వైకింగ్ సూక్ష్మజీవశాస్త్ర
ప్రయోగాలని మృత్తికల సహాయంతో వివరించగలము అన్న విషయం తేలిన తరువాత మరో జీవరహస్యం కూడా ఛేదించబడుతోంది. వైకింగ్ కర్బన రసాయన ప్రయోగం బట్టి మార్స్ మీద కర్బన రసాయనపు ఛాయలు కూడా లేవని తెలుస్తోంది. మార్స్ మీద జీవం ఉంటే శవాలన్నీ ఎక్కడున్నాయ్? ఒక్క
కర్బన రసాయన అణువు కూడా దొరకలేదు. ప్రోటీన్లని, న్యూక్లీక్
ఆసిడ్లని నిర్మించడానికి కావలసిన పునాది రాళ్లు లేవు. సరళమైన హైడ్రోకార్బన్
అణువులు లేవు. భూమి మీద
జీవపదార్థంలో ఉండే అంశాలేవీ లేవు. అయితే ఇక్కడ
కర్బన రసాయన ప్రయోగాలకి, సూక్ష్మజీవశాస్త్ర ప్రయోగాలకి...
postlink