శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.
గెలీలియో బోధనలకి అటు అరిస్టాటిల్ వాదుల నుండి, ఇటు చర్చి ప్రతినిధుల నుండి కూడా వ్యతిరేకత ఉండేదని కిందటి సారి చెప్పుకున్నాం.
తన బోధనల మీద నమ్మకం కుదరకపోతే వాళ్లనే స్వయంగా వచ్చి తన దూరదర్శినిలో ఓ సారి తొంగి చూడమని ఆహ్వానించేవాడు గెలీలియో. కాని అసలు దూరదర్శిని పని తీరు మీదే అవిశ్వాసం వ్యక్తం చేశారు ఎంతో మంది. దూరదర్శినిలో కనిపించే దృశ్యాలన్నీ వట్టి భ్రాంతి అని, అదంతా అందులోని కటకాల మహిమ అని వాదించేవారు. వాళ్లని ఒప్పించడానికి దూరదర్శిని ప్రదర్శించే చిత్రాలు వాస్తవ వస్తువులకి సంబంధించినవేనని నిరూపించడానికి ప్రయత్నించాడు గెలీలియో. అంతరిక్ష వస్తువులని కాకుండా భూమి మీదే ఉన్న ఎన్నో సుపరిచిత వస్తువుల కేసి ఆ పరికరాన్ని గురి పెట్టి అందులో కనిపించే దృశ్యాలకి, వాస్తవ వస్తువులకి మధ్య సంబంధాన్ని నిరూపించాడు. అయినా కూడా ఒప్పుకోకుండా మొండికేసే అరిస్టాటిల్ వాదుల మూర్ఖత్వానికి నివ్వెరపోయేవాడు, నవ్వుకునేవాడు.

అరిస్టాటిల్ వాదుల తీరు ఇలా ఉంటే చర్చి అధికారుల స్పందన ఇంకా విడ్డూరంగా ఉంది. పృథ్వీ కేంద్ర సిద్ధాంతాన్ని సూటిగా ఖండించకుండా, కేవలం తన పరిశీలనలని మాత్రం అనార్భాటంగా ప్రచారం చేస్తూ వచ్చాడు గెలీలియో. సమాజం నెమ్మదిగా ఆ ఫలితాలని సమ్మతించిందంటే క్రమంగా వాటి పర్యవసానమైన సూర్యసిద్ధాంతాన్ని కూడా సమ్మతిస్తుందని ఊహించాడు. ప్రజల చింతనలో వచ్చే పరిణామాలు చూసి ఏదో ఒక నాటికి చర్చి కూడా మనసు మార్చుకుంటుందని, సూర్య సిద్ధాంతాన్ని ఒప్పుకుంటుందని ఆశపడ్డాడు.
కాని చర్చి తీరులో ఏ మార్పు రాకపోయేసరికి ఒక దశలో మతాధికారులతో ఈ విషయాల గురించి ఒక చర్చ ప్రారంభించాలి అనుకున్నాడు. అలాంటి చర్చని ప్రారంభించడానికి ఓ సదవకాశం మార్చి 1611 లో వచ్చింది. టస్కనీ రాష్ట్రానికి చెందిన ప్రత్యేక వైజ్ఞానిక ప్రతినిధిగా ఒక సారి రోమ్ ని సందర్శించే అవకాశం దొరికింది. మార్చిలో మొదలైన ఆ సందర్శనం జూలై నెల వరకు సాగింది. అసలు అదే చర్చిఅధికారుల సుముఖతని తెలిపే ఓ శుభసూచకం అనుకోవాలి. అప్పటి పోప్ పాల్ – V గెలీలియోని స్వయంగా అహ్వానించి, అతిథి సత్కారం ఇచ్చాడు. సామాన్యులు పోప్ ని సంబోధించేటప్పుడు మోకాళ్ల మీద మోకరిల్లి మాట్లాడాలనే ఆనవాయితీ ఉండేది. గెలీలియో విషయంలో ఆ ఆనవాయితీని పక్కనపెడుతూ నించునే మాట్లాడనిచ్చాడు. గతంలో అసలు దూరదర్శిని లోంచి చూడడానికి కూడా ఒప్పుకోని చర్చి ఇప్పుడు ఆ ఒట్టుతీసి గట్టు మీద పెట్టింది. కార్డినల్ బెలార్మిన్ తానే స్వయంగా ఓ సారి దూరదర్శిని లోంచి తొంగి చూశాడు. అక్కడితో ఆగక గెలీలియో ప్రతిపాదనలని పరీక్షించడం కోసం ఒక వైజ్ఞానిక ఉపసదస్సుని ఏర్పాటు చేశాడు. ఆ సదస్సుకి చెందిన జెసూట్ అర్చకులు దూరదర్శినితో ఎన్నో పరిశీలనలు చేసి వారి అనుభవాల సారాంశాన్ని ఇలా పేర్కొన్నారు:
1. పాలపుంత అసంఖ్యాకమైన తారల సమూహం

2. శనిగ్రహం పరిపూర్ణ గోళం కాదు. దాని ఆకారం ఇరుపక్కలా ఉబ్బెత్తుగా పొంగి ఉంటుంది.
3. చందమామ ఉపరితలం కూడా నునుపుగా ఉండక ఎత్తుపల్లాలతో ఉంటుంది.
4. వీనస్ కి దశలు ఉంటాయి.
5. బృహస్పతికి నాలుగు చందమామలు ఉన్నాయి.

