గొలుసుకట్టు చెరువులని పోలిన వ్యవస్థ ఒకటి హిమాలయ తలాల ప్రాంతాలలో ఉండేది.
బ్రిటిష్ వారి కాలంలో సర్ విలియమ్ విల్కాక్స్ అనే వ్యక్తి నీటిసరఫరా విభాగానికి డైరెక్టర్ జనరల్ గా ఉండేవాడు. ఇతడు ఇండియాలోనే కాక, బ్రిటిష్ అధినివేశమైన ఈజిప్ట్ లో కూడా పని చేశాడు. ఇండియాలోని జలాశయాల గురించి ఇతడు క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. హిమాల ప్రాంతాలని ఇతడు విస్తృతంగా పర్యటించాడు.
ఈ పర్యటనల, అధ్యయనాల ఆధారంగా ఇతడు గత శతాబ్దపు తొలిదశాలలో ఒక సారి కలకత్తా విశ్వవిద్యాలయంలో కొన్ని ఉపన్యాసాలు ఇచ్చాడు. ఆ ఉపన్యాసాలు తదనంతరం ఓ పుస్తక రూపంలో వెలువడ్డాయి. ఆ పుస్తకం పేరు - “Lectures on ancient system of irrigation in Bengal and its application to modern problems.”
ఈ పుస్తకంలో హిమాలయ ప్రాంతాలని చెందిన మృత నదుల గురించి ప్రత్యేకించి చర్చించడం జరిగింది. శతాబ్దాల నిర్లక్ష్యం మూలంగా కొన్ని కాలువలు పూర్తిగా ఎలా ఎండిపోయాయో ఇందులో వర్ణిస్తాడు.
హిమాలయల మీది వర్షాపాతం వల్ల ఏర్పడ్డ పిల్లకాలువల లోని నీటిని కాలువలలోకి పోనిచ్చి ఇరుగు పొరుగు పంట పొలాలకి నీరు అందేలా చేసే ఏర్పాట్లు మన ప్రాచీనులు చేశారు.
శివాలిక్ కొండల సమీపంలో ఉండే తలాలకి ఆ విధంగా కాలువల జాలాల ద్వారా నీరు అందేది.
ఆ విధంగా ‘జల జాల వ్యవస్థ’ యావద్ భారతం వివిధ రూపాల్లో వినియోగంలో ఉండేదని అర్థమవుతోంది.
(సమాప్తం)
Reference:
DK Hari, DK Hema Hari, You Turn India, Bharat Gyan & Sri Sri Publications Trust, 2011.
0 comments