
ఎన్నో సినిమాల్లో జనం నిప్పుల్లో నడిచేసేయడం చూపిస్తారు. డబ్బులు రావాలనో, జబ్బులు తగ్గాలనో, ‘జాబు’లు రావాలనో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇక కొందరైతే నిప్పుల మీద నడవడం గొప్ప మహిమాన్వితులకే తప్ప, నరాధములకి సాధ్యం కాదంటుంటారు.
మహిమల సంగతేమోగాని నిప్పుల మీద నడిచే ప్రక్రియ ఒక భౌతిక ధర్మం మీద ఆధారపడి జరుగుతుంది. ఇదే ప్రక్రియ మనకి వంటగదిలో కూడా ఒక సందర్భంలో కనిపిస్తుంది.
అట్టు వేసే ముందు ‘ఆంధ్ర ఆడబడుచులు’ పెనం తగినంతగా వేడెక్కిందో...

గొలుసుకట్టు చెరువులని పోలిన వ్యవస్థ ఒకటి హిమాలయ తలాల ప్రాంతాలలో ఉండేది.
బ్రిటిష్ వారి కాలంలో సర్ విలియమ్ విల్కాక్స్ అనే వ్యక్తి నీటిసరఫరా విభాగానికి డైరెక్టర్ జనరల్ గా ఉండేవాడు. ఇతడు ఇండియాలోనే కాక, బ్రిటిష్ అధినివేశమైన ఈజిప్ట్ లో కూడా పని చేశాడు. ఇండియాలోని జలాశయాల గురించి ఇతడు క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. హిమాల ప్రాంతాలని ఇతడు విస్తృతంగా పర్యటించాడు.
ఈ పర్యటనల, అధ్యయనాల ఆధారంగా ఇతడు గత శతాబ్దపు తొలిదశాలలో ఒక సారి కలకత్తా విశ్వవిద్యాలయంలో...

కాలువల ద్వారా వివిధ ప్రాంతాలకి చెందిన నీటి మట్టాల మధ్య సమతౌల్యాన్ని సాధించొచ్చన్న ఆలోచన బ్రిటిష్ వారి నుండి మనం నేర్చుకున్నదా, లేక అంతకు ముందే మన దేశంలో ఉందా?
బ్రిటిష్ వారు రాక ముందే మన దేశంలో ‘గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ’ (chain tank system) ఉండేది. అలాంటి వ్యవస్థ ఒకటి దక్షిణ భారతంలో వుండేది.
తంజావూరికి చెందిన కల్ ఆనై
‘కల్ ఆనై’ అంటే తమిళంలో ‘రాతి ఆనకట్ట’. (కల్ అంటే రాయి). దీన్ని తంజావూరులో కవేరి నది మీదుగా క్రీ.శ. 100 లో...

సర్ ఆర్థర్ కాటన్ ప్రారంభించిన భావ విప్లవాన్ని అర్థం చేసుకుని కొనసాగించిన ఆంధ్రుడు ఒకడున్నాడు. అతడి పేరు కానూరి లక్ష్మణ రావు. ఈయన జవహర్ లాల్ నిహ్రూ, ఇందిరా గాంధీల కాబినెట్ లలో ఇరిగేషన్ మంత్రిగా పని చేశారు.
‘భారత జల సంపద’ (India’s water wealth) అనే పుస్తకంలో ఈయన కాటన్ గురించి ఇలా అంటారు-
“భారతీయ నదీ వ్యవస్థల విషయంలో సర్ ఆర్థర్ కాటన్ అనుపమానమైన అవగాహన కలిగినవాడు. అలాంటి పథకం గత శతాబ్దం (19 వ) లోనే అమలు జరిగి ఉంటే, ఇప్పుడు ఇండియాలో...

