మొదటీ రెండు
ఉత్పాతాల తరువాత బెదిరిపోయిన వడ్రంగులు క్రైస్తవ సంజ్ఞలు చేసుకుంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకున్నారు. మూడవ ఉత్పాతం తరువాత వాళ్లు వెనక్కి తూలి భవనం వెనుక ఉన్న కట్టెముక్కల మీద పడిపోయారు. వాళ్లలో కొందరు
పూర్తి దిగ్ర్భాంతితో, భయంతో చచ్చినంత పని చేశారు. వాళ్లని ఎలాగో
శాంతపరచి ఫరవాలేదని ధైర్యం చెప్పడానికి ప్రయత్నించాను. అందరం పని పక్కన బెట్టి పల్లె దారి పట్టాము. అక్కడ జనం
అంతా ఇళ్లలోంచి బయటికి వచ్చి జరిగిన ఉత్పాతాల గురించి భయం భయంగా మాట్లాడుకుంటున్నారు.
అప్పుడు నేను
పొలంలో ఉన్నాను… అప్పుడే ఓ
గుర్రాన్ని నొల్లకి కట్టీ, మరో గుర్రాని
కట్టబోతుంటే, కుడి వైపున ఓ పెద్ద శబ్దం
వినిపించింది. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఓ బారైన వస్తువు
నిప్పులు చెరుగుతూ ఆకాశంలో ఎగిరొస్తూ కనిపించింది. దాని ముందు భాగం దాని తోక కన్నా మరింత వెడల్పుగా వుంది. పగటిపూట మంట
ఏ రంగులో కనిపిస్తుందో
ఆ రంగులో వుందా
మంట. సూర్యుడి
కన్నా చాలా పెద్దగా వుంది. కాని కాంతి
ఇంకా తక్కువగా వుంది. ఎందుకంటే దాన్ని
నేరుగా కంటితో చూడడానికి వీలయ్యింది. మంటల వెనుక దుమ్ము రేగినట్టు బాటలు కనిపిస్తున్నాయి. ఆ ధూళిబాటలో చిన్న
చిన్న పొగమబ్బులు ఏర్పడ్డాయి. మంటల వెనుక నీలపు చెమ్కీల లాంటివి మెరుస్తున్నాయి… మంటలు కనుమరుగు కాగానే తుపాకి చప్పుళ్ల కన్నా పెద్ద పెద్ద చప్పుళ్లు వినిపించాయి. నేల కంపించింది. కిటికీ అద్దాలు పెళ్లున పగిలాయి.
కాన్ నది
ఒడ్డున ఉన్ని బట్టలు ఉతుక్కుంటున్నాను. ఉన్నట్లుండి ఓ భయపడ్డ పిట్ట
రెక్కల చప్పుడు వంటి చప్పుడు వినిపించింది… నదిలో నీరు ఉవ్వెత్తున పొంగింది. ఆ తరువాత
ఎంత పెద్ద చప్పుడు వినిపించిందంటే ఆ అదురుపాటుకి ఆ
పనివాడు … నీట్లో పడిపోయాడు.””
ఆ దారుణమైన
సంఘటనని తుంగుష్కా ఘటన అంటారు. అంతరిక్షం లోంచి
కొట్టుకొచ్చిన ప్రతి-పదార్థం (antimatter) భూమి
మీద ఉండే మామూలు పదార్థంతో కలసినప్పుడు ఏర్పడ్ద విస్ఫోటం అది అని కొంతమంది శాస్త్రవేత్తలు వాదించారు. కాని అభిఘాతం
జరిగిన చోట రేడియోథార్మిక (radioactive) చిహ్నాలేవీ లేకపోవడం వల్ల ఆ సిద్ధాంతం బలహీనపడింది. ఇక మరి కొందరు ఏకంగా ఓ నల్లబిలం (black hole) సైబీరియాలో
భూమి లోంచి దూసుకుపోయి అవతలి పక్క నుండి బయటికి వచ్చింది అని వాదించారు. కాని వాతావరణంలో
ఏర్పడ్డ ఘాతతరంగాల (shock waves) విశ్లేషణ బట్టి ఆ రోజు అట్లాంటిక్
మహాసముద్రాన్ని ఛేదించుకుంటూ ఎలాంటి వస్తువూ బయటికి పెల్లుబికినట్టు ఆధారాలు లేవు. లేకుంటే ఏదో
అన్యధరా నాగరికతకి చెందిన ఓ బ్రహ్మాండమైన అంతరిక్ష
నౌకలో ఏర్పడ్డ సాంకేత దోషం వల్ల, ఈ మారుమూల
గ్రహం మీద రాలిపోయింది కాబోలు. కాని అభిఘాతం
జరిగిన చోట అలాంటి నౌక యొక్క ఆనవాళ్లేవీ లేవు. అలా ఆ
ఘటనకి నానా రకాల వివరణలు సూచించారు. కాని ఈ
వివరణలు వేటినీ ఆధారాలు పెద్దగా సమర్ధించలేదు. ఇది మాత్రం నిజం. తుంగుష్కా ఘటనలో
ఓ బ్రహాండమైన విస్ఫోటం
సంభవించింది, గాల్లో ఓ పెద్ద ఘాత
తరంగం పుట్టింది, ఓ దారుణమైన
అరణ్యానలం ప్రబలింది. కాని ఘటన
జరిగిన చోట మాత్రం ఘాతం వల్ల బిలం వంటిది ఏర్పడలేదు. ఈ వాస్తవాలన్నీ
పరిశీలించిన మీదట ఇక ఒకే ఒక వివరణ మిగిలింది – “1908 లో ఓ తోకచుక్కకి చెందిన
ఓ శకలం భూమిని
ఢీకొంది.”
