
కొన్ని
తారలు సూర్యోదయానికి కాస్త ముందుగా గాని, సూర్యాస్తమయానికి కాస్త వెనుకగా
గాని ఉదయిస్తాయి. అవి ఉదయించే స్థానం, కాలం ఋతువుల
బట్టి మారుతుంటుంది. ఏళ్ల తరబడి తారలని పరిశీలిస్తూ, వాటి చలనాలని నమోదు చేస్తూ పోతే ఋతువుల రాకపోలని నిర్ణయించవచ్చు. అలాగే సూర్యుడు దిక్చక్రం (horizon) మీద
సరిగ్గా ఎక్కడ ఉదయిస్తున్నాడో తెలిస్తే, ఏడాదిలో ఎక్కడ
ఉన్నామో గుర్తుపట్టగలం. శ్రద్ధగా పరిశీలనలు చేసి వాటిని నమోదు చేసుకునే ఓపిక ఉన్నవారికి ఆకాశం అంతా...
postlink