శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.


సర్ ఆర్థర్ కాటన్ ప్రారంభించిన భావ విప్లవాన్ని అర్థం చేసుకుని కొనసాగించిన ఆంధ్రుడు ఒకడున్నాడు. అతడి పేరు కానూరి లక్ష్మణ రావు. ఈయన జవహర్ లాల్ నిహ్రూ, ఇందిరా గాంధీల కాబినెట్ లలో ఇరిగేషన్ మంత్రిగా పని చేశారు.




‘భారత జల సంపద’ (India’s water wealth) అనే పుస్తకంలో ఈయన కాటన్ గురించి ఇలా అంటారు-

“భారతీయ నదీ వ్యవస్థల విషయంలో సర్ ఆర్థర్ కాటన్ అనుపమానమైన అవగాహన కలిగినవాడు. అలాంటి పథకం గత శతాబ్దం (19 వ) లోనే అమలు జరిగి ఉంటే, ఇప్పుడు ఇండియాలో రవాణా ఒక సమస్య అయ్యుండేది కాదు.”

కె. ఎల్. రావు ప్రతిపాదనలో ముఖ్యాంశం గంగానదిని కావేరితో కలిపే ఓ జలసంధి. 2640 km ల పొడవు ఉన్న ఈ జలసంధిలో నీటిని మొత్తం 550 m మట్టం ఎత్తుకు పంప్ చెయ్యాలి. అంత భారీ మొత్తంలో, అంత ఎత్తుకు నీటిని పైకెత్తడానికి 5000 – 7000 Mw ల విద్యుత్తు అవసరం అవుతుందని అంచనా.

http://www.nwda.gov.in/index2.asp?slid=106&sublinkid=6&langid=1





కాలువ ద్వారా నదుల అనుసంధానం వల్ల లాభాలు

మన దేశంలో వరదలు, కరువులు అనాదిగా వస్తున్నాయి. పైగా మన దేశం చాలా విశాలమైనది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన శీతోష్ణస్థితులు ఉంటాయి. కనుక వరదలు, కరువులు ఒకే కాలంలో వివిధ ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. ఏడాదిలో ఒకే సమయంలో ఒక ప్రాంతం కరువు వాతపడి విలవిల లాడుతుంటే, మరో ప్రాంతం వరదనీటిలో మునిగి వుంటుంది. దీని వల్ల ఏటేటా ఎంతో ప్రాణ నష్టం, పంట నష్టం జరుగుతు ఉంటుంది. ఆర్థికంగా చూస్తే దీని వల్ల ఒక్కొక్క రాష్ట్రంలోనే కొన్ని వందల కోట్ల నష్టం ఉంటుంది.

నదులని కలిపితే వరదల వల్ల, కరువుల వల్ల వచ్చే అవాంతరాలని ఉపశమించే అవకాశం ఉంటుంది. వివిధ ప్రాంతల జలాశయాల మధ్య సమతూనిక సాధించడానికి వీలవుతుంది.

ఇలాంటి ప్రాజెక్టుని జాతీయ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ప్రాజెక్ట్ గా తీసుకుని అమలు చేయాల్సి ఉంటుంది.



ఇలాంటి ప్రాజెక్టులకి కొన్ని అంతర్జాతీయ నిదర్శనాలు పరిగణిద్దాం.



అభివృద్ధి చెందిన దేశాల్లో రోడ్డు రవాణా సదుపాయాలే ఇందుకు చక్కని నిదర్శనాలు.



జర్మనీ లో ఒకటవ, రెండవ ప్రపంచ యుద్ధాల నడిమి కాలం హిట్లర్ రాజ్యం చేశాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో దారుణంగా ఓడిపోయి, ఆర్థికంగా బాగా చితికిపోయిన జర్మనీలో మునుపటి వైభవాన్ని తిరిగి సాధించాలనే ఉద్దేశంలో, విశాలమైన, అధునాతనమైన, అతి వేగమైన రహదార్ల వ్యవస్థని నిర్మించాడు. దీని వల్ల సరుకుల రవాణా వేగవంతమై జర్మనీ ఆర్థికంగా పుంజుకుంది. ఇవే నేడు జర్మనీలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఆటోబాన్ (autobahn) లు.





అమెరికాలో రెండవ ప్రపంచ యుద్ధం తరువాత విశాలమైన అమెరికా దేశం యొక్క తూర్పు, పడమటి తీరాలని కలుపుతూ సంక్లిశ్టమైన రహదార్ల వ్యవస్థని నెలకొల్పడానికి బృహత్తర ప్రయత్నాలు మొదలయ్యాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థని గొప్ప ఎత్తుకి తీసుకుపోవడంలో ఈ రోడ్లు ఎంతో దొహదం చేశాయి.



బ్రిటన్ లో, పారిశ్రామిక విప్లవం జరుగుతున్న కాలంలో, ఇండియా లాంటి అధినివేశాల (colonies) నుండి పుష్కలంగా సిరులు దేశంలోకి ప్రవహిస్తున్న కాలంలో, సరుకుల రవాణా కోసం ఇంగ్లండ్ లో కాలువల వ్యవస్థ రూపు దిద్దుకుంది. బ్రిటన్ లో రైలు రవాణా సంస్థకి పూర్వమే ఈ కాలువల వ్యవస్థాపన జరిగింది.



మన దేశంలో కూడా గత పదేళ్లుగా ఇన్ఫ్రా స్ట్రక్చర్ అభివృద్ధి పథకంలో భాగంగా ‘గోల్డెన్ క్వాడ్రిలేటరల్’ రహదార్ల నిర్మాణం జరుగుతోంది. ఒక పక్క ఇలాంటి ప్రాజెక్ట్ లు కొనసాగుతుండగా మరొక పక్క నదీ అనుసంధాన ప్రయత్నాలు కూడా జరగాలి.

ప్రపంచంలో అత్యధిక వర్షాపాతం నమోదు అయ్యే దేశాల్లో బ్రెజిల్ తరువాత మన దేశం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. కనుక కాలువలని నింపుకోవడానికి తగినంత వర్షపు నీరు ఉండనే వుంది.

బహుశ ఈ కారణాలన్నీ గుర్తించిన వాడు కనుకనే సర్ ఆర్థర్ కాటన్ 130 ఏళ్లకి పూర్వమే నదీ అనుసంధాన ఆశయాన్ని ఊహించి ప్రకటించాడు.

(ఇంకా వుంది)



2 comments

  1. Anonymous Says:
  2. చక్రవర్తి గారు,
    నదుల అనుసంధానం అన్నది, నీటిపారుదలకోసం కాక, రవాణా సదుపాయం కోసం ఉద్దేశించినదన్న మాట. రెండూ ఒకేసారి సాధ్యం కావు కదా.
    Snkr

     
  3. tarakam Says:
  4. Dr KL Rao,the eminent engineer and who was responsible for the setting up of VTPS thermal station near Vijayawada,was removed from her cabinet by Indira Gandhi.actually he was the only eligible minister who could do justice to his ministry.NDA govt set up a committee under the chairmanship of Mr.Sureshprabhu,M.P.to study the feasibility of river linking project.But unfortunately UPA govt has scrapped the project.I think it is a necessary &viable project.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts