
అన్యధరా జీవులు ఎలా ఉంటారో నేను చెప్పే స్థితిలో లేను. నాకు తెలిసిన జీవం ఒక్కటే. అది భూమి మీద కనిపించే జీవం. నాకు కనిపిస్తున్నది నా ఊహకి కళ్లెం వేస్తోంది. కొంతమంది (సైఫై రచయితలు, కళాకారులు వంటివారు) ఇతర ప్రపంచాల మీద జీవులు ఎలా ఉంటారో ఊహించారు. అలాంటి అన్యధరా ఊహాగానాల పట్ల నాకు కొంచెం సందేహమే. ఆ ఊహలన్నీ మనం ప్రస్తుతం తెలిసిన జీవన ఆకృతుల మీద అతిగా ఆధారపడి ఉన్నాయి. ప్రతీ జీవరాశి వెనుక వ్యక్తిగతంగా అసాధారణమైన ఎన్నో పరిణామాల పరంపర ఉంటుంది....
postlink