శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.


భూమికి మల్లె అక్కడా దట్టమైన వాతావరణం ఉంటుంది. ఆ వాతావరణంలో పుష్కలంగా నైట్రోజెన్ ఉంటుంది. అక్కడా ఆకాశంలో మబ్బులు ఉంటాయి. ఆ మబ్బులు వర్షిస్తుంటాయి. చక్రికంగా మారే ఋతువులు ఉంటాయి. నదులు, సముద్రాలు ఉంటాయి. ఎత్తైన తిన్నెలు, పర్వతాలు ఉంటాయి. కాని పోలిక అక్కడితో ఆగిపోతుందండోయ్! ఎందుకంటే అక్కడి మబ్బులు వర్షించేది నీరు కాదు. ద్రవ రూపంలోని మీథేన్. అక్కడి పర్వతాలలో ఉండేది రాయి కాదు, రాతి కన్నా కఠినమైన ఘనీభవించిన నీరు. మనం ప్రస్తావించే విచిత్ర లోకం పేరు – టైటన్.

టైటన్ శనిగ్రహం యొక్క ఉపగ్రహాల్లో అతి పెద్ద ఉపగ్రహం. మనకి కచ్చితంగా తెలిసినంత మేరకు ఉపరితలం మీద ద్రవరూపంలో పదార్థం ఉన్న మరో లోకం ఇదే. సౌరమండలంలో ఇది రెండవ అతి పెద్ద సహజ ఉపగ్రహం. (అతి పెద్ద ఉపగ్రహం జూపిటర్ ఉపగ్రహమైన గానిమీడ్). 1655 లో డచ్ ఖగోళశాస్త్రవేత్త క్రిస్టియన్ హయ్గెన్స్ దీన్ని కనుక్కున్నాడు.

టైటన్ లో ఒక ప్రత్యేకత దాని వాతావరణం. మొత్తం సౌరమండలంలో కెల్లా వాతావరణం గల సహజ ఉపగ్రహం ఇదే. అయితే భూమి వాతావరణం కన్నా ఇక్కడి వాతావరణం చాలా దట్టంగా ఉంటుంది. దీని ఉపరితలం వద్ద వాయుపీడనం భూమి మీద కన్నా 1.45 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఉపగ్రహం అంతా ఎప్పుడూ ముసురు కప్పినట్టు ఉంటుంది. ఆ కారణం చేతనే అంతరిక్షం నుండి చూస్తున్నప్పుడు ఉపగ్రహం ఉపరితలం మీద విశేషాలు స్పష్టంగా కనిపించవు. సూర్యకాంతిలోని అతినీలలోహిత (అల్ట్రావయలెట్) కాంతి ఆ వాతావరణంలోని మీథేన్ వాయువు మీద జరిపే చర్యవల్ల ఆ ముసురు పుడుతోంది. అందుకే 1980 లలో వాయేజర్ 1,2 వ్యోమనౌకలు దీని పక్కగా ప్రయాణిస్తూ ఫోటోలు తీసినప్పుడు పెద్దగా సమాచారం బయటపడలేదు.




దూరం నుండి ఫోటోలు తీసే పద్ధతి లాభం లేదని, ఏకంగా టైటన్ మీద వాలి అధ్యయనాలు చేసేందుకు గాను హైగెన్స్-కాసినీ అనే వ్యోమనౌక పంపబడింది. ఈ నౌక జులై 1, 2004, లో సాటర్న్ సమీప ప్రాంతాన్ని చేరుకుంది. ఉపగ్రహం చుట్టూ కక్ష్యలో తిరుగుతూ త్వరలోనే ఫోటోలు తీసుకోవడం మొదలెట్టింది. అదే ఏడాది అక్టోబర్ లో హైగెన్స్-కాసినీ వ్యోమనౌక నుండి కాసినీ అనే ప్రోబ్ (సర్వే చేసే చిన్న నౌక) వేరు పడి, ఉపగ్రహం నుండి 1,200 కి.మీ.ల దూరానికి సమీపించి ఎన్నో స్పష్టమైన ఫోటోలు తీసి భూమికి పంపింది. జనవరి 2005 లో, హైగెన్స్ అనే ప్రోబ్ కూడా వేరుపడి, టైటన్ ఉపరితలం మీద వాలి ఎంతో విలువైన సమాచారాన్ని సేకరించింది. మనం పంపిన వ్యోమనౌకలు వాలిన లోకాలు అన్నిట్లోకి అతి దూరమైన లోకం ఈ టైటన్.



