ప్రపంచ చరిత్ర అనే అంశం మీద గత రెండు మూడేళ్లుగా రాయడం మొదలుపెట్టాను. ఆ ప్రయత్నంలో మొదటి పుస్తకం "చిరాయువులు - ప్రాచీన రోమన్ చరిత్ర."
https://manchipustakam.in/product/chirayuvulu-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B1%81%E0%B0%B5%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9A%E0%B1%80%E0%B0%A8-%E0%B0%B0%E0%B1%8B%E0%B0%AE/
ఆ ప్రయత్నంలో రెండవ పుస్తకం "అందమైన విప్లవం". అది రెండు నెలల క్రితమే వెలువడింది.
పుస్తకం సారాంశం -
"ఈ రోజుల్లో మన దేశంలో వేగంగా వస్తున్న మార్పుల గురించి ఎందరో రచయితలు వ్యాఖ్యానిస్తున్నారు. వెయ్యేళ్ల చీకటి యుగంలో మగ్గిన తరువాత ఇప్పుడిప్పుడే ఓ కొత్త Renaissance యుగంలోకి అడుగుపెడుతోంది అంటాడు సంజీవ్ సన్యాల్ అనే రచయిత. ఒక జాతిలోగాని, సమాజంలో గాని గొప్ప సర్వతోముఖమైన మార్పును వర్ణించడం కోసం renaissance అనే పదాన్ని వాడుతూ ఉంటారు. ఈ renaissance అనే పదం ‘పునర్జన్మ’ అనే అర్థం గల ఫ్రెంచ్ పదం నుండి వచ్చింది. అయితే ఈ పదం అసలు ఐదొందల ఏళ్ల క్రితం యూరొప్ లో జరిగిన ఒక గొప్ప పరిణామాన్ని సూచించడం కోసం మొదట వాడబడింది.
ఐదొందల ఏళ్ల క్రితం యూరొప్ లో ఒక అద్భుత మేధో విప్లవం జరిగింది… దాని పేరు పునరుద్దీపన (Renaissance). ఆ యుగం పేరే పునరుద్దీపన యుగం. క్రీశ 500 నుండి సమారు వెయ్యేళ్ల పాటు మధ్య యుగం లో నలిగిన యూరొప్ లో ఓ కొత్త మేలుకొలుపు మొదలయ్యింది. ఎన్నో రంగాల్లో మేధావులు నవ్య సృజన చేశారు. మోనాలీసా చిత్తరువుతో లియొనార్డో దా వించీ చరిత్రకెక్కాడు. మృతిలేని పాలరాతి మూర్తులని సృష్టించాడు మైకెలేంజిలో. మానవ సాధ్యం కావని అనిపించే బృహత్తర నిర్మాణాలు చేశాడు బ్రూనెలెస్కీ. చిత్రకళ, శిల్పకళ, స్థాపత్య కళ, సాహిత్యం, సంగీతం – ప్రతీ మానవీయ రంగంలోను కొత్త పుంతలు తొక్కింది అప్పటి మేధ. దృష్టి దేవుడి నుంచి మనిషి మీదకి మరల్చింది. ధ్యాస దివి నుండి భువికి మార్చింది. మానవ జీవనాన్ని, ప్రపంచాన్ని అందంగా తీర్చి దిద్దాలనుకుంది. ఆ అందమైన విప్లవం కథే ఈ పుస్తకం."
ప్రచురణ కర్త – ఏ. గాంధీ, పీకాక్ క్లాసిక్స్. Email: agaandhi@gmail.com
0 comments