సూర్యుడి చుట్టూ
తిరిగే గ్రహాలలో భూమి కూడా ఒకటి అనే కోపర్నికస్ సిద్ధాంతాన్ని హోలాండ్ లో సామాన్యులు కూడా నమ్ముతున్నారన్న విషయం హైగెన్స్ కి సంతోషం కలిగించింది. “మందబుద్ధులు, మనుషులు కల్పించిన మూఢాచారాల ప్రభావంలో ఉన్న వాళ్లు తప్ప” ఇంచుమించు ఖగోళశాస్త్రవేత్తలు
అందరూ కోపర్నికస్ సిద్ధాంతాన్ని ఒప్పుకున్నారు. మధ్యయుగాలలో క్రయిస్తవ తాత్వికులు విశ్వం యొక్క పరిమితి గురించి చిత్రంగా వాదించేవారు. విశ్వం అంతా భూమి చుట్టూ రోజుకొక సారి పరిభ్రమిస్తుంది కనుక విశ్వం అనంతం కాలేదని వారి వాదన. అందుకే లెక్కించరాని
సంఖ్యలో మాత్రమే కాక పెద్ద సంఖ్యలో...
postlink