'కాసినీ' ప్రోబ్ టైటన్ మీద అధ్యయనాలు జరుపుతున్నప్పుడు దక్షిణధృవం వద్ద నల్లగా, ఓ చిక్కని నీడలాంటి ప్రాంతం కనిపించింది. తదనంతరం అదొక పెద్ద సరస్సు అని తేలింది. దానికి ఒంటారియో లాకస్ అని పేరు పెట్టారు. అయితే అది నీటి సరస్సు కాదు. హైడ్రోకార్బన్ల సరస్సు! తదనంతరం కాసినీ వ్యోమనౌక తీసిన రాడార్ చిత్రాల బట్టి ఉపగ్రహం యొక్క ఉత్తర ధృవం వద్ద కూడా అలాంటి ఎన్నో ‘మచ్చలు’ కనిపించాయి. ఉత్తర గోళార్థంలో ఏకంగా సముద్రాలు అని చెప్పుకోదగినంత పెద్ద మీథేన్ సరస్సులు కొన్ని కనుక్కోబడ్డాయి. వీటి పరిమాణం ఒక కిమీ నుండి కొన్ని వందల కిమీల వరకు ఉంటుంది. ఈ పరిశీలనలు అన్నిటి ఆధారంగా టైటన్ మీద నిశ్చయంగా మీథేన్ సరస్సులు ఉన్నాయని 2007 లో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఎంతో కాలంగా టైటన్ గురించి తెగని రహస్యంగా ఉన్న విషయం చివరికి నిజమని తేలింది.



ఆ విధంగా 2008 వరకు కాసినీ నుండి పోగైన సమాచారాన్ని బట్టి భూమి మీద ఉన్న మొత్తం చమురు నిలువల కన్నా కొన్ని వందల రెట్లు ఎక్కువ హైడ్రోకార్బన్ల నిలువలు టైటన్ మీద ఉన్నాయని రూఢిగా తెలిసింది. అపారమైన చమురు నిలువలు ఉండడంతో భవిష్యత్తులో అంతరిక్ష యాత్రలకి గమ్యంగా టైటన్ ప్రాముఖ్యత పెరిగింది. పుష్కలమైన ఇంధనపు వనరులు జూపిటర్ పరిసరాలలో కూడా ఉన్నా ఆ గ్రహం చుట్టూ ఉండే తీవ్రమైన రేడియేషన్ దృష్ట్యా అక్కడ మకాం పెట్టి ఇంధనాలని తవ్వితీసే ప్రయత్నం మరింత కష్టం అవుతుంది. మహావాయు గ్రహాలైన (gas giants) జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ ల నాలుగింటిలోను సాటర్న్ చుట్టూ ఉన్న ఇంధనపు వనరులని కొల్లగొట్టడం మరింత సులభం అంటాడు రాబర్ట్ జుబ్రిన్ అనే అమెరికన్ ఎయిరోస్పేస్ ఇంజినీరు. ఎందుకంటే సాటర్న్ జూపిటర్ కన్నా దూరమే కాని, తక్కిన రెండు మహావాయుగ్రహాల కన్నా చాలా దగ్గర. సాటర్న్ చుట్టూ సులభంగా ఆవాసాలు ఏర్పాటు చేసుకోదగ్గ ఉపగ్రహాలు ఉన్నాయి. రేడియేషన్ కూడా తక్కువే.



కేవలం చమురు కోసమే కాక ఉండడానికి కూడా భూమి తరువాత సౌరమండలంలో ఓ ముఖ్యమైన ప్రదేశంగా టౖటన్ ప్రాముఖ్యతని సంతరించుకుంది. ఉపగ్రహపు ఉపరితలం మీద మీథేన్ ఉన్నా, భూగర్భంలో ద్రవరూపంలో నీరు, అమోనియా లు ఉన్నాయని తెలిపే ఆధారాలు ఉన్నాయి. ఆ నీటిని పైకి తీసి మానవ అవసరాలకి వాడుకోవచ్చు. అలాగే అక్కడ సులభంగా దొరికే ఇంధన వనరులలోని శక్తిని ఉపయోగించి, నీటిని భేదించి, ఆక్సిజన్ తయారుచేసుకోవచ్చు. అక్కడ దొరికే హైడ్రోకార్బన్లని పంటలకి ఫెర్టిలైజర్లుగా వాడుకోవచ్చు. ఇన్ని ఆకర్షణలు ఉన్న ఆ లోకం మీద ఈ శతాబ్దంలో ఏదో ఒక దశలో మనిషి పాదం మోపే అవకాశం తప్పకుండా ఉంది.

13 comments

  1. Anonymous Says:
  2. మంచి సమాచారం. ఇపుడు ఆ సహజ సంపద దోచుకోవడం ఎలా? అన్నది ప్రశ్న. చమురు దాహం కల చైనావాళ్ళు ఏమైనా పైపులైన్లు వేసేస్తున్నారా?

     
  3. మార్స్ మీద మనిషి పాదం మోపడానికే 2030 ల దాకా ఆగాల్సి రావచ్చు.

    ఇక మార్స్ ని దాటి, జూపిటర్ ని దాటి, అవతల సాటర్న్ పరిసరాలలో ఉన్న టైటన్ కి మనిషిని పంపే పథకాలు ప్రస్తుతానికి (నాకు తెలిసి) లేవు. టైటన్ నేపథ్యం మీద రాసిన ఓ సైన్స్ ఫిక్షన్ నవల (స్టిఫెన్ బాక్స్ టర్ రాసిన 'టైటన్') అయితే ఉంది.

    కనుక నిజంగా మనిషి టైటన్ ని చేరుకోవడం ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం. ఇక అక్కణ్ణుంచి పెట్రోల్ ని భూమికి తరలించడం (పైపుల ద్వారా కాదు!) ఎప్పటికి అవుతుందో...

     
  4. anrd Says:
  5. సార్ ! ఇప్పటికి మండిస్తున్న ఇంధనాల వల్లే భూమ్మీద వాతావరణ కాలుష్యం పెరిగిపోతూంది. ఇక అవన్నీ కిందికి తెస్తే భూమి ఏమయిపోతుందో ? అంతేకాక అవన్నీ భూమ్మీదకు తేవాలన్నా ఖర్చు తడిసి మోపెడవుతుంది.
    పోనీ, భూమ్మీది వాళ్ళే అక్కడకు వెళ్ళాలన్నా బాగా డబ్బున్న వారికే తప్ప అందరికి సాధ్యం కాదు కదా ! నాకు తెలిసిన కొద్దిపాటి విజ్ఞానంతో ఆలోచిస్తే ..... ఏ విధంగా చూసినా ఇదంతా ఉపయోగకరంగా అనిపించటం లేదు.
    ఇలా వ్రాసానని దయచేసి తప్పుగా అనుకోవద్దండి. పర్యావరణం పాడైతే సకల జీవరాశికి కష్టం అని కొందరు శాస్త్రవేత్తలే చెబుతున్నారు కదా మరి...

     
  6. Anonymous Says:
  7. anrd gaaru;
    కొందరు చెబితే చెప్పారు కాని, అందరూ చెప్పడం లేదు కాబట్టి ఖర్చైనా పరవాలేదు, లాభసాటిగా వుంటేనే తెప్పిస్తారులేండి. డబ్బున్న వాళ్ళను అక్కడికి పంపేస్తే ... కిందున్నవారు భూమ్మీద ధనవంతులయ్యే అవకాశం వుంటుంది, మార్క్స్ కలలుగన్న థియరిటికల్ సమసమాజం అప్పటికైనా వస్తుందేమో అనే ఆశావాదంతో వుందాము. :P :))

     
  8. anrd Says:
  9. వాతావరణకాలుష్యం గురించి అందరూ చెప్పకపోయినా .... విపరీతమైన వాతావరణమార్పులను మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు భూమి మీద దొరికే పెట్రోలే బోలెడు రేటు ఉంటోంది. ఇక అంతరిక్షం నుంచీ తెచ్చే ఇంధనం ఎంత రేటుంటుందో ? దానిని కొనగలిగేదెవరు ? సమసమాజం రావాలంటే డబ్బున్న వారు తమ దగ్గరున్న డబ్బును లేనివారితో పంచుకున్నా చాలండి....

