శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.
స్నేహగారు వాళ్ల ఆరేళ్ల అబ్బాయి గ్రహాల గురించి అడుగుతున్నాడని అడిగారు. అందుకు నాకు తోచిన వివరణ ఇస్తున్నాను. ఇంకా ఏవైనా సంగతులు ఉంటే ఇతర బ్లాగర్లకి కూడా సూచించమని మనవి. గ్రహాలు పెద్ద మట్టి బంతులు అని మొదలు పెట్టొచ్చు. భూమి అనే మట్టి బంతి మీద మనం ఉన్నామని చెప్పొచ్చు. ఓ గ్లోబ్ తెచ్చి దాని మీద మనం ఎక్కడ ఉన్నామో చూపించొచ్చు. మరి భూమి బంతిలాగా కనిపించదే? అన్న ప్రశ్న రావచ్చు. దాని బదులుగా కొన్ని వివరణలు ఇవ్వొచ్చు.


భూమి మన కన్నా చాలా పెద్దది కనుక, మన చుట్టూ ఉండే ప్రదేశం చదునుగా కనిపిస్తుంది గాని, తగినంత ఎత్తు నుండి చూస్తే వంపు తిరిగినట్టు కనిపిస్తుంది. భూమి యొక్క ఆత్మప్రదక్షణ గురించి చెప్పి, రాత్రి పగలు ఎలా వస్తాయో చెప్పాలి. భూమి చదునుగా పళ్లెంలా ఉంటే అన్ని దేశాల వాళ్లకి ఒక్కసారే పగలు రావాలి. కాని అలా జరగదని నిరూపించడానికి (మీరు ఇండియాలో ఉన్నట్లయితే) అమెరికాలో ఉన్న బంధువులకి పగటి (రాత్రి) పూట ఫోన్ చేసి అప్పుడు వాళ్లకి రాత్రి (పగలు) అవుతుందని వాళ్ల చేత మీ పిల్లవాడికి చెప్పించాలి.


భూమి స్థానికంగా చదునుగా కనిపించినా విస్తృత స్థాయిలో గోళాకారంలో ఉంటుందని చూపించడానికి “గూగుల్ ఎర్త్” బాగా పనికొస్తుంది. అందులో మీరు ఉంటున్న ప్రాంతంతో మొదలుపెట్టి క్రమంగా ‘జూమ్ అవుట్’ చేస్తే భూమి గోళంలా ఎలా ఉందో మీ అబ్బాయికి చూపించొచ్చు. (Google.Earth-2011.com)




సముద్రం తీరం దగ్గర్లో ఉంటే సముద్రం వద్ద, తీరం నుండి దూరం అయ్యే ఓడలు కనుమరుగయ్యే తీరు గురించి వివరించవచ్చు. ఆ విధంగా పిల్లవాడికి భూమి ఓ పెద్ద మట్టి బంతిలా ఉందని కొంత అవగాహన కలిగాక భూమి లాంటివే ఇతర (ఉప) గ్రహాలు ఎన్నో ఉన్నాయని చెప్పొచ్చు.


* ఉదాహరణకి చందమామని చూపించొచ్చు. మనకి పగలు, రాత్రి ఉన్నట్టే చందమామ మీద నల్లగా ఉన్న భాగం అక్కడి రాత్రి అని, ప్రకాశంగా (పసుపు పచ్చగా) ఉన్న భాగం అక్కడి పగలు అని చెప్పొచ్చు.


* మంచి బైనోక్యులర్ల్స్ ఉంటే చందమామ మీద విశేషాలు బాగా చూపించొచ్చు. చందమామని చూపించినప్పుడు, భూమి లాగానే అది కూడా అదో పెద్ద మట్టి గడ్డ అన్నప్పుడు మరో సందేహం కలగొచ్చుః 'చందమామ ఎందుకు కిందపడదు?'


*అప్పుడు 'కిందపడడం' అంటే ఏంటో వివరించాలి. పెద్దగా పరిభాషని వాడకుండా వస్తువులన్నీ ఒకదాన్నొకటి ఆకర్షించుకుంటాయని, వస్తువు పెద్దదైన కొద్ది ఆకర్షణ పెరుగుతుందని, దూరం ఎక్కువైన కొద్ది ఆకర్షణ తగ్గుతుందని చెప్పాలి.


* అయస్కాంతం ఇనుప రజనుని ఆకర్షించినట్టే భూమి కూడా తన చుట్టూ ఉన్న వస్తువులని ఆకర్షిస్తుందని, అదే 'కిందపడడం' అని చెప్పొచ్చు. అయస్కాంతం కూడా కనీస దూరంలో ఉంటే తప్ప ఇనుప రజనుని ఆకర్షించనట్టే, చందమామ భూమికి కాస్త దూరంలో ఉంది కనుక భూమి మీద 'పడిపోద'ని చెప్పొచ్చు. (అయితే భూమి చుట్టూ కక్ష్యలో తిరగడం మొదలైనవి మరి కాస్త కఠినమైన విషయాలు. అవన్నీ అడిగినప్పుడు చూద్దాం!!!) అలా చందమామ కూడా ఓ పెద్ద మట్టి గడ్డ అని అర్థమయ్యాక, ఇతర గ్రహాల విషయానికి రావచ్చు.


