
కనుక అంత బృహత్తరమైన విశ్వంలో పట్టే మొత్తం ఇసుక రేణువుల సంఖ్య రమారమి ఇంత ఉంటుంది –
10^100. అయితే ఇది నిజంగా విశ్వంలోని మొత్తం పరమాణువుల సంఖ్య (=3x10^74) కన్నా చాలా పెద్దది. విశ్వంలో పరమాణువులు ఖాళీ లేకుండా దట్టించి లేవని గుర్తుంచుకోవాలి. సగటున ఒక ఘన మీటరు అంతరిక్షంలో ఒక పరమాణువు మాత్రమే వుంది.
అయితే పెద్ద పెద్ద సంఖ్యలని సృష్టించడానికి విశ్వం మొత్తాన్ని మట్టితో నింపడం లాంటి విపరీతపు పనులు చెయ్యనక్కర్లేదు. చాలా సరళమైన సమస్యలలో కూడా,...
ఐదొందల అడుగుల దూరంలో ఓ చదునైన ఎత్తైన ప్రదేశంలో ఓ చిన్న అడవి లాంటిది కనిపించింది. అందులో మరీ పొట్టి, మరీ పొడవు కాని చెట్లు గొడుగుల్లా నిటారుగా లేచి వున్నాయి. గాలి చలనాలకి వాటి ఆకారం మీద ఎలాంటి ప్రభావమూ ఉన్నట్టు లేదు. బిర్రబిగుసుకున్నట్టు నిశ్చలంగా ఉన్నాయి.
ఈ చిత్రమైన వృక్షసృష్టిని ఏవని పిలవాలో నాకు అర్థం కాలేదు. ఇంతవరకు మనిషికి తెలిసిన రెండు లక్షల వృక్షజాతులలో ఇవి కూడా ఉన్నట్టేనా? ముఖ్యంగా మంచినీటి జలాశయాల పరిసరాలలో పెరిగే వృక్ష జాతులకి చెందినవా? దగ్గరికి వెళ్లీ చూస్తే నా ఆశ్చర్యం అబ్బురపాటుగా మారింది. మట్టిలోంచి పుట్టుకొచ్చిన...

భారతీయ గణితవేత్త ప్రస్తుతం మనం వాడే దశాంశ పద్ధతిని కనిపెట్టక ముందు మరో రకం దశాంశ పద్ధతి ఉండేది. అందులో ప్రతీ దశాంశ స్థానానికి గుర్తుగా ఒక చిహ్నం ఉండేది. ఆ దశాంశ స్థానం యొక్క విలువ ఎంత వుంటే, ఆ చిహ్నాన్ని అన్ని సార్లు రాయడం జరుగుతుంది.
ఉదాహరణకి 8732 అనే అంకెని ప్రాచీన ఈజిప్షియన్లు ఈ విధంగా గుర్తించేవారు.
అదే అంకెని జూలియస్ సీసర్ సభలో పని చేసే గుమాస్తా అయ్యుంటే ఇలా రాసేవాడు –
MMMMMMMMDCCXXXII
ఈ చివరి సంఖ్యామానం చాలా మందికి తెలిసే...

ఫేజ్ వైరస్ ఓ బాక్టీరియా కణం లోకి తన డీ. ఎన్. ఏ. ని ప్రవేశపెట్టినప్పుడు, ఆ బాక్టీరియాలో మరిన్ని ఫేజ్ లు పుట్టుకొచ్చి వాటికి ఆతిథ్యం ఇచ్చిన బాక్టీరియాని నాశనం చేస్తాయని కిందటి సారి చెప్పుకున్నాం. ఆ నాశనం చేసే వైనం ఏంటో ఈ సారి కాస్త విపులంగా పరిశీలిద్దాం.
వైరస్ లు పునరుత్పత్తి చెందే తీరులో రెండు ప్రత్యామ్నాయ విధానాలు ఉంటాయి. మొదటి విధానంలో బాక్టీరియా కణం వెంటనే నాశనం అవుతుంది. అందుకే మొదటి విధానాన్ని ‘వినాశక చక్రం’ (lytic cycle) అంటారు....
postlink