తన పుస్తకాన్ని బయట ప్రపంచం ముందు వెల్లడి చెయ్యడానికి న్యూటన్ ముందు ఒప్పుకోలేదు. ఒక పక్క ఆ ఫలితాలన్నీ మెర్కాటర్ కన్నా తనే ముందు సాధించానని నిరూపించుకోవాలి. కాని మరో పక్క ఏదైనా దుర్విమర్శ వస్తుందేమోనని సందేహం. తన భావాలని, సిద్ధాంతాలని ఎవరైనా ఖండిస్తే సులభంగా సహించలేకపోయేవాడు న్యూటన్. ఉదాహరణకి తన కాంతి సిద్ధాంతం వైజ్ఞానిక సమాజంలో కొన్ని వర్గాల నుండి ఎంతో విమర్శకి గురయ్యింది. ఆ విమర్శలన్నీ న్యూటన్ మనసులో చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ఆ కారణం చేత తను సాధించిన ఎన్నో శాస్త్రఫలితాలని ఎవరికీ చూపించకుండా గుట్టుగా, భద్రంగా దాచుకునేవాడు. అందుకే అనంత శ్రేణుల మీద న్యూటన్ చేసిన రచనని కాలిన్స్ కి పంపడం కోసం ఒప్పించడానికి బారోకి తల ప్రాణం తోకకొచ్చింది.
చివరికి ఎలాగోలా న్యూటన్ ని ఒప్పించి కాలిన్స్ ఆ వ్రాతప్రతిని పంపాడు. అది చదివిన కాలిన్స్ మంత్రముగ్ధుడయ్యాడు.
ఎవరో
అనామక
కుర్ర
గణితవేత్త
అనంత
శ్రేణుల
లాంటి
కఠిన
గణిత
విభాగంలో
ఇంత
గంభీరమైన
రచన
చెయ్యడమా?
ఎవరతను?
ఆ
గణితవేత్త
గురించి
ఆసక్తిగా
వాకబు
చేస్తూ
కాలిన్స్
తిరిగి
బారోకి
జాబు
రాశాడు.
కాలిన్స్
స్పందన
చూశాక
న్యూటన్
పేరు
ఇక
బయటపెట్టొచ్చని
బారోకి
నమ్మకం
కలిగింది. “నా మిత్రుడి రచన మీకు ఎంతో ఆనందాన్ని ఇచ్చినందుకు సంతోషం. అతడి పేరు న్యూటన్. అతడు మా కాలేజిలో ఫెలోగా వున్నాడు. చాలా చిన్నవాడు… అయితే అసమాన ప్రతిభాశాలి,” అంటూ న్యూటన్ ని పొగుడుతూ కాలిన్స్ కి ఉత్తరం రాశాడు బారో.
తదనంతరం న్యూటన్ అనుమతితో కాలిన్స్ ఆ పుస్తకాన్ని రాయల్ సొసయిటీ అధ్యక్షుడైన లార్డ్ బ్రౌంకర్ కి చూపించాడు. కాని ఆ పుస్తకాన్ని ఎట్టి పరిస్థితుల్లో అచ్చువెయ్యడానికి మాత్రం న్యూటన్ ఒప్పుకోలేదు. చాలా కాలం తరువాత న్యూటన్ కి అరవై ఎనిమిదేళ్ల వయసులో 1711 లో ఆ పుస్తకం అచ్చువెయ్యబడింది. పుస్తకం అచ్చువెయ్యబడకపోయినా ఈ పరిణామం వల్ల న్యూటన్ ప్రతిభ వైజ్ఞానిక సమాజంలో కొందరు ప్రముఖులకి మాత్రం తెలిసొచ్చింది.
ఇలా ఉండగా బారో ఒక సారి కాంతి శాస్త్రం మీద తను రాసిన ఓ పుస్తకానికి సంపాదకీయం వహించమని న్యూటన్ ని కోరాడు. న్యూటన్ అప్పటికే కాంతి శాస్త్రం మీద గణనీయమైన పరిశోధనలు చేశాడన్న సంగతి మరి బారోకి తెలుసాలేదా అన్న విషయం మీద పెద్దగా సమాచారం లేదు. “కాంతి శాస్త్రంలో నేను నీ కన్నా ఎంతో ఎత్తుకు వెళ్ళాను సుమా” అని గొప్ప పరపతి గల బారో లాంటి ప్రొఫెసరు తో పెట్టుకోవడం శ్రేయస్కరం కాదని న్యూటన్ గుర్తించి వుంటాడు. కిమ్మనకుండా బారో చెప్పిన పని చేసి ఊరుకున్నాడు. బారోకి విజ్ఞానంతో పాటు మతవిద్యలో కూడా మంచి ప్రవేశం వుంది. కనుక ఒక దశలో రెండవ చార్లెస్ రాజు గారి కొలువులో మత ప్రచారకుడిగా పని చేసే అవకాశం రాగానే ఎగిరి గంతేసి కేంబ్రిడ్జ్ లో గణిత ప్రొఫెసరు పదవి వదిలి వెళ్లిపోయాడు. అంతవరకు నమ్మకమైన శిష్యుడిగా పని చేసిన న్యూటన్ కి ఆ పదవి దక్కింది. ఆ విధంగా అక్టోబర్ 29, 1669 లో కేంబ్రిడ్జ్ లో న్యూటన్ గణిత ప్రొఫెసర్ గా నియామకం అయ్యాడు.
1670 లో కేంబ్రిడ్జ్ ప్రొఫెసర్ గా ఉపన్యాసాలు ఇవ్వడం మొదలెట్టాడు న్యూటన్. తన మొదటి ఉపన్యాసాలు తనకి ఇష్టమైన కాంతి శాస్త్రం మీద ఇవ్వబడ్డాయి. అయితే ఈ శాస్త్రంలో తను అనుసరించిన మార్గంలో ఇంకా నిశితమైన పరిశోధనలు చెయ్యాల్సి వుందంటూ ఆ ఉపన్యాసాల చివర్లో ప్రకటించాడు. అన్నట్టుగానే ఓ మూడేళ్ళ పాటు కాంతి శాస్త్రం మీద, రంగుల మీద పరిశోధనలు జరిపాడు. ఆ కాలంలో మనసు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, నిద్ర, సోమరితనం మొదలైన అవలక్షణాలకి దాసోహం కాకూడదని, బాగా ఆకలివేసినప్పుడు కూడా కాస్తంత రొట్టె, కాసిని నీళ్లతో సరిపెట్టుకుంటూ బతికేవాడని న్యూటన్ కి తదనంతరం చికిత్స చేసిన డా. జార్జ్ చెయిన్ అంటాడు.
కాంతి శాస్త్రంలో ఈ సారి న్యూటన్ జరిపిన కొత్త పరిశోధనల్లో భాగంగా తన దృష్టిని దూరదర్శినుల మీదకి పోనిచ్చాడు. ఆ రోజుల్లో దూరదర్శినుల్లో కుంభాకర కటకాలని (convex lenses) వాడి నిర్మించే సాంప్రదాయం వుండేది. కాని కటకాలతో వాడి చేసే దూరదర్శినుల్లో ఏర్పడే చిత్రం చుట్టూ సన్నని రంగురంగుల వలయాలు ఏర్పడి చిత్రం అలుక్కుపోయినట్టుగా ఉండేది. దీన్నే వర్ణ వైరూప్యం (chromatic
aberration) అంటారు.
పట్టకాలతో
తను
చేసిన
పరిశోధనల
ఆధారంగా
ఈ
కటకాలతో
చేసిన
దూరదర్శినుల్లో
వర్ణ
వైరూప్యం
ఎందుకు
జరుగుతోందో
న్యూటన్
అర్థం
చేసుకున్నాడు.
కటకాలలో
రంగు
కిరణాలు
వివిధ
కోణాల
వద్ద
వక్రీభవనం
చెందడమే
ఈ
వైరూప్యానికి
కారణం
అని
తెలుసుకున్నాడు.
మరి
కటకాలకి
బదులు వంపుటద్దాలని వాడితే?
(ఇంకా వుంది)
0 comments