గెలీలియో కనుక్కున్న పై విషయాలన్నీ జెసూట్ అర్చకులు స్వయంగా నిర్ధారించారు. వాటిని ఒప్పుకుంటూ చర్చి సాధికారికంగా ప్రకటన ఇచ్చింది.

కాని చిత్రం ఏంటంటే ఇన్ని ఒప్పుకున్నా సూర్యసిద్ధాంతాన్ని మాత్రం చర్చి ఒప్పుకోలేదు. అది అదే, ఇది ఇదే...

(సశేషం...)

6 comments

  1. క్షమించాలి. మీ ఈ postకేమాత్రం సంబంధంలేని ఒక సందేహం. ఇవ్వాళ A Brief History Of Time చదువుతుంటే ఒక సందేహం వచ్చింది. అదేంటంటే...

    Another prediction of general relativity is that time should appear to slower near a massive body like the earth.
    This is because there is a relation between the energy of light and its frequency (that is, the number of waves of
    light per second): the greater the energy, the higher frequency. "As light travels upward in the earth’s
    gravitational field, it loses energy, and so its frequency goes down." (This means that the length of time between
    one wave crest and the next goes up.) To someone high up, it would appear that everything down below was
    making longer to happen. This prediction was tested in 1962, using a pair of very accurate clocks mounted at
    the top and bottom of a water tower. The clock at the bottom, which was nearer the earth, was found to run
    slower, in exact agreement with general relativity. The difference in the speed of clocks at different heights
    above the earth is now of considerable practical importance, with the advent of very accurate navigation
    systems based on signals from satellites. If one ignored the predictions of general relativity, the position that
    one calculated would be wrong by several miles!
    Newton’s laws of motion put an end to the idea of absolute position in space. The theory of relativity gets rid of
    absolute time. Consider a pair of twins. Suppose that one twin goes to live on the top of a mountain while the
    other stays at sea level. The first twin would age faster than the second. Thus, if they met again, one would be
    older than the other. In this case, the difference in ages would be very small, but it would be much larger if one of the twins went for a long trip in a spaceship at nearly the speed of light. When he returned, he would be
    much younger than the one who stayed on earth. This is known as the twins paradox, but it is a paradox only if
    one has the idea of absolute time at the back of one’s mind. In the theory of relativity there is no unique
    absolute time, but instead each individual has his own personal measure of time that depends on where he is
    and how he is moving.
    Before 1915, space and time were thought

    నా కర్ధం కానిది ఆ quoted text. ఒక వేళ భూమి పైకెళ్ళేకొద్దీ time wave'e frequency తగ్గుతూ వుండే పనైతే మనం రెడు సెకన్లుగా భావించే కాలాన్ని ఆ పైనుండే వాళ్ళు ఒక సెకనుగా feel అవ్వాలి. ప్రతి ఒక్కరూ ఒక సెకనుకు ఒక apple తినగలరనుకుంటే. ఆ పైనుండేవాళ్ళు ఒక apple తినటానికి పట్టే కాలమ్ళొ ఈ క్రింద నున్న వాళ్ళు రెండూ apples తిన గలరు. అప్పుడు క్రిందనున్న వాళ్ళే పైనున్న వాళ్ళు చాలా time తీసుకుంటున్నట్లు feel అవ్వాలి. ఇచ్చిన twin paradox కూడా అదే చెబుతోంది. వీలైతే arun.1202@gmail.com కి mail చెయ్యగలరు. I preferabley think that its the problem I have in understanding the sentense or a mistake that had crept in forming the sentence..

  2. క్షమించాలి. మీ ఈ postకేమాత్రం సంబంధంలేని ఒక సందేహం. ఇవ్వాళ A Brief History Of Time చదువుతుంటే ఒక సందేహం వచ్చింది. అదేంటంటే...

    Another prediction of general relativity is that time should appear to slower near a massive body like the earth.
    This is because there is a relation between the energy of light and its frequency (that is, the number of waves of
    light per second): the greater the energy, the higher frequency. "As light travels upward in the earth’s
    gravitational field, it loses energy, and so its frequency goes down." (This means that the length of time between
    one wave crest and the next goes up.) To someone high up, it would appear that everything down below was
    making longer to happen.

