శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

వూల్స్ థార్ప్ లో పెల్లుబికిన సృజన

Posted by V Srinivasa Chakravarthy Friday, January 1, 2016



ట్రినిటీ లో గడిపిన నాలుగేళ్లలో న్యూటన్ ఎన్నో అమూల్యమైన విషయాలు నేర్చుకున్నాడు. చిన్నప్పుడు ఆశగా, ఆసక్తిగా మొదలైన వైజ్ఞానిక అభిరుచికి ఇప్పుడు గొప్ప విద్యాసంస్థ ఇవ్వగల శిక్షణ తోడయ్యింది. తన స్వాధ్యాయంలో న్యూటన్ కి తన పూర్వతరాలు బోధించిన విజ్ణానంలో ఎన్నో లొసుగులు కనిపించాయి. అవి లొసుగులు అని నిరూపించాలి. వాటిని సరిదిద్ది వాటి స్థానంలో సరైన జ్ఞానాన్ని ప్రవేశపెట్టాలి. ఇవన్నీ సాధించాలంటే ఇంకా పై చదువులు చదవాలి.

న్యూటన్ ఆలోచనలు దిశలో సాగుతున్న దశలో అందుకు పూర్తిగా వ్యతిరేక పరిస్థితులు ఏర్పడ్డాయి. కేంబ్రిడ్జ్ ని విడిచిపెట్టి తిరిగి వూల్స్ థార్ప్ దారి పట్టవలసిన అగత్యం ఏర్పడింది.

పదిహేడవ శతాబ్దంలో లండన్ లో భయంకరమైన ప్లేగు వ్యాధి చెలరేగి ఎన్నో ప్రాణాలని పొట్టన బెట్టుకుంది. 1660  కల్లా మృతుల సంఖ్య ఐదు లక్షలు దాటింది. అప్పటి జనాభాతో పోల్చితే అది చాల పెద్ద సంఖ్య. తీవ్రమైన తలనొప్పి, తల తిరుగుడు లక్షణాలతో మొదలయ్యే వ్యాధి వేగంగా కాళ్లు, చేతులకి వ్యాపిస్తుంది. ఒళ్ళు కాలిపోయే జ్వరం వస్తుంది.  ఒంటి మీద నల్లని మచ్చలు ఏర్పడితే ఇక ప్రాణం పోవడానికి ఎంతో సమయం లేదన్నమాట
 
 
లండన్ లో ప్లేగు వ్యాధి విలయతాండవం

1347  లో గల్ఫ్ ప్రాంతం నుండి వచ్చిన ఒక ఓడలో ప్లేగ్ క్రిములు యూరప్ తీరాలని చేరాయని అంటారు. అప్పట్నుంచి మహమ్మారి వ్యాధి యూరప్ అంతా వ్యాపించి లక్షల సంఖ్యలో ప్రాణాలని పొట్టనపెట్టుకుంది. జనసందోహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది. కనుక లండన్ నగరంలో వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉండేది. వ్యాధి కాటు నుండి తప్పించుకోవడానికి పట్టణ వాసులు పల్లె ప్రాంతాలకి తరలిపోయేవారు. 1665  అక్టోబర్ నెలలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయపు అధికార్లు సమావేశమై వ్యాధి తగ్గుముఖం పట్టినంత వరకు విశ్వవిద్యాలయాన్ని మూసేయాలని నిర్ణయించారు. కాని అప్పటికే విశ్వవిద్యాలంలో అధికశాతం మంది సెలవలు పెట్టి తలో దారి చూసుకున్నారు.

న్యూటన్ ఏడాదే జనవరి నెలలో బీ.. పట్టం అందుకున్నాడు. ఎం.. కూడా చెయ్యాలని ఎంతో ఉత్సాహంతో ఉన్నాడు. కాని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇక దగ్గర్లో పై చదువులకి వెళ్లే అవకాశం కనిపించలేదు. ఎత్తైన హిమవన్నగాలని అధిరోహించడానికి ఆయత్తమవుతున్న వాడికి ఎదుట నున్న కొండలు కళ్ళ ముందే కరిగిపోవడమే కాక, కింద నేల చీలి అధఃపాతాళంలోకి జారిపోతున్న అనుభూతి కలిగింది.  ఇక గత్యంతరం లేక విచారంగా ఇంటిదారి పట్టాడు.

వూల్స్ థార్ప్ చేరిన  న్యూటన్ ఊరికే దిగాలుగా కూర్చోక కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. నిర్దుష్టమైన భౌతిక శాస్త్రసిద్ధాంతానికి గణితం ఎంత గొప్ప ఆధారం అవుతుందో న్యూటన్ ఎప్పుడో గుర్తించాడు. అయితే భౌతిక శాస్త్రంలో కొన్ని విభాగాలని సరైన విధంగా వర్ణించడానికి అప్పటికి లభ్యమయ్యే గణితం సరిపోదని అనిపించింది. ఆల్జీబ్రా, జ్యామితి మొదలైనవి అత్యంత శక్తివంతమైన గణిత ఉపకరణాలు. నిజమే. కాని చలన రాశుల వర్ణనకి వచ్చేసరికి గణితవిభాగాలలో ఏదో వెలితి కనిపించింది. ఒక రాశి ఎంత వేగంతో మారుతోంది అన్న భావనని గణితపరంగా వ్యక్తం చేసేదెలా?

విషయం మీద ఫ్రెంచ్ గణితవేత్తలైన రెనే దే కార్త్ (Rene Descartes) మరియు పియర్ ఫర్మా లు (Pierre de Fermat) కొంత కృషి చేశారు. అయితే వారు అవలంబించిన విధానాలు కాస్త గందరగోళంగా కనిపించాయి న్యూటన్ కి. అందులో గణితసౌందర్యం కొరవడింది. పైగా అవి కొన్ని ప్రత్యేక సందర్భాలలో పనికొస్తాయి తప్ప విశ్వజనీనంగా, అన్ని సందర్భాలలోను వర్తించవు. ఉన్నత స్థాయి గణిత భావనకి  అలాంటి విశ్వజనీనత ముఖ్యమైన హంగు అవుతుంది.

అసలు కేంబ్రిడ్జ్ లో ఉన్న రోజుల్లోనే న్యూటన్ దిశలో కృషి ఆరంభించాడు. తన కృషి ఫలితంగా 1665  లో మే నెలలో పరిశోధనా పత్రం రాశాడు. వూల్స్ థార్ప్ కి తిరిగొచ్చాక 1666  అంతానికల్లా రంగంలో మరో మూడు పత్రాలు రాశాడు. కొత్త గణిత విభాగానికి fluxions  అని పేరు పెట్టాడు. మారే రాశులతో వ్యవహరించడం కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డ విభాగం ఇది. దీన్నే ఆధునిక గణిత పరిభాషలో calculus  అంటారు.

(ఇంకా వుంది)

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts