సర్ ఆర్థర్ కాటన్ ప్రతిపాదించింన పథకం పూర్తిగా పగటి కల అనడానికి లేదు.
ఆయన ఊరికే విషయాన్ని పై పైన చూసి ఏ వివరాలు లేకుండా ఆ పథకాన్ని ప్రతిపాదించలేదు. దేశం అంతా కలయదిరిగి, క్షుణ్ణంగా సర్వే చేసి, నదీ నదాలలో ప్రవాహాలు పరిశీలించి, చెరువుల విస్తృతి, వైశాల్యం అంచనా వేసి, నేల వాలు వెల కట్టి, అప్పుడే తన బృహత్ పథకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ముందు ఉంచాడు.
అయితే ఈ పథకం గురించి కొన్ని ప్రశ్నలు పుట్టే అవకాశం ఉంది.
బెంగాల్ నుండి పశ్చిమ తీరానికి, కన్యాకుమారి ద్వారా తీరం వెంట నడిచే కాలువల ద్వారా ప్రయాణించవలసిన అవసరం ఏముంది? సులభంగా సముద్రం మీదే ప్రయాణించవచ్చును కదా?
అలాగే లాహోర్ నుండి సూరత్ వరకు కాలువ తవ్వాల్సిన అవసరం ఏంటి? కొంత దూరం వరకు ఇండస్ మీదుగా ప్రయాణించి, అక్కణ్ణుంచి సముద్ర యానం చెయ్యవచ్చును కదా?
ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్య విషయం ఒకటి వుంది. ఇక్కడ మనం రెండు రకాల జలాలని చూస్తున్నాం. ఒకటి మంచి నీరు. నదులలో, చెరువులలో ఉండే ఉప్పు లేని నీరు. ఇది సాగుకి బాగా పనికొస్తుంది. అలాగే తాగడానికి, పారిశ్రామిక ప్రయోజనాలకి కూడా పనికొస్తుంది.
రెండవది ఉప్పునీరు, సముద్రపు నీరు. పై ప్రయోజనాలకి పనికిరాని నీరు.
పైన సర్ కాటన్ చెప్పిన పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు కొన్ని ఉన్నాయి –
• కరువులు, వరదలు రాకుండా నదీ జలాల ప్రవాహల మధ్య సమతూనిక సాధించడం
• ఏడాది పొడవునా సాగుకి, ఇతర ప్రయోజనాల కోసం అందాల్సిన నీరు అందేలా ఏర్పాటు చెయ్యడం
రవాణా ప్రయోజనాలు అదనంగా వచ్చిన లాభమే కాని అది ముఖ్య ప్రయోజనం కావాలన్న ఉద్దేశం లేదు. అది కాకుండా మత్య పరిశ్రమ, ముత్యాల పరిశ్రమ మొదలైన పరిశ్రమలని బలోపేతం చెయ్యడం కూడా ఒక లక్ష్యం.
రైల్వేల వల్ల కేవలం రవాణా ప్రయోజనాలు మాత్రమే నెరవేరుతాయి. ఈ విధమైన జలజాలం వల్ల ఇటు మంచి నీరు, అటు రవాణా ప్రయోజనాలు రెండూ నెరవేరుతాయి.
వివిధ ప్రాంతాల మధ్య ఎత్తులో వ్యత్యాసం ఉన్న పరిస్థితుల్లో ఆ రెండు ప్రాంతాలకి చెందిన జలాశయాలని కలిపే ప్రయత్నంలో జలబంధాలని (water locks) ఎలా వాడాలో కూడా కాటన్ వర్ణించాడు.
ఆ జల బంధాలని తగు రీతిలో నియంత్రిస్తూ వివిధ జలాశయాల మధ్య సమతూనిక ఎలా సాధించాలో విడమర్చి చెప్పాడు.
జల బంధాలు
మట్టంలో వ్యత్యాసం ఉన్న జలాశయాల మధ్య ప్రయాణించడానికి