రాయల్ సొసయిటీ లో సభాముఖంగా ప్రముఖుల ముందు చదివాడు. దాంతో హూక్ కి తలకొట్టేసినట్టయ్యింది.
ఆ
స్పందనతో
హూక్
తో
న్యూటన్
వివాదం
కొంత
కాలం
వరకు
సద్దుమణిగింది.
కొంతకాలం
పాటూ
వివాదాలు
లేని
ప్రశాంతత
నెలకొంది.
కాని
1672 లో ఓ కొత్త కోణం నుండి విమర్శ మొదలయ్యింది. గతంలో న్యూటన్ సిద్ధాంతాలని ఆకాశానికెత్తిన క్రిస్టియాన్ హైగెన్స్ కాంతి యొక్క తత్వం మీద న్యూటన్ భావాల మీద సందేహాలు వెలిబుచ్చుతూ రాయల్ సొసయిటీకి ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరాన్ని రాయల్ సొసయిటీ అధికారులు న్యూటన్ కి అందజేశారు. అందుకు ఏదో సమాధానం చెప్తాడని ఎదురుచూస్తున్న సొసయిటీ, న్యూటన్ స్పందన విని అదిరిపోయారు. “అయ్యా! దయచేసి రాయల్ సొసయిటీ లో సభ్యత్వ స్థానం నుండి నాకు విముక్తి ప్రసాదించమని వేడుకుంటున్నాను. మీ సదస్సు గౌరవనీయమైనది అనడంలో నాకు సందేహం లేకపోయినా, ఈ సభ్యత్వం నుండి గాని, ఈ సమావేశాల నుండి గాని నేను బావుకునేది ఏమీ లేదని నా అభిప్రాయం” అని ఆ ఉత్తరం లోని సారాంశం.
ఆ
తరువాత
మరో
రెండున్నర
సంవత్సరాల
పాటు
న్యూటన్
తన
సిద్ధాంతాల
మీద
వచ్చిన
విమర్శలకి
స్పందించడం
మానుకుని
మౌనవ్రతం
పాటించాడు. ఇక్కడే మనకి వైజ్ఞానిక విమర్శల విషయంలో న్యూటన్ స్పందించిన తీరు కాస్త విడ్డూరంగా కనిపిస్తుంది. విమర్శ అనేది వైజ్ఞానిక భావనల పరిణామ క్రమంలో ఒక ముఖ్యమైన అంశం. అసలైన శాస్త్రవేత్త ఆ విమర్శని సద్భావంతో స్వీకరించి, తన సిద్ధాంతంలో దోషాలేమైనా వున్నాయేమో మరో సారి సరి చూసుకుని, ఆ విమర్శకి స్పందించాలి. కాని న్యూటన్ విషయంలో అలాంటి ప్రవృత్తి కనిపించదు. తను చెప్పిందే వేదం, ఇక అందులో దోషం అన్న ప్రసక్తే వుండదు, కనుక దాని మీద ఇక వివాదాలకి ఆస్కారం లేదు – అన్నట్టుగా ఉంది అతడి వైఖరి.
నిజానికి
హూక్
వ్యక్తం
చేసిన
అభ్యంతరం
సరైనదే.
తను
పేర్కొన్న
ప్రయోగాలలో
కాంతి
నిజంగానే
తరంగ
లక్షణాలని
చూపిస్తుంది.
మరి
అది
ఎలా
సాధ్యం
అన్న
ప్రశ్నకి
న్యూటన్
నుండి
సరైన
సమాధానం
లేదు.
కాంతి
కణ
సిద్ధాంతంతో
న్యూటన్
కాంతి
యొక్క
పరావర్తన,
వక్రీభవన
లక్షణాలని
వివరించగలిగాడు.
అది
నిజమే.
కాని
కాంతిని
తరంగంగా
ఊహించుకుంటూ
కూడా
హైగెన్స్
అవే
లక్షణాలని
అద్భుతంగా
వివరించగలిగాడు.
మరి
దానికి
కూడా
న్యూటన్
స్పందించలేదు.
అసలు
ఆ
ఊసే
వద్దు
పొమ్మన్నాడు.
అయితే
కాంతి
కణమా,
తరంగమా
అన్న
విషయం
సులభంగా
తేలే
విషయం
కాదు.
ఆ
విషయం
తేలడానికి
వైజ్ఞానిక
ప్రపంచం
ఇరవయ్యవ
శతాబ్దం
వరకు
ఆగవలసి
వచ్చింది.
విషయం
ఎంత
జటిలం
అయినా
అసలు
సంవాదమే
వద్దు,
చర్చ
అంటే
గిట్టదు
అనే
వైఖరి
మాత్రం
వైజ్ఞానిక
ప్రపంచంలో
తగని
పద్ధతి
అని
చెప్పాల్సి
వుంటుంది.
బహుశ
న్యూటన్
సంవాదానికి
ఒప్పుకుని
హూక్,
హైగెన్స్
వంటి
వారితో
చర్చకి
దిగి
వుంటే,
కాంతి
శాస్త్రం
యొక్క
చరిత్ర
మరోలా
వుండేదేమో.
న్యూటన్
హూక్
ల
మధ్య
వైరం
ఎన్నో
ఏళ్లు
సాగింది.