న్యూటన్ ప్రతిపాదించిన కాంతి కణ సిద్ధాంతంలో కొన్ని దోషాలు ఉన్నాయి.
1. ఉదాహరణకి సాంద్రతర యానకంలో కాంతి వేగం, విరళ యానకంలో కన్నా ఎక్కువ కాదు. నిజానికి తక్కువ అవుతుంది. పైగా వేగంలో భేదానికి గురుత్వానికి సంబంధం లేదు.
2. కణాల పరిమాణంలో భేదాలు ఉండడం వల్ల రంగులు పుడతాయని న్యూటన్ భావించాడు. అసలు కాంతిలో కణాలు ఉన్నాయనడానికే నిదర్శనాలు లేవు. ఇక ఆ కణాలలో పరిమాణాలలో భేదాల గురించిన చర్చ అసంభవం.
3. పైగా కాంతి యొక్క కొన్ని లక్షణాలని కణ సిద్ధాంతం...

సర్ ఆర్థర్ కాటన్ ప్రతిపాదించింన పథకం పూర్తిగా పగటి కల అనడానికి లేదు.
ఆయన ఊరికే విషయాన్ని పై పైన చూసి ఏ వివరాలు లేకుండా ఆ పథకాన్ని ప్రతిపాదించలేదు. దేశం అంతా కలయదిరిగి, క్షుణ్ణంగా సర్వే చేసి, నదీ నదాలలో ప్రవాహాలు పరిశీలించి, చెరువుల విస్తృతి, వైశాల్యం అంచనా వేసి, నేల వాలు వెల కట్టి, అప్పుడే తన బృహత్ పథకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ముందు ఉంచాడు.
అయితే ఈ పథకం గురించి కొన్ని ప్రశ్నలు పుట్టే అవకాశం ఉంది.
బెంగాల్ నుండి పశ్చిమ తీరానికి, కన్యాకుమారి...
“ఇదుగో చూడండి,” మామయ్య గొంతు సవరించుకుంటూ అన్నాడు. “మన వద్ద ఉన్న సామాన్ని మూడు భాగాలుగా చేస్తాం. ఒక్కొక్కరు ఒక భాగాన్ని మోస్తారు. పెళుసుగా, సులభంగా పగిలిపోయే సామాన్లని మాత్రమే మోస్తాం.”
మా శాల్తీలు ఆ లెక్కలోకి రావని అర్థమయ్యింది.
“పని ముట్లు, సంభారాలలో ఒక భాగం హన్స్ మోస్తాడు. సంభారాలలో మూడో వంతుతో పాటు, ఆయుధాలు నువ్వు మోస్తావు. తక్కిన సంభారాలతో పాటు సున్నితమైన పరికరాలు నేను మోస్తాను,” అంటూ పనులు అప్పగించాడు మామయ్య.
“మరి ఈ బట్టలు, నిచ్చెన తాళ్లు… వీటన్నిటినీ ఎవడు మోస్తాడు?” అర్థంగాక అడిగాను.
“అవి వాటంతకి అవే వెళ్లిపోతాయి.”
“అదెలా?”
“నువ్వే...

నా వేసవి సెలవలు కుమ్మరి పురుగుల సేకరణలో, పుస్తక పఠనంలో, చిన్న చిన్న యాత్రలలో గడచిపోయాయి. ఇక శరత్తు మొత్తం షూటింగ్ తోనే సరిపోయింది. మొత్తం మీద కేంబ్రిడ్జ్ లో నేను గడిపిన మూడేళ్లూ చాలా ఆనందంగా గడచిపోయాయి. ఆ రోజుల్లో మంచి ఆరోగ్యం ఉండేది, మనసెప్పుడూ సంతోషంగా ఉండేది.
నేను కెంబ్రిడ్జ్ కి క్రిస్మస్ సమయంలో చేరటం వల్ల నా ఫైనలు పరీక్ష అయ్యాక కూడా అదనంగా రెండు టర్ములు (1831 లో) ఉండాల్సి వచ్చింది. ఆ రోజుల్లోనే హెన్స్లో నన్ను భౌగోళిక శాస్త్రం చదవమని...
postlink