* వీనస్ ని సులభంగా చూపించొచ్చు. తెల్లవారు జామున గాని (వేగుచుక్క), సాయంకాలం గాని అత్యంత ప్రకాశవంతమైన తారగా కనిపిస్తుంది. http://en.wikipedia.org/wiki/Venus_(planet) * వీనస్ కాకుండా, మార్స్, జూపిటర్, సాటర్న్ లని కచ్చితంగా ఏ దిశలో చూడాలో తెలిస్తే కంటితోనే చూడొచ్చు. ఈ సంవత్సరం ఏ ఏ కాలాలలో ఏఏ గ్రహాలు ఎక్కడ కనిపిస్తాయో ఆ వివరాలు ఈ సైట్ లో http://stardate.org/nightsky/planets


* ఇతర గ్రహాల కోసం టెలిస్కోప్ అవసరం అవుతుంది.


* దగ్గర్లో ఏదైనా ప్లానెటేరియమ్ ఉంటే, అక్కడ టెలిస్కోప్ లోంచి చూసే అవకాశం ఉంటే సాటర్న్ ని చూపించడానికి ప్రయత్నించండి. సాటర్న్ రింగ్స్ చూడడానికి మహా సొగసుగా ఉంటాయి!


http://www.lpi.usra.edu/education/skytellers/solar_system/activities/planet_viewing.shtml

6 comments

  1. చాలా థాంక్స్ అండి.3-4 యేళ్ళు ఉన్నప్పుడు అడిగేవాడు చంద్రుడు ఎందుకు కిందపడడు. మీరు వివరించినట్లుగానే వాడికి చెప్పాను.ప్రస్తుతం నక్షత్రాలు, గ్రహాలు చూడాలని రోజు చీకటి పడాగానే ఆకాశంలో గమనిస్తూ వున్నాం.

     
  2. స్నేహ గారూ..
    మా అమ్మాయికి 5 ఏళ్ళు వుండగా నేను కూడా ఇదే విషయాన్నీ చెప్పాల్సి వచ్చింది. పై విషయాలతో పాటూ నేను celestia అనే సాఫ్ట్వేర్ ఒకటి డౌన్ లోడ్ చేసుకొని చూపించాను. మా అమ్మాయికి చాలా మటుకు సందేహాలకి సమాధానం వచ్చింది. ఆ డౌన్ లోడ్ వివరాలు:
    http://download.cnet.com/windows/3055-2054_4-10064567.html?tag=pdl-redir
    మొత్తం సౌరకుటుంబం అంతటినీ బయటినుంచీ చూసినట్టుగా కనిపిస్తుంది. మనం ఏ గ్రహం మీదకు కావాలంటే అక్కడకు వెళ్ళొచ్చు. గ్రహణాలు ఎలా ఏర్పడుతాయో చూడొచ్చు. స్పేస్ స్టేషన్స్ మీదకి వెళ్ళొచ్చు..చాలా బాగుంది. మీరుకూడా చూపించండి.
    @ శ్రీనివాస చక్రవర్తి గారికి, మీ బ్లాగ్ అత్యద్భుతం సార్..! చిన్నప్పుడు చదూకున్న చాలా విషయాలు ఇప్పుడు మళ్ళీ ఇంత సింపుల్ గా తెలుసుకోవడం చాలా బాగుంది.
    - రాధేశ్యాం (www.radhemadhavi.blogspot.com)

     
  3. పైగా అది (celestia ) రియల్ టైం ఖగోళ దర్శిని.
    - రాధేశ్యాం (www.radhemadhavi.blogspot.com)

     
  4. స్నేహ గారూ, రాధేశ్యాం గారూ, మీ పిల్లల ప్రశ్నలు బావున్నాయి.
    చంద్రుడు ఎందుకు పడిపోడు? గాలి ఎందుకు కనిపించదు? :)
    శాస్త్ర విజ్ఞానం వారి కృషి గురించి చెప్పేదేముంది? :)
    చదివి తెలుసుకోవడమే.
    రాధేశ్యాం గారూ, మీరు చెప్పిన సాఫ్ట్వేర్ చూశాను. బావుంది. మా పిల్లలకు చూపించాలి.
    Thanks.

     
  5. రాధేశ్యాం గారు,

    మీరు చెప్పిన సొఫ్ట్‌వేర్ మా అబ్బాయికి చూపిస్తానండి.
    చాలా థాంక్స్

    లలిత గారు,
    పిల్లల ప్రశ్నల గురించి చెప్పేదేముంది మనకు చెప్పే ఓపిక ఉండాలి కాని వాళ్ళు అడుగుతూనే ఉంటారు :-)
    ఇప్పుడు గ్రహాల గురించి తెసుకునే ప్రయత్నంలో లైబ్రరీ నుండి మార్స్ గురించి ఒక పుస్తకం తెచ్చుకున్నాడు.

     
  6. పైన చర్చ చూస్తే చాలా సంతోషంగా ఉంది. అటు సైన్స్ ని, ఇటు పిల్లల్ని ప్రేమించే నలుగురు మిత్రులు కలిసి సరదాగా మాట్లాడుకుంటున్నట్టు ఉంది. ఇలాంటి సందర్భాలు ఈ బ్లాగ్ లో మరిన్ని ఎదురైతే బావుంటుంది.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts