గ్రహాలు సూర్యుడి
చుట్టూ లెక్కకి దీర్ఘవృత్తాకార కక్ష్యలలోనే తిరిగినా వాటి కక్ష్యలు నిజానికి మరీ అంత సాగదీసినట్టు ఉండవు. నిజానికి వాటికి
వృత్తాలకి మధ్య పెద్దగా తేడా వుండదు. కాని తోకచుక్కల
కక్ష్యలు మాత్రం బాగా సాగదీసినట్టు ఉంటాయి. ముఖంగా బారైన
సంవత్సర కాలం గల తోకచుక్కల కక్ష్యలైతే మరీను. అంతర సౌరమండలంలో
గహాలు చిరకాల నివాసులు, తోకచుక్కలు మాత్రం
కొత్తగా దిగిన శాల్తీలు. గ్రహాల కక్ష్యలు
అలా తీరైన వృత్తాకారంలో ఎందుకు
ఉన్నాయి? పైగా వాటి
కక్ష్యల మధ్య అంత దూరం ఎందుకుంది? గ్రహ కక్ష్యలు
దీర్ఘవృత్తాకారాలలో ఉంటే ఏదో ఒక రోజు వాటి కక్ష్యలు ఒకదాన్నొకటి కోసుకుంటాయి. అప్పుడు గ్రహాలు ఒకదాన్నొకటి ఢీకొంటాయి. సౌరమండలం యొక్క
తొలి దశలలో ఎన్నో గ్రహాలు ఇంకా వర్ధమాన దశలో ఉండి ఉండొచ్చు. దీర్ఘ వృత్తాకార
కక్ష్యలు గల గ్రహాలు ఇతర గ్రహాలతో ఢీకొనడం వల్ల నాశనమై ఉండొచ్చు. గ్రహాల మధ్య
అభిఘాతాలు ఆ విధంగా ‘’సహజ
ఎంపిక”లా పని
చేశాయి. అలాంటి సహజ
ఎంపికలో ఎంపికైన గ్రహాలనే నేడు మనం చూస్తున్నాం. యవ్వనంలో నానా రకాల ఉపద్రవాలకి తట్టుకుని, కడతేరి ఇప్పుడు
సుస్థిరంగా మధ్యవయస్సులోకి ప్రవేశించిన సౌరమండలం నేడు మనకి దర్శనమిస్తోంది.
బాహిర గ్రహ
సీమకి ఆవల విస్తరించిన నిస్సారమైన నిశీధిలో, కొన్ని ట్రిలియన్ల
గ్రహశకలాలతో కూడుకున్న ఓ బృహత్తరమైన గోళాకారం
మేఘం వుంది. ఆ గ్రహశకలాలు
సూర్యుడి చుట్టూ పరిభ్రమించే వేగం ఇండియానాపోలిస్ 500 లో పాల్గొనే రేసు కార్ల వేగం కన్నా మరీ అంత ఎక్కువేమీ కాదు.[1] ఆ రాశిలో ఒక
మామూలు తోకచుక్కని తీసుకుంటే అది ఓ కిలోమీటర్ వ్యాసం
గల పెద్ద మంచుబంతిలా ఉంటుంది. వాటిలో చాలా
మటుకు ప్లూటో కక్ష్యని దాటి లోపలి రావు. కాని అప్పుడప్పుడు
ఓ దారే పోయే
తార అక్కడి స్థానిక గురుత్వ క్షేత్రంలో అలజడి సృష్టిస్తుంది. తోకచుక్కల మేఘంలో కల్లోలం పుడుతుంది. ఓ చిన్న
తోకచుక్కల దండు బారైన దీర్ఘవృత్తాకార కక్ష్యలలో సూర్యుడి దిక్కుగా ప్రయాణం మొదలెడతాయి. అప్పుడప్పుడు దారిలో ఎదురయ్యే జూపిటర్, సాటర్న్ వంటి
దిగ్గజాల గురుత్వ ప్రభావానికి లోనవుతాయి. ఆ ప్రభావం
వల్ల శతాబ్దానికి ఒక సారి ఆ తోకచుక్కలు వాటి
గమనాన్ని మార్చుకుని అంతర సౌరమండలం వైపుగా తమ గమన దిశని మార్చుకుంటాయి. జూపిటర్, మార్స్ కక్ష్యల
మధ్యకి చేరేసరికి అవి
నెమ్మదిగా సూర్యతాపం వల్ల వేడెక్కి, ఆవిరికావడం మొదలెడతాయి. సూర్యుడి వాయుమండలం నుండి ఎగజిమ్మబడే పదార్థం, అంటే సౌరపవనాలు, సమీపిస్తున్న తోకచుక్కల మీదుగా వీచి, వాటి నుండి
ధూళిని, మంచు కణికలని
ఎగదన్నుతాయి. అలా తోకచుక్క నుండీ ఎగజిమ్మబడ్డ పదార్థం తెల్లని కుచ్చుతోకలా దూరం నుండి కనిపిస్తుంది. జూపిటర్ పరిమాణం ఒక మీటర్ ఉంటుంది అనుకుంటే, ఒక తోకచుక్క
పరిమాణం ఓ చిన్న ధూళి
కణం కన్నా ఉండదు.