     
  10. anrd Says:
  11. "డబ్బున్న వాళ్ళను అక్కడికి పంపేస్తే ... కిందున్నవారు భూమ్మీద ధనవంతులయ్యే అవకాశం వుంటుంది.. "

    మీరన్న ఈ మాటకు అర్ధం ఇందాక అర్ధం కాలేదు.....ఇప్పుడు అర్ధం అయిందండి.

     
  12. Anonymous Says:
  13. "డబ్బున్న వాళ్ళను అక్కడికి పంపేస్తే ... కిందున్నవారు భూమ్మీద ధనవంతులయ్యే అవకాశం వుంటుంది.. "

    మీరన్న ఈ మాటకు అర్ధం ఇందాక అర్ధం కాలేదు.....ఇప్పుడు అర్ధం అయిందండి.

    then, a civilization comes....you are no more indian, american. or a swenska...or anything!!!!!...just an earth citizen (a planetary civilization) !!!!!!! understand????? no more differences!!! casts..creed...religion...places..no more..!!!!!! no more countries..and their cultures. oh yeah, vedas???? who gives a s*** to them????!!!!!
    that's where all these differences are going to vanish!!! one day..it will be the earth's fate!! and the intelligent being's history!!!! Idiot!!!!!! this will be the future!!!! why dont you see it????

    its no more about money......its mainly to survive!!!!! you idiot!! its to survive!!!! you think the mankind can survive on this lonely planet for infinity..???? no matter what religion they practice??????
    Its just impossible!!!! IMPOSSIBLE!!! they have to find other resources...other planets of life and everything....and they are doing it..working hard on it!!!!.....I dont understand what your problem is???????IDIOT!!!!!cuz..u dont have any problem other than spending ur time! better DIE! now!! right NOW! @anrd!!!!

     
  14. Anonymous Says:
  15. Anon Above,

    What exactly you want to say? Why so many ?&! marks? You could have efficiently expressed your views in 2 or 3 sentences. You wasted lots of energy!
    Looks, you are emotionally distressed, philosophically confused and suffering with 'constipation of thoughts and diarrhea of mouth'! :D

    You should be the first to be blasted-off to Titan or whatever planet, so that we can rest here, peacefully. :))

     
  16. Anonymous Says:
  17. SNKR
    He has been kicked very hard by your dost Malakpet Rowdy and is frustrated. Let him vent it out. I heard he gave a statement that he will kick Malakpet Rowdy out of blogs and Rowdy accepted the challenge. Looks like we have good entertainment :)

     
  18. anrd Says:
  19. అజ్ఞాత గారూ.. దయచేసి తమరు తెలుగులో వ్రాయండి. ఇవి తెలుగు బ్లాగులు కదా ! మీరు అందర్నీ తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. ప్రపంచంలోని అందరూ సుఖంగా ఉండాలన్నదే మా అభిప్రాయం కూడా .

    ఇంకా నా అభిప్రాయాలు మరికొన్ని ఏమిటంటే......ఆర్కిటిక్, అంటార్కిటిక్ ఖండాలకు ఎవరూ వెళ్ళటం లేదు కదా ! అలాగే ఎంత డబ్బున్నా నీళ్ళు, గాలి, పచ్చటి ప్రకృతి లేనప్పుడు ఇతర గ్రహాలకు ఎవరు వెళ్తారు ? కొందరు పరిశోధకులు, శాస్త్రవేత్తలు తప్ప ఎవరూ వెళ్ళరు.

    భూమి మీద లాగా ఇతర గ్రహాల మీద సదుపాయాలు కల్పించాలంటే అంతులేని డబ్బు ఖర్చవుతుంది. ఆ డబ్బుతో భూమ్మీదే బోలెడు సదుపాయాలు ఏర్పరుచుకోవచ్చు.

     
  20. Regarding this unhealthy trend among bloggers to bash each other, I can only present the following quote:

    “Great minds discuss ideas; Average minds discuss events; Small minds discuss people.” -Eleanor Roosevelt

    Please do not make this blog a playfied to your petty scuffles.

     
  21. చక్రవర్తి గారూ,
    రామాయణంలో పిడకల వేటని నిలిపివేయండి. మేము ఎన్నో విషయాలను తెలుసుకోగల్గుతున్నాము.

     
  22. ప్రసాద్ గారు,
    ప్రజలకి పిడకల వేట మీద ఉన్నంత ఉత్సాహం రామాయణం మీద లేదు మరి. ఏం చేద్దాం!-)

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts