వంపుటద్దాలతో దూరదర్శినిని తయారు చేసే ఓ విధానం గురించి స్కాట్లాండ్ కి చెందిన జేమ్స్ గ్రెగరీ అనే గణితవేత్త, ఖగోళ వేత్త 1663 లో Optica Promonta అనే పుస్తకం రాశాడు. అందులోని ముఖ్యమైన భాగాలని అత్యంత శ్రధ్ధతో చదివి వుంటాడు న్యూటన్. కాని గ్రెగరీ తన పుస్తకంలో ఆ దూరదర్శిని నిర్మాణం గురించి సైద్ధాంతికంగా రాశాడే గాని దాన్ని స్వయంగా నిర్మించలేకపోయాడు.
నిర్మాణంలో
తను
చేసిన
ప్రయత్నాలు
పెద్దగా
ఫలించలేదు
కూడా.
అద్దాల వినియోగంతో కాంతిని పరావర్తనం చేసే పరావర్తన దూరదర్శిని (reflecting
telescope) నిర్మాణాన్ని
చేపట్టాడు
న్యూటాన్.
కొన్ని
రకాల
లోహాన్ని
నునుపుగా
రుద్దితే
అది
అద్దంలా
పని
చేస్తుంది.
తగరము,
రాగి
కలిసిన
ఓ
మిశ్రలోహాన్ని
ఈ
ప్రయోజనం
కోసం
వాడుకున్నాడు
న్యూటన్.
ఆ
లోహపు
ఉపరితలం
యొక్క
పరిచ్ఛేదం
పారాబోలా
ఆకారంలో
వుండాలి.
లేకుండా
చిత్రం
నిశితంగా
వుండదు.
కేవలం
సైద్ధాంతిక
కౌశలమే
కాకుండా
ప్రయోగాలు
చెయ్యడంలో
మంచి
హస్తలాఘవం
గల
న్యూటన్
ఆ
లోహపు
ఉపరితలాన్ని
అద్భుతంగా
తీర్చిదిద్దాడు.
అలా
రూపొందిన
దూరదర్శిని
యొక్క
పని
తీరు
గురించి
ఓ
మిత్రుడికి
ఇలా
ఉత్తరం
రాశాడు
న్యూటన్
– “ఈ
దూరదర్శిని
వస్తువులని
40 రెట్లు సంవర్ధనం (magnify) చెయ్యగలదు. అంటే దీని సంవర్ధన శక్తి సాంప్రదాయక పద్ధతిలో చేసిన 6 అడుగుల పొడవున్న దూరదర్శినుల కన్నా ఎక్కువ అన్నమాట. పైగా ఇందులో కనిపించే చిత్రం చాలా పదునుగా వుంది. ఇందులో జూపిటర్ ని, దాని ఉపగ్రహాలని స్పష్టంగా చూశాను.”
న్యూటన్ నిర్మించిన పరావర్తన దూరదర్శిని
పరావర్తన దూరదర్శిని యొక్క సృష్టికర్తగా న్యూటన్ పేరు లండన్ లో వేగంగా వ్యాపించింది. రాయల్ సొసయిటీ ఈ కొత్త పరికరాన్ని ప్రత్యక్షంగా చూడదలచుకుంది. రాయల్ సొసయిటీలో ప్రదర్శన కోసమని ప్రత్యేకంగా మరో దూరదర్శినిని తయారు చేశాడు న్యూటన్. దాన్ని ఐసాక్ బారో స్వయంగా తీసుకుపోయి సొసయిటీ సభ్యుల ముందు ప్రదర్శించాడు. ఆ ప్రదర్శనలో రెండవ చార్లెస్ రాజు కూడా హాజరు అయ్యాడు. ప్రదర్శన విజయవంతం అయ్యింది. సొసయిటి సభ్యులందరూ న్యూటన్ ని ఆకాశానికి ఎత్తారు. ఖగోళ శాస్త్రవేత్తల అమ్ములపొదిలో న్యూటన్ కనిపెట్టిన పరికరం ఓ కొత్త శరం అయ్యింది. ఖగోళ శాస్త్ర చరిత్రలో ఈ పరావర్తన దూరదర్శిని ఓ మైలురాయిగా నిలిచింది.
న్యూటన్ కృషిని మెచ్చుకుంటూ సొసయిటీ సెక్రటరీ అయిన హెన్రీ ఓల్డెన్బ్రర్గ్ న్యూటన్ కి ఉత్తరం రాశాడు. న్యూటన్ ఆ ప్రశంసలకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇలా జాబు రాశాడు – “ఈ దూరదర్శిని నిర్మాణానికి ఆధారభూతమైన సిద్ధాంతానికి సంబంధించిన వివరాలు మీ ముందు ఉంచదలచుకున్నాను. ఇంతవరకు ప్రకృతి గతులని వర్ణించిన సిద్ధాంతాలన్నిటి లోకి ఈ సిద్ధాంతం అత్యంత విప్లవాత్మకమైనది అని నేను నమ్ముతున్నాను.”
రాయల్ సొసయిటీ సభ్యులకి కూడా తెలియని అంత విప్లవాత్మక సిద్ధాంతం ఏవయ్యుంటుందా అని ఓల్డెన్బర్గ్ ఆశ్యర్యపోయాడు. మొదటి ఉత్తరం కాస్త అమర్యాదగా ఉందేమో ననిపించిన న్యూటన్ ఈ సారి కాస్త వినమ్రంగా జాబు రాశాడు. అందులో కాంతి మీద తన పరిశోధనలన్నీ ఏకరువుపెట్టాడు. ఇంద్రధనుస్సు రంగుల గురించి, పట్టకాలతో తన ప్రయోగాల గురించి అన్నీ అందులో వివరించాడు.
న్యూటన్ పంపిన పత్రాన్ని రాయల్ సొసయిటీ లో చదివారు. న్యూటన్ సిద్ధాంతాన్ని సభ్యులు ఏకగ్రీవంగా సమ్మతిస్తూ అంత సమగ్రమైన సిద్ధాంతాన్ని రూపొందించినందుకు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా తన పరిశోధనలని రాయల్ సొసయిటీ యొక్క అధికార పత్రిక అయిన Philosophical
Transactions (తాత్విక
సంవాదాలు)
లో
ప్రచురించమని
ప్రోత్సహిస్తూ
సభ్యులు
స్పందించారు.
వారి స్పందన విన్న న్యూటన్ ఆనందం ఆకాశాన్నంటింది. తన పరిశోధనల ప్రచురణకి ఒప్పుకున్నాడు. ఫిలసాఫికల్ ట్రానాక్షన్స్ లో అచ్చయిన ఆ పత్రం న్యూటన్ కి శాస్త్రవేత్తగా శాశ్వత ఖ్యాతి తెచ్చింది.
(ఇంకా వుంది)
0 comments