    నా కర్ధం కానిది ఆ quoted text. ఒక వేళ భూమి పైకెళ్ళేకొద్దీ time wave'e frequency తగ్గుతూ వుండే పనైతే మనం రెడు సెకన్లుగా భావించే కాలాన్ని ఆ పైనుండే వాళ్ళు ఒక సెకనుగా feel అవ్వాలి. ప్రతి ఒక్కరూ ఒక సెకనుకు ఒక apple తినగలరనుకుంటే. ఆ పైనుండేవాళ్ళు ఒక apple తినటానికి పట్టే కాలమ్ళొ ఈ క్రింద నున్న వాళ్ళు రెండూ apples తిన గలరు. అప్పుడు క్రిందనున్న వాళ్ళే పైనున్న వాళ్ళు చాలా time తీసుకుంటున్నట్లు feel అవ్వాలి. ఇచ్చిన twin paradox కూడా అదే చెబుతోంది. వీలైతే arun.1202@gmail.com కి mail చెయ్యగలరు. I preferabley think that its the problem I have in understanding the sentense or a mistake that had crept in forming the sentence..

  3. భారమైన వస్తువుల సమీపంలో కాలం నెమ్మదిగా ప్రవహిస్తుంది.. ఇక్కడ ’నెమ్మది’ అన్నది సాపేక్షమైన విషయం.
    భారమైన, అంటే బలమైన గురుత్వక్షేత్రం ఉన్న వస్తువుకి దగ్గరిగా కన్నా దూరంగా కాలం వేగంగా ప్రవహిస్తుంది. ఉదాహరణకి ఓ న్యూట్రాన్ తారకి ఉపరితలంలో A అనే వ్యక్తి, బాగా ఎత్తులో B అనే వ్యక్తి ఉన్నారు అనుకుందాం. ఇద్దరి వద్దా ఒకే రకమైన కాంతి మూలాలు ఉన్నాయి. (వాటి పౌన:పున్యాలు ఒక్కటే). కనుక ఎవరికి వారు వారి కాలాలు సరిగ్గానే ప్రవహిస్తున్నాయి అనుకుంటారు. కాని ఇప్పుడు కిందన ఉన్న A పైనున్న B కి ఓ కాంతి సంకేతం పంపుతాడు. పైకి చేరిన కాంతి తరంగం కొంచెం శక్తి కోల్పోతుంది. దాని పౌన:పున్యం తగ్గుతుంది. A నుండి వచ్చిన కాంతి పౌన:పున్యం, తన వద్ద నున్న కాంతి పౌన:పున్యం కన్నా తక్కువగా ఉండడం గమనిస్తాడు B. కాంతి యొక్క కంపన ఒక గడియారంగా అనుకుంటే A వద్ద కాలం నెమ్మదిగా సాగుతోందని B అనుకుంటాడు. A ఒక ఆపిల్ తినేంతలో B రెండసి తినేస్తుంటాడు!

    పై ఉదాహరణ పూర్తిగా సామాన్య సాపేక్ష సిద్ధాంతానికి సంబంధించినది.

    Twin paradox విషయంలో పరిస్థితి కొంచెం వేరు. అది గురుత్వ క్షేత్రం వల్ల జరగడం లేదు. కాసేపు సాపేక్ష వేగం వల్ల, కాసేపు త్వరణం వల్ల జరుగుతోంది. అయితే సామాన్య సాపేక్ష సిద్ధాంతం ప్రకారం త్వరణం, గురుత్వం సమతుల్యం. ఈ విషయంలో ఇద్దరు కవలల మధ్య సాపేక్ష వేగం అధికంగా ఉండడం వల్ల కాల గతులలో మార్పు వస్తోంది. అయితే ఇద్దరూ ముందు ఎవరికి వారి కాలాలు బాగానే సాగుతున్నాయని, అవతలి వారి కాలాలే నెమ్మదిగా సాగుతున్నాయని అనుకుంటారు. కాని ప్రయాణం మీద బయల్దేరిన వ్యక్తి ఒక దశలో వెనక్కు తిరగాలి. ఆ సమయంలో త్వరణం చెందుతాడు. కనుక ప్రయాణిస్తున్న వాడి కాలం మాత్రమే నెమ్మదిస్తుంది. (వాడు యవ్వనంగా ఉంటాడు). భూమి మీద కదలకుండా ఉన్నవాడి కాలం ’మామూలుగా’నే ఉంటుంది. (వాడి వయసు పైబడుతుంది). ఈ కవలల వైపరీత్యంలో ప్రత్యేక + సామాన్య సాపేక్ష సిద్ధాంతాలు రెండిటినీ వర్తింపజేయలి.

    నాకు తెలిసినంతలో ఇది సరైన సమాధానం అనుకుంటున్నాను. ఇది కాదంటే ఎవరైనా సవరించగలరు.

  4. భారమైన వస్తువుల సమీపంలో కాలం నెమ్మదిగా ప్రవహిస్తుంది.. ఇక్కడ ’నెమ్మది’ అన్నది సాపేక్షమైన విషయం.

  5. భారమైన వస్తువుల సమీపంలో కాలం నెమ్మదిగా ప్రవహిస్తుంది.. ఇక్కడ ’నెమ్మది’ అన్నది సాపేక్షమైన విషయం.

  6. భారమైన వస్తువుల సమీపంలో కాలం నెమ్మదిగా ప్రవహిస్తుంది.. ఇక్కడ ’నెమ్మది’ అన్నది సాపేక్షమైన విషయం.

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts