అరవింద్ గుప్తా రాసిన 'The Story of Solar Energy' అనే కామిక్ బుక్ యొక్క అనువాదం నిన్ననే పూర్తయ్యింది.పుస్తకం చివర్లో సూర్యుడి మీద ఓ తమాషా పద్యం ఉంది. దాని అనువాదం ఇక్కడ ఇస్తున్నాను.
సూర్యస్తుతి
శక్తి నిపుణులు
అరుస్తుంటారు
అయిపోతాయని
బొగ్గు, చమురు.
హిమధృవాలు కరుగుతాయని,
గడ్డు కాలం వచ్చేస్తోందని.
జపనీస్ అణు సంస్థలు
అంతే లేని అవస్థలు.
కరెంటు పోతే చెప్పాపెట్టక
ఫరవాలేదు బెంబేలు పడక
ఉచితంగా రవిశక్తి వాడుకో
హాయిగ వంటలు వండుకో
గాలిని పట్టి బంధించు
ఇంట్లో దీపం వెలిగించు
సూర్యుడి శక్తిని గ్రహించు
బంగరు భవితను వరించు.
ఆంగ్ల మూలం...
ODE TO THE SUN
Energy experts
Howl and shout
Oil and coal
Are running out
Icecaps melt
Not all is well
Japanese Nukes
All went to hell
When power fails
Welcome the crunch
Use the sun
To cook your lunch
Catch the wind
Switch on a light
Tap the sun
For a future bright
బాగుందండీ! మీరు అనువాదాలు కూడా చేస్తుంటారా?
చక్కటి పోస్ట్ ను అందించినందుకు కృతజ్ఞతలండి..
rasajna garu, anrd garu, Thank you.
rasajna garu:
Can you pl write some articles on Neurology for this blog?
bagundandi!