ఆల్బర్ట్
కి మాక్స్ టాల్మూడ్ అని ఓ స్నేహితుడు ఉండేవాడు. ఇతడు ఆల్బర్ట్ కన్నా
కొన్నేళ్లు పెద్దవాడు. తదనంతరం ఇతగాడు వైద్య విద్యలోకి ప్రవేశించాడు. ఈ కుర్రవాడు సెలవు దినాల్లో వచ్చి ఐన్ స్టయిన్ వాళ్ల ఇంట్లో ఉండేవాడు. అలా ఓ సారి వచ్చినప్పుడు ఆరన్ బర్న్ ష్టయిన్ (Aaron Bernstein) రాసిన కొన్ని సైన్స్ పుస్తకాలు పట్టుకొచ్చాడు. ఈ పుస్తకాలు భూమి, సౌరమండలం, విశ్వం మొదలుకొని గొప్ప వైవిధ్యం గల అంశాలని సులభ శైలిలో వర్ణించాయి. ఆల్బర్ట్ మనసుని ఈ పుస్తకాలు మొదటి చూపులోనే ఆకట్టుకున్నాయి. ఒక పక్క యూక్లిడ్, మరో పక్క ఆరన్ బర్న్ ష్టయిన్ ఇద్దరూ కలిసి ఆల్బర్ట్ ని మనసుని పూర్తిగా దోచుకున్నారు.
ఒక
పక్క వ్యక్తిగతంగా, స్వయంకృషితో, స్వాధ్యాయంతో సైన్స్, గణిత రంగాల్లో ఆల్బర్ట్ ఇంతగా పురోగమిస్తున్నా మిగతా రంగాల మీద మనసులేక పోవడం వల్ల అంతగా పురోగమించలేకపోయేవాడు. ముఖ్యంగా భౌగోళిక శాస్త్రం, చరిత్ర మొదలైన రంగాల్లో మార్కులు అంతంత మాత్రంగా ఉండేవి. టిచర్లంటే గౌరవం లేని ఈ కుర్రవాడంటే టీచర్లకి అంతగా అభిమానం ఉండేది కాదు. ఆల్బర్ట్ మనో స్థితిని వర్ణిస్తూ “ఎప్పుడూ ఏవో అర్థం లేని కలలలో కొట్టుకుపోతూ ఉంటాడు” అన్నాడో టీచరు. పిల్లవాడు
ఎందుకూ కొరగాడని కొట్టిపారేశారు టీచర్లు.
తన
కొడుకు గురించి టీచర్లు ఏమనుకుంటున్నారో తెలుసుకున్న తండ్రి హర్మన్ చాలా బాధపడ్డాడు. గణిత, విజ్ఞాన రంగాల్లో అంత ప్రతిభ చూపిస్తున్న కొడుకు, మిగతా సబ్జెక్ట్ లలో ఎందుకు రాణించలేకపోతున్నాడో ఆ తండ్రికి అర్థమయ్యేది కాదు. ఎప్పుడూ సైన్సు, లెక్కలు అని గంగవెర్రులు
పోకుండా మిగతా విషయాల మీద కూడా ధ్యాస పెట్టాలని కొడుకుని మందలించాడు. కాని అంత చిన్న వయసులోనే అన్యమనస్కంగా సైన్స్ కే అంకితమైపోయిన ఆల్బర్ట్ చిత్తం మీద ఆ మందలింపులు పని చెయ్యలేదు.
ఆల్బర్ట్
కి బడి జీవితం దుర్భరంగా తోచడానికి మరో కారణం వుంది. అది చదువుకి సంబంధించింది కాదు, మతానికి సంబంధించింది. ఐన్ స్టయిన్ కుటుంబీకులు యూదు (Jews) మతస్థులు. క్లాసులో తక్కిన పిల్లల్లో అధిక శాతం మంది క్రైస్తవులు. యూదు మతానికి, క్రైస్తవ మతానికి చారిత్రకంగా ఒక విధమైన స్పర్థ వుంది. క్రీస్తుని శిలువ వేసింది యూదు మతస్థులు. ఆ కారణం చేత ఆల్బర్ట్ కి క్లాసులో ఎన్నో సార్లు ప్రతికూలత ఎదురయ్యింది. ఆ ప్రతికూలత కొన్ని సార్లు కాస్త నాటకీయంగా వ్యక్తమయ్యేది. ఓ సారి ఓ టీచర్ ఓ పెద్ద మేకు తెచ్చి క్లాసులో పిల్లలు అందరికీ చూపించాడు. జీసస్ ని శిలువ వేసింది ఇలాంటి మేకులతోనే అని ప్రకటిస్తూ ఓ సారి ఆల్బర్ట్ కేసి చూశాడు. క్లాసులో పిల్లలంతా ఆల్బర్ట్ కేసి విచిత్రంగా చూశారు. ఆల్బర్ట్ సిగ్గుతో తల వంచుకున్నాడు. జీసస్ ని శిలువ వేయడానికి కారణం తానే అన్నంత బాధ కలిగింది. తదనంతరం ఐన్ స్టయిన్ జీవితంలో మతసంబంధమైన అసహనం ఎంతో బాధకి కారణమయ్యింది. ఎన్నో విపత్కర పరిస్థితులకి కూడా దారి తీసింది.
(ఇంకా
వుంది)
పరమాణు కేంద్రకాల తాడనానికి వాడబడ్డ మొట్టమొదటి రేణువులు ప్రోటాన్లు, డ్యూటెరాన్లు, ఆల్ఫా రేణువులు మొదలైన ధనావేశం గల రేణువులు. అలా ధనావేశం గల రేణువులు ధనావేశం గల కేంద్రకాల చేత వికర్షించబడతాయి. కనుక ఆ వికర్షణని అధిగమించి కేంద్రకాన్ని చేరి ఢీకొనాలంటే ఆ తాడించే రేణువులని అత్యధిక వేగం వద్దకి త్వరణం చెయ్యాలి. కనుక కేంద్రక చర్యలని సాధించడం కష్టంగా ఉండేది.
న్యూట్రాన్లు కనుక్కున్నాక ఓ కొత్త
అవకాశం ఏర్పడింది. న్యూట్రాన్లకి విద్యుదావేశం లేదు కనుక కేంద్రకాలు వాటిని వికర్షించవు. అందుచేత సరైన దిశలో కదులుతున్న న్యూట్రాన్లు అయితే సులభంగా, ఏ అవరోధమూ లేకుండా కేంద్రకాన్ని ఢీ కొనగలుగుతాయి.
న్యూట్రాన్లతో తాడనాన్ని మొట్టమొదట పరిశోధించినవాడు ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త ఎన్రికో ఫెర్మీ (1901-1954). న్యూట్రాన్ కనుకొనబడింది అని విన్న వెంటనే ఇతడు తన పరిశోధనలు మొదలుపెట్టాడు. న్యూట్రాన్ల పుంజాన్ని ముందు నీటి ద్వార గాని, కర్పూరం ద్వార గాని పోనిస్తే అప్పుడు ఆ కిరణాల వల్ల కేంద్రక చర్యలు మరింత సమర్ధవంతంగా ఏర్పడతాయని ఇతడు కనుక్కున్నాడు. ఈ సమ్మేళనాలలో ఉండే తేలికైన పరమాణువులు న్యూట్రాన్లతో ఢీ కొన్నప్పుడు, ఆ పరమాణువులు న్యూట్రాన్లని లోనికి గ్రహించుకోకపోయినా వాటి శక్తిని కొంతవరకు హరిస్తాయి. అలా నెమ్మదించబడ్డ న్యూట్రాన్లు గది ఉష్ణోగ్రత వద్ద మామూలు అణువులు కదిలే వేగానికి దిగుతాయి. అలా ఏర్పడ్డ “ఉష్ణ న్యూట్రాన్లు” (thermal
neutrons) ఇతర
కేంద్రకాల వేగంతోనే కదలడం వల్ల వాటి సమక్షంలో మరి కాస్త ఎక్కువ సేపు మసలుతాయి. కనుక అధికవేగంతో కదిలే న్యూట్రాన్ల కన్నా ఇలాంటి న్యూట్రాన్లు కేంద్రకాలతో చర్య జరిపే అవకాశం ఎక్కువ.