వీరి
కలహగాధల
సెగలు
రాయల్
సొసయిటీ
ని
పూర్తిగా
క్రమ్ముకున్నాయి.
నూతన
వైజ్ఞానిక
ఆవిష్కరణల
గురించి
తెలుసుకోడానికి
కాక,
న్యూటన్
హూక్
ల మధ్య కలహాల కథలు విని వినోదించడానికే సొసయిటీ సభ్యులు వస్తున్నారా అన్నట్టు అయ్యింది. అసలు న్యూటన్, హూక్ ల మధ్య ఉత్తరప్రత్యుత్తరాలన్నీ సెక్రటరీ ఓల్డెన్ బర్గ్ చేతుల మీదుగా జరుగుతున్నాయి కనుక, ఇతగాడే ఒకరి మీద ఒకరికి లేని పోనివి చెప్పి కలహభోజనం ఆరగిస్తున్నాడేమో నని కూడా కొందరు అభిప్రాయ పడ్డారు. అలాంటి వారిలో హూక్ కూడా వున్నారు.
కాని
ఎంతటి
శత్రుత్వనికైనా
ఏదో
ఒకనాడు
తెర
పడక
తప్పదు.
ఆ
తెర
పడడానికి
కారణం
హూక్
మనసు
కాస్త
మెత్తబడడం ఒక కారణం. ఇంత కాలం ఇద్దరి మధ్యా ఘర్షణకి ముఖ్య కారణం సిద్ధాంతాలలో మౌలికమైన భేదం వుండడం. హూక్ సిద్ధాంతం మాట ఎత్తితే న్యూటన్ “ముందు నేను చేసిన ప్రయోగం చేసి చూపించి, అప్పుడు మాట్లాడవయ్యా పెద్దమనిషీ” అంటూ ఆ ప్రశ్నని దాటేయడం జరుగుతూ వచ్చింది. అన్నేళ్ల పాటు మరి ఎందు చేతనో హూక్ కి న్యూటన్ చేసిన ఆ ‘కీలక ప్రయోగాన్ని’ చెయ్యడానికి సాధ్యం కాలేదు. కాని 1676 మరి ఏం అదృష్టం కలిసొచ్చిందో ఏమో హూక్ ఆ ప్రయోగం విజయవంతంగా చెయ్యగలిగాడు. ఆ నేపథ్యంలో న్యూటన్ కి సాదరంగా ఇలా ఉత్తరం రాశాడు. కొందరు గిట్టని వాళ్ళు ఇద్దరు స్నేహితుల మధ్య కలహం పెట్టి వినోదిస్తున్నారని,
వాళ్ల
‘దుశ్చర్య’ల గురించి తనకి బాగా తెలుసని అన్నాడు. “మన ఇద్దరి లక్ష్యమూ ఒక్కటే. ఆ లక్ష్యం సత్యాన్వేషణ, సత్యసాధన. అలాంటి మహోన్నతమైన లక్ష్య సాధనలో ఇలాంటి చిన్న చిన్న చికాకులు తప్పవు. వాటిని సహించి, భరించి ముందుకు పోవాలి,” అంటూ అనునయిస్తూ రాశాడు.
అందుకు
న్యూటన్
సముచితంగా
స్పందించి
ఇలా
జాబు
రాశాడు.
“రంగుల సిద్ధాంతంలో దే కార్త్ మొదటి మెట్టు వేశాడు. దాన్ని మీరు ఇంకా ఎంతో ముందుకి తీసుకుపోయారు. ముఖ్యంగా సన్నని పొరలలో కనిపించే రంగుల చర్చలో ఎంతో ప్రగతి సాధించారు. నేను అంత కన్నా దూరం చూడగలిగాను అంటే, దానికి కారణం నేను దిగ్గజాల భుజస్కంధాల మీద నిలుచుని వుండడమే.”
న్యూటన్
స్పందనని
పైపైన
చదివితే
తనకి
పూర్వులకి
తగ్గ
గుర్తింపు
ఇస్తూ,
వాళ్ల
బోధనల
తోడ్పాటు
వల్లనే
మరో
మెట్టు
ముందుకు
వెళ్లగలిగాను
అన్న
సవినయమైన
భావప్రకటన
కనిపిస్తోంది. కాని కాస్త లోతుగా చూస్తే, ‘నీ కన్నా నేనే ఎక్కువ తెలుసుకోగలిగాను, అంటే ఈ చిరకాల పోరాటంలో ఆఖర్న గెలుపు నాదే’ నన్న అహంకారంతో కూడిన ప్రకటన లీలగా కనిపిస్తోంది. న్యూటన్ తత్వం తెలిసిన నిపుణులు ఈ ఉత్తరంలో న్యూటన్ హూక్ కి మరో చురక కూడా అంటించాడు అంటారు. హూక్ కాస్త పొట్టి వాడు. “నేను మహాకాయుల భుజస్కందాల మీద నిలుచోబట్టే మరింత దూరం చూడగలిగాను” అన్నది కేవలం బాహ్యార్థం మాత్రమే. నిజానికి అందులో వ్యంగ్యం వుంది. “నీ బోటి మరుగుజ్జు మీద నిలుచుని నేను ఏ పాటి దూరం చూడగలను?” అన్నది గూఢార్థం అని నిపుణులు అన్వయిస్తారు.
(ఇంకా వుంది)
0 comments