కాని
దాని తోక బాగా విస్తరిస్తే మాత్రం దాని పొడవు గ్రహాల మధ్య ఉండే దూరాల పరిమాణంలో ఉంటుంది. సూర్యుడు చుట్టూ
అది చేసే సుదీర్ఘ యాత్రలో అది భూమికి కనుచూపు మేరలోకి వచ్చిందంటే మాత్రం ఇక జనం భావావేశంతో పూనకం వచ్చినట్టు ఊగిపోతారు. కాని ఎప్పుడో
ఒకప్పుడు ఈ తోకచుక్కలు అసలు
పృథ్వీ వాతావరణంలోనే లేవని, అవి సౌరమండలం
అంతా తిరిగే బహుదూరపు బాటసారులని మనుషులు అర్థం చేసుకుంటారు. దాని కక్ష్యని లెక్కకడతారు. తారాసీమ నుండీ మన జగతికి వచ్చిన ఆ అతిథిని పలకరించి
రమ్మని ఏదో ఒకనాడు ఓ చిన్న అంతరిక్ష
నౌకని పంపుతారు.
ఏదో ఒకనాడు
తోకచుక్కలు గ్రహాలతో ఢీకొంటాయి. భూమిని, దాని
సహచరుడైన చందమామని తోకచుక్కలు, ఎన్నో చిన్న చిన్న గ్రహశకలాలు ఢీకొంటాయి. సౌరమండలం ఆవిర్భావ
దశల నుండి మిగిలిపోయిన వ్యర్థపదార్థమే ఈ గ్రహశకలాలు. పెద్ద
గ్రహశకలాల కన్నా చిన్నవే పెద్ద సంఖ్యలో ఉన్నాయి కనుక, చిన్న గ్రహశకలాలతో
అభిఘాతాలే ఎక్కువగా జరుగుతాయి. తుంగుష్కా ఘటనలో
భూమి మీద పడ్డ గ్రహశకలం వంటి వస్తువుతో భూమి వెయ్యేళ్లకొక సారి ఢీకొంటుంది. ఇరవై కిలోమీట్లర్ పొడవున్న కేంద్రభాగం గల హాలీ తోకచుక్క వంటి వస్తువుతో భూమి అభిఘాతం బిలియన్ సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది.
ఓ చిన్న మంచుగడ్డ
ఓ గ్రహం మీదనో, దాని చందమామ మీదనో పడితే దాని వల్ల పెద్దగా నష్టం జరగకపోవచ్చు. కాని ఆ వస్తువు కాస్త
పెద్దది అయితే,
ఎక్కువగా
రాతితో చెయ్యబడ్డ వస్తువైతే, అది నేలని
ఢీకొన్నప్పుడు పెద్ద విస్ఫోటం జరుగుతుంది. అది పడ్డ చోట పెద్ద అర్థగోళాకారపు బిలం ఏర్పడుతుంది. దాన్నే అభిఘాత బిలం (impact crater) అంటారు. ఇక ఆ
బిలాన్ని అరుగదీసే ప్రభావం కాని, పూరించే ప్రభావం
గాని ఏదీ లేకపోతే ఆ బిల అలాగే
బిలియన్ల సంవత్సరాలు స్థిరంగా ఉంటుంది. చందమామ మీద
నేలలో పెద్దగా ఒరిపిడి (erosion) అనేదే ఉండదు. కాని దాని ఉపరితలం
మీద అంతా తూట్లు పొడిచినట్టు లెక్కలేనన్ని అభిఘాత బిలాలు కనిపిస్తాయి. ప్రస్తుతం అంతరసౌరలమండలం లో అంతా పలచగా విస్తరించిన ఉల్కాశకలాల, తోకచుక్కల సంఖ్య చూస్తే చందమామ మీద అన్ని బిలాలు ఎలా ఏర్పడ్డాయో అర్థం కాదు. అవన్నీ కొన్ని
బిలియన్ల క్రితం, సౌరమండలపు తొలిదశలలో
సౌరమండలం అంతా కిక్కిరిసి వున్న ఉల్కాశకలాల ఆనవాళ్లు. పెటేలుమని పేలిపోయిన
ప్రపంచాల పదఘట్టనలవి.
(ఇంకా వుంది)
[1]
భూమి సూర్యుడి నుండి 1 ఖగోళ ఏకాంకం
= 150,000,000 కిమీల దూరంలో వుంది. దాని కక్ష్య ఇంచుమించు వృత్తాకారంలో వుంది. కాబట్టి
దాని చుట్టు కొలత 2 p r = 109.
ఆ మార్గాన్ని భూమి ఏడాదికి ఒక సారి కొలుస్తుంది. 1 సంవత్సరం = 3 X 107
secs (సుమారుగా). కాబట్టి భూమి యొక్క కక్ష్య వేగం = 109 km/3 x 107 sec = 30 km/sec. సౌరమండలం నుండి సుమారు
100,000 ఖగోళ ఏకాంకాల దూరంలో ఓ గోళాకార కర్పరంలో (shell) కక్ష్యల్లో తిరిగే తోకచుక్కల సంగతి ఆలోచించండి.
అది ఇంచుమించు అతి దగ్గరి తారకి సగం దూరం అన్నమాట. కెప్లర్ మూడవ నియమం ప్రకారం సూర్యుడి
చుట్టూ వాటి కక్ష్య కాలం సుమారు (100,000)3/2 = 30 మిలియన్ సంవత్సరాలు
(సుమారుగా). సూర్యుడి సరిహద్ద వద్ద ఉన్నప్పుడు సూర్యుడి చుట్టూ తిరగడానికి చాలా కాలం
పడుతుంది. తోకచుక్కల కక్ష్యల చుట్టుకొలత సుమారుగా 2_ x 105 x 1.5 x 108 km = 1014 km ఉంటుంది. కాబట్టి తోకచుక్కల వేగం 1014 km/ 1015 sec = 0.1 km/sec = 220 మైళ్లు/గం.
miles per hour.
0 comments