ఒక న్యూట్రాన్
ఒక కేంద్రకంలో కలిసిపోయినప్పుడు ఆ కేంద్రకం తప్పనిసరిగా ఓ కొత్త మూలకం యొక్క కేంద్రకం కావాలని లేదు. అది కేవలం మరింత భారమైన ఐసోటోప్ గా మారే అవకాశం వుంది. ఆక్సిజన్-16 కి న్యూట్రాన్ (ద్రవ్యరాశి సంఖ్య 1) జత అయినప్పుడు ఆక్సిజన్-17 పుడుతుంది. అదనపు న్యూట్రాన్ ని పొందిన మూలకం ఒక
రేడియోధార్మిక ఐసోటోప్ గా మారొచ్చు. అలాంటప్పుడు సామాన్యంగా అది ఒక బీటా రేణువుని వెలువరిస్తుంది. అంటే సాడీ సూత్రం ప్రకారం ఆవర్తన పట్టికలో ఒక స్థానం పైన వున్న మూలకంగా మారుతుంది అన్నమాట. ఉదాహరణకి ఆక్సిజన్-18 కి న్యూట్రాన్ తోడైతే రేడియోధార్మిక ఆక్సిజన్-19 పుడుతుంది. అది బీటా రేణువుని వెలువరించి సుస్థిరమైన ఫ్లోరిన్-19 గా మారుతుంది. ఆ విధంగా న్యూట్రాన్ తాడనం వల్ల ఆక్సిజన్ ఒక పరమాణు సంఖ్య ఎక్కువ గల మూలకంగా మారుతుంది.
1934 లో ఫెర్మీకి న్యూట్రాన్ల తాడనం చేత యురేనియమ్
కన్నా భారమైన మూలకాలు పుట్టించడం సాధ్యమా అన్న ఆలోచన వచ్చింది. ఆ రోజుల్లో ఆవర్తన పట్టికలో అత్యధిక పరమాణు సంఖ్య గల మూలకం యురేనియమ్. అయితే దీనికి కారణం అంతకన్నా ఎక్కువ పరమాణు సంఖ్య గల మూలకాలు మరీ అస్థిరమైనవి కావచ్చు. సుదీర్ఘమైన పృథ్వీ చరిత్రలో అవి క్షయమైపోయి ఉండొచ్చు.
మొదట్లో ఫెర్మీ తన ప్రయత్నాలలో
93 పరమాణు సంఖ్య గల మూలకాన్ని సృష్టించానని అనుకున్నాడు. కాని తనకి వచ్చిన ఫలితాలు కాస్త తికమకగా వున్నాయి. కాని అవి మరింత విప్లవాత్మకమైన ఫలితాలకి దారితీశాయి. ఈ కొత్త ఫలితాల సంచలనంలో పడి కొంతకాలం ట్రాన్స్ యురేనియమ్ మూలకాల సంయోజన గురించి అందరూ మర్చిపోయారు.
1940 లో అమెరికన్ భౌతిక శాస్త్రవేత్తె ఎడ్విన్ మాటిసన్ మక్మిలన్ (1907-1991), అతడి సహోద్యోగి రసాయన శాస్త్రవేత్త ఫిలిప్ హేగ్ ఏబెల్సన్ (1913-2004) యురేనియమ్ తో న్యూట్రాన్ తాడన ప్రయోగాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలలో వాళ్లు ఓ
కొత్త పరమాణువు కనుక్కున్నారు. పరిశీలించి చూడగా అది 93 పరమాణు సంఖ్య గల మూలకం అని తేలింది. దానికి నెప్ట్యూనియమ్ అని పేరు పెట్టారు. నెప్ట్యూనియమ్ ఐసోటోప్ లలో కెల్లా అతి దీర్ఘమైన ఆయుర్దాయం గల నెప్ట్యూనియమ్-237 యొక్క అర్థాయుష్షు
కేవలం సుమారు 2 మిలియన్ సంవత్సరాలు మాత్రమే. అందుచేత బిలియన్ల సంవత్సరాలు గల పృథ్వీ చరిత్రలో అది మనగలిగేది కాదు. ఓ
నాలుగవ రేడియోధార్మిక శ్రేణికి ఆదిమూలకం
ఈ నెప్ట్యూనియమ్-237.
మక్మిలన్ తదనంతరం అమెరికన్ భౌతికశాస్త్రవేత్త గ్లెన్ థియోడోర్ సీబోర్గ్ (1912-1999) తో చేతులు కలిపాడు. 1941 లో ఇద్దరూ కలిసి 94 పరమాణు సంఖ్య గల ప్లూటోనియమ్ ని గుర్తించి సంయోజించారు. సీబోర్గ్ నేతృత్వంలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కి చెందిన ఓ వైజ్ఞానికుల బృందం పదేళ్ల పాటు కృషి చేసి మరో అరడజను మూలకాలని రూపొందించారు. అవి – అమెరీషియమ్ (95), క్యూరియమ్ (96), బెర్కిలియమ్ (97), కాలిఫోర్నియమ్ (98), ఐన్స్టయినియమ్ (99), ఫెర్మియమ్ (100).
ఇంతకు మించి పరమాణు సంఖ్య గల మూలకం
ఉండడం అసంభవం అన్న నియమం ఉన్నట్టు కనిపించలేదు. అయితే పరమాణు సంఖ్య పెద్దది అవుతున్న కొలది దానికి సంబంధించిన మూలకాన్ని రూపొందించడం ఇంకా ఇంకా కష్టం అయ్యేది. దాన్ని ఇంకా ఇంకా సూక్ష్మ మోతాదుల్లో మాత్రమే సృజించడానికి వీలయ్యేది. పైగే అర్థాయుష్షులు కూడా క్రమంగా తక్కువ అయ్యేవి. కనుక సృజించబడ్డ మూలకం త్వరగా హరించుకుపోయేది. 1955 లో మెండెలివియమ్ (102) ని రూపొందించారు. 1957 లో నోబెలియమ్ (102) ని రూపొందించారు. 1961 లో లారెన్సియమ్ (103) ని రూపొందించారు. 1964 లో రష్యన్ శాస్త్రవేత్తలు పరమాణు సంఖ్య 104 గల మూలకాన్ని అతి సూక్ష్మ మోతాదుల్లో సాధించినట్టు తెలిపారు.
రేర్ ఎర్త్ మూలకాలలో ఒకదానికొకటి ఎలాంటి పోలికలు ఉన్నాయో ట్రాన్స్ యురేనియమ్ మూలకాలలో కూడా గాఢమైన పోలికలు ఉన్నట్టు సీబోర్గ్ బృందం కనుక్కుంది. ఎలక్ట్రాన్ విన్యాసం రెండు వర్గాల మూలకాలకి కొన్ని పోలికలు ఉన్నాయి. రెండు వర్గాల లోను అంతరంగ ఎలక్ట్రాన్ కర్పరాలకి అదనపు ఎలక్ట్రాన్లు జత అవుతుంటాయి. కాని బాహ్యతమ ఎలక్ట్రాన్ కర్పరంలో మాత్రం ఎప్పుడూ మూడే ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ రెండు మూలకాల వర్గాలలో మొదటి వర్గానికి లాంథనమ్ (57) పేరు మీద లాంథనైడ్
లు అని, రెండవ వర్గానికి ఆక్టీనియమ్ (89) పేరు మీద ఆక్టినైడ్ లు అని పేర్లు పెట్టడం జరిగింది.
లారెనిషియమ్ ఆవిష్కరణతో ఆక్టినైడ్ లన్నీ కనుక్కోబడినట్టు అయ్యింది. మూలకం సంఖ్య 104 కి ఆక్టినైడ్ ల కన్నా చాలా భిన్నమైన రసాయన లక్షణాలు ఉన్నట్టు తెలిసింది.
(ఇంకా వుంది)
postlink





