
వివరాల కోసం: manchipustakam...

ఈ రోజు ఆంధ్రభూమిలో అచ్చయిన వ్యాసం.http://www.andhrabhoomi.net/intelligent/naluka-547కోట్ల ఏళ్ల పరిణామం తరువాత మనిషికి అబ్బిన ఓ అపురూపమైన లక్షణం – రెండు కాళ్లమీద నిటారుగా నించుకోగలగడం, కింద పడిపోకుండా సునాయాసంగా నడవడం. సమతూనిక కోల్పోకుండా నించోవడం, నడవడం మనం ఎంత సహజంగా చేస్తామంటే అదొక పెద్ద విశేషమైన సామర్థ్యం అనిపించదు. కాని ప్రమాదం వల్ల గాని, వ్యాధి వల్ల గాని ఆ సామర్థ్యాన్ని మనం కోల్పోయినప్పుడు దాని విలువేమిటో అనుభవం అవుతుంది. షెరిల్ షిల్జ్...

నిన్న ఆంధ్రభూమిలో అచ్చయిన వ్యాసం- http://www.andhrabhoomi.net/intelligent/grahalanu-243 ఇతర గ్రహాల మీద మనిషిని పోలిన ప్రజ్ఞావంతులైన జీవుల కోసం వేట, చింతన ఎంతో కాలంగా సాగుతోంది. మన సౌరమండలంలో (భూమి కాని) ఇతర గ్రహాల మీద, ఉపగ్రహాల మీద జీవరాశులు – అదీ ప్రజ్ఞ గల జీవరాశులు - ఉండే అవకాశం బహు తక్కువ. కనుక ఇతర తారల పరిసర గ్రహాల మీద అలాంటి జీవులు ఉండొచ్చనే ఆలోచన సహజంగా స్పురిస్తుంది. ఆ ఆలోచనే సౌరమండలానికి బయట గ్రహాల కోసం అన్వేషణకి స్ఫూర్తి నిచ్చింది....

ప్రీస్లీ కనుక్కున్న "ఫ్లాగిస్టాన్ రహిత గాలి" నిజంగానే రూథర్ఫర్డ్ కనుక్కున్న "ఫ్లాగిస్టానీకృత గాలి"కి వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపించింది. రూథర్ఫర్డ్ కనుక్కున్న గాలిలో ఎలుకలు చచ్చిపోయేవి. అదే ప్రీస్లీ కనుక్కున్న గాలిలో మరింత చురుగ్గా మసలేవి. "ఫ్లాగిస్టాన్ రహిత" వాయువుని ప్రీస్లీ కాస్త పీల్చి చూసి "హాయిగా, తేలిగ్గా" అనిపించిందని తన అనుభూతిని వర్ణించాడు. అయితే ప్రీస్లీ, రూథర్ఫర్డ్ ల కన్నా ముందే ఈ ఆవిష్కరణలు చేసినా, పేరు పెద్దగా పైకి రాని మరో...

మొన్న సోమవారం ఆంధ్రభూమిలో అచ్చయిన వ్యాసం - http://www.andhrabhoomi.net/intelligent/sowramandalaniki-397 రెండు శతాబ్దాల క్రితం వరకు కూడా సూర్యుడి చుట్టూ ఆరు గ్రహాలే (భూమితో కలుపుకుని) తిరుగుతున్నాయని అనుకునేవారు. ఆ గ్రహాలు – మెర్క్యురీ, వీనస్, భూమి, మార్స్, జూపిటర్, సాటర్న్. అంటే నాటి చింతన ప్రకారం సౌరమండలానికి పొలిమేరలు సాటర్న్ యొక్క కక్ష్య వద్ద ఉన్నాయన్నమాట. సౌరమండలం గురించి ఇలాంటి దృక్పథం కొన్ని వేల ఏళ్ల కాలంగా చలామణిలో ఉంది. అటు ప్రాచీన...

స్నేహగారు వాళ్ల ఆరేళ్ల అబ్బాయి గ్రహాల గురించి అడుగుతున్నాడని అడిగారు. అందుకు నాకు తోచిన వివరణ ఇస్తున్నాను. ఇంకా ఏవైనా సంగతులు ఉంటే ఇతర బ్లాగర్లకి కూడా సూచించమని మనవి. గ్రహాలు పెద్ద మట్టి బంతులు అని మొదలు పెట్టొచ్చు. భూమి అనే మట్టి బంతి మీద మనం ఉన్నామని చెప్పొచ్చు. ఓ గ్లోబ్ తెచ్చి దాని మీద మనం ఎక్కడ ఉన్నామో చూపించొచ్చు. మరి భూమి బంతిలాగా కనిపించదే? అన్న ప్రశ్న రావచ్చు. దాని బదులుగా కొన్ని వివరణలు ఇవ్వొచ్చు. భూమి మన కన్నా చాలా పెద్దది కనుక,...

1770 ల లో ప్రీస్లీ మరిన్ని వాయువులని అధ్యయనం చేశాడు. ఆ కాలంలో విజ్ఞాన శాస్త్రానికి తెలిసిన వాయువులు మూడు. వాటిలో ఒకటి గాలి, రెండవది ఫాన్ హెల్మాంట్ మరియు బ్లాక్ లు అధ్యయనం చేసిన కార్బన్ డయాక్సయిడ్, మూడవది కావెండిష్ కనుక్కున్న హైడ్రోజెన్. ఇక నాలుగవ్ వాయువుగా రూథర్ఫర్డ్ నైట్రోజెన్ ని పై వాయువుల జాబితాలోకి చేర్చనున్నాడు. కాని ప్రీస్లీ అక్కడితో ఆగక మరిన్ని వాయువులని అధ్యయనం చెయ్యసాగాడు.కార్బన్ డయాక్సయిడ్ తో అతడి అనుభవం వల్ల వాయువులు నీటిలో...
http://www.andhrabhoomi.net/intelligent/banti-bhavanalu-...
postlink