
రచయిత: డాక్టర్ వి. శ్రీనివాస చక్రవర్తి.మెదడు గురించి కొన్ని సర్వసామాన్యమైన ప్రశ్నలు - వాటి జవాబులున్యూరాన్ అంటే ఏమిటి?మెదడు పరిమాణం ఎంత?మొత్తం ఎన్ని న్యూరాన్లు ఉన్నాయి?తక్కిన శరీరంతో పోలిస్తే మెదడు పరిమాణం ఎంత?వెన్నుపాము పొడవు ఎంత?నాడీ సంకేతాలు ఎంత వేగంగా కదుల్తాయి?నాడీ శాస్త్రవేత్తలు ఏం చేస్తారు?మొట్టమొదటి నాడీ శాస్త్రవేత్త ఎవరు?మనం మన మెదడులో 10% మాత్రమే వాడుతామా?ఈ ప్రశ్నలన్నింటికీ జవాబుల కోసం ఇక్కడ నొక్కండి. (Click Here).http://www...

అమ్మమాట, ఎమ్మెస్ పాట, మల్లెగంధం, ఐషు అందం – ఇవన్నీ కని విని తరించడానికి మనసుండాలి. ఆ మనసుకి ఉపాధిగా పని చేసే మూడు పౌనుల మాంసపు ముద్ద మెదడు. మెదడు గురించి, నాడీ మండలం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలని సరదాగా అందజేయడమే ఈ బ్లాగు లక్ష్యం.ఇది Neuro science for Kids అనే ఇంగ్లిష్ వెబ్ సైటు కి తెలుగు అనువాదం.మెదడు, వెన్నుపాము, న్యూరాన్లు, ఇంద్రియాలు – నాడీ ప్రపంచంలోని ఎన్నో ముఖ్యాంశాల గురించి తెలుసుకోవచ్చు. ప్రయోగాలతో, ఆటలతో నాడి శాస్త్ర లోకంలోకి...
డా|| వి. శ్రీనివాస చక్రవర్తి గారు తెలుగులోకి అనువదించిన "భూమి గుండ్రంగా ఉంది" అనే e – పుస్తకాన్ని ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి ( Click here to Download ). లేదా ఈ క్రింది అడ్రసు నందు పుస్తకాన్ని కొనవచ్చు.చిరునామా:మంచి పుస్తకం12 – 13 – 452, వీధి నెం.1,తార్నాక, సికింద్రాబాద్ – 500 0...
రచయిత: వి. శ్రీనివాస చక్రవర్తికొలంబస్ యాత్రలు భూమి గుండ్రంగా ఉందా లేదా అన్న విషయాన్ని ఎటూ తేల్చలేకపోయాయి. ఆ మహాకార్యాన్ని తలపెట్టిన మరో నావికుడు ఉన్నాడు. అతడే మెగాలెన్.(స్పానిష్ రాజు ఐదవ కింగ్ చార్లెస్ సభలో)చార్లెస్ - నేల మీద ఇండియా చేరుకోవడానికి సిల్కు దార్లు ఎప్పుడో మూసుకున్నాయి. ఇండియా కోసం వెదుక్కుంటూ వెళ్లిన కొలంబస్ మరేవో ప్రాంతాలని కనుక్కున్నాడు. అదసలు ఇండియానే కాదని పండితుల అభిప్రాయం. ఆ తరువాత వాస్కో ద గామా ఆఫ్రికా చుట్టూ ఇండియా చేరే పద్ధతి కనుక్కున్నాడు. కాని టోర్దెసీలాస్ ఒప్పందం ప్రకారం ఆ సముద్రపు దార్లు పోర్చుగల్ కే...
రచయిత: వి. శ్రీనివాస చక్రవర్తి.భూమి ఎలా ఉంటుంది అన్న విషయం మీద కవితలు రాయటం, కొలతలు తీయటం ఇవన్నీ ఒక ఎత్తు. భూమి గుండ్రంగా ఉంది అన్న నమ్మకం మీద ప్రాణాలొడ్డి ఏవో అజ్ఞాత సముద్రాల మీద ధ్వజం ఎత్తటం ఒక ఎత్తు. అలా ధ్వజమెత్తిన ఓ ధీరుడి పేరే కొలంబస్.(టక్...టక్...టక్)కొలంబస్ - (తలుపు తీస్తూ) మంత్రిగారూ మీరా? రండి రండి.మంత్రి - అమ్మయ్య! ఇన్నాళ్లకి దొరికావయ్యా. ఎన్ని సార్లు వచ్చాననుకున్నావు. ఒకసారి వస్తే పోర్చుగల్ వెళ్లావని, మరోసారి వస్తే ఇటలీ, ఇంకోసారేమో సముద్ర యానంలో ఉన్నావని, అదే సముద్రమో నీకే తెలీదని పొరుగింటి వాళ్లన్నారు. పోన్లే ఇన్నాళ్లకి...
రచయిత: వి. శ్రీనివాస చక్రవర్తి.భూమిని గోళంగా భావించడమే కాక ఆ గోళం యొక్క చుట్టుకొలత కూడా ఓ చక్కని ప్రయోగం చేసి ఖచ్చితంగా కనుక్కున్న మరో ఘనుడు ఉన్నాడు. అతడే ఎరొటోస్తినీస్. పెళ్ళీ పెటాకులు లేనివాడు కనుక ఇలాంటి ప్రయోగాలతో జీవితం వెళ్ళబుచ్చుతుంటాడు.(ఎరొటొస్తినీస్ ఇంట్లో)ఎరొటొస్తినీస్ - ఒరేయ్!పనివాడు - అయ్యా, వస్తున్నా!ఎరొటొస్తినీస్ - చిన్న పని చేసి పెట్టాల్రా చేస్తావా?పనివాడు - చేస్తానండయ్యా, కాని...(భయంగా ఎరొటొస్తినీస్ చేతిలో ఉన్న టేపు కేసి చూస్తూ) కిందటి సారి ఇలాగే చిన్న పని అని చెప్పి అలెగ్జాండ్రియా చుట్టుకొలత అదుగో ఆ టేపుతోనే...
నేటి ప్రపంచంలో మనిషికి ఉండాల్సిన అత్యంత విలువైన లక్షణాలు...కలువ కళ్లు, బొమవిళ్లు, కోటేరేసిన ముక్కులు, గుండెని పిండే దృక్కులు, మోకాళ్లని, మడమల్ని, మహిని తాకే చేతులు, - ఇవేవీ కావు. నేటి ప్రపంచాన్ని నడిపిస్తున్న అగ్రరాజ్యాల ప్రాబల్యం వెనుక, మహాసంస్థల ప్రభావం వెనుక, మేటి నేతల నేతృత్వం వెనుక, విశేష వ్యక్తుల విజయాల వెనుక ఒకే ఒక శక్తి ఆధారభూతంగా ఉండడం కనిపిస్తుంది. తక్కిన ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నా అవన్నీ కూడా చివరికి ఈ ఒక్క సత్తాలోనే నాటుకుని ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ శక్తి పేరు...పరిజ్ఞానం.నేటి ప్రపంచాన్ని, సమాజాన్ని, సమస్త...
రచయిత: వి. శ్రీనివాస చక్రవర్తి.ఆ విధంగా భూమి గురించి, సూర్య చంద్రుల గురించి వెర్రి మొర్రి ఆలోచనలు చలామణి అవుతున్న దశలో ఓ గ్రీకు తాత్వికుడు ఈ విషయం గురించి లోతుగా ఆలోచించసాగాడు. అతడే అనాక్సీమాండర్.అదుగో ఏతెన్స్ నగర వీధుల వెంట ఇటే ఏతెంచి వస్తున్నాడు. అయ్యో, అదేంటి! నక్షత్రాలు లెక్కెడుతూ రోడ్డుకి అడ్డుగా ఆ నడకేంటి సార్?మొదటివాడు - అయ్యా అనాక్సీమాండరూ! తమరా? పట్టపగలు రోడ్డు మధ్యలో ఆకాశం కేసి చూస్తూ ఏంటా నడక? ఇంతకీ పైన ఏం కనిపిస్తోందని?అనాక్సీమాండర్ - చుక్కలు కనిపిస్తాయేమోనని...రెండోవాడు - నెత్తి బొప్పి కట్టి ఇప్పుడు కనిపిస్తున్నాయా...
రచయిత: వి. శ్రీనివాస చక్రవర్తి.ఓ పడవలో ఇద్దరు జాలర్లు, మామ, అల్లుళ్లు సముద్రం మీద విహరిస్తుంటారు. మామ వల విసుర్తుంటే అల్లుడు తెడ్డు వేస్తుంటాడు. ఇంతలో మామ విసిరిన వలలో రొయ్యల పంట పండుతుంది.మామ - ఓరయ్యో రొయ్య! (పెద్దగా కేక పెడతాడు).పడిందిరో రొయ్యపులుసులో వెయ్యపళ్లెంలో పొయ్యపండగలే చెయ్య! (పాడుతూ గెంతుతుంటాడు మామ)(అందించిన మూట అందుకుని ఆనందించకుండా అల్లుడు ఎటో చూస్తుంటాడు.)మూట అట్టుకో ఎహే! (మామ కసుర్తాడు. మూట ఇటు అందిస్తే, అల్లుడు చేయి అటు, అటు అందిస్తే చేయి ఇటు చాచుతాడు అల్లుడు. మామకి చిర్రెత్తుకొస్తుంది.)మామ - అందుకోమంటే...
postlink