గ్రహాలని వేరు
చేసే విశాలమైన శూన్యంలో ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి. వాటిలో కొన్ని
రాళ్ళు, కొన్ని లోహపు
ముక్కలు. కొన్ని మంచుగడ్డలు. కొన్నిటి మీద కర్బన రసాయనాలు కూడా ఉంటాయి. ఆ వస్తువులు
పరిమాణంలో చిన్న ధూళి కణాల వద్ద నుండి నికరాగువా, భూతాన్ దేశాల
పరిమాణాన్ని పోలి వుంటాయి. దారిలో ప్రమాద
వశాత్తు వాటి దారికి ఏ గ్రహమో అడ్డు
రావచ్చు. తుంగుష్కా ఘటనకి
కారణం వంద మీటర్ల పరిమాణం కలిగి, ఏదో తోక
చుక్క నుండి పెల్లగించుకు వచ్చిన మంచు గడ్డ కావచ్చు. అంటే ఓ
ఫుడ్ బాల్ ఫీల్డ్ అంత పెద్దది అన్నమాట. పది లక్షల
టన్నుల బరువు కలిగి, సెకనుకి 30 కిమీల
వేగంతో అంటే గంటకి 70,000 మైళ్ల వేగంతో దూసుకు వచ్చి ఉండొచ్చు.
అలాంటి అభిఘాతం
ఈనాడు జరిగితే ఆ భయంలో అదేదో
కేంద్రక విస్ఫోటం అనుకుని పొరబడే అవకాశం వుంది. తోకచుక్కల అభిఘాతం, ఆ సమయంలో కనిపించే
అగ్నిగోళం, ఆ సమయంలో
పుట్టే పుట్టగొడుగు మేఘం, మొదలైన వన్నీ
ఓ మెగా టన్ను
బలం గల అణువిస్ఫోటాన్ని తలపించేలా ఉంటాయి. అయితే రెండు
లక్షణాల్లో మాత్రం పోలిక తప్పవుతుంది. తోకచుక్క అభిఘాతంలో గామా వికిరణాలు (gamma radiation) ఉండవు. రేడియోథార్మిక పర్యవసానాలు ఉండవు. అయితే అలాంటి
అరుదైన ప్రకృతిగతమైన ఉపద్రవం, తోకచుక్క అభిఘాతం, ఓ అణుయుద్ధానికి కారణం
కాగలదా? ఈ విచిత్రమైన
పరిస్థితిని పరిశీలించండి – ఓ చిన్న తోకచుక్క
భూమిని ఢీకొంటుంది. అలా ఢీకొన్న ఎన్నో శకలాలలో ఇదొకటి. కాని దానికి
మన నాగరికత చేసుకునే స్పందన సంపూర్ణ ఆత్మవినాశనం. తోకచుక్కల గురించి, వాటి అభిఘాతాల
గురించి, వాటి వల్ల
కలిగే ఉపద్రవాల గురించి ఇంకా లోతుగా అర్థం చేసుకోవడం మంచింది. ఉదాహరణకి 1979 లో
సెప్టెంబర్ 22 నాడు అమెరికాకి చెందిన వేలా అనే సాటిలైటు దక్షిణ అట్లాంటిక్ సముద్రానికి, పశ్చిమ ఇండియన్ సముద్రానికి మధ్య కళ్లు జిగేలుమనే రెండు మెరుపులు కనిపించాయి. అవి దక్షిణ ఆఫ్రికానో, ఇజ్రాయిలో రహస్యంగా
అక్కడ పరీక్షించిన అణ్వాయుధాలని (బహుశా తక్కువ ఉత్పత్తి గలవి, రెండు మెగాటన్నుల
శక్తి, అంటే హిరోషీమా
బాంబులో ఆరో వంతు శక్తి గలవి) మొదట్లో అనుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాని రాజకీయ పర్యవసానాలు గంభీరంగా ఉంటాయని అనుకున్నారు. కాని ఆ మెరుపులకి కారణం
ఏ ఉల్కాశకలమో, తోకచుక్కో
నేల మీద రాలడం కావచ్చు కదా? ఎందుకంటే
ఆ ప్రాంతం మీదుగా
ఎగిరిన విమానాలు చేసిన సర్వే లలో అక్కడ గాల్లో రేడియోథార్మిక సంకేతేలేవీ దొరకలేదు. దీన్ని బట్టి
ఈ అణ్వాయుధాల యుగంలో
అంతరిక్షం లోంచి వచ్చే అభిఘాతాలని అప్రమత్తంగా పరిశీలించకపోవడం వల్ల ఎలాంటి ముప్పులు పొంచి ఉన్నాయో సులభంగా ఊహించవచ్చు.
(ఇంకా వుంది)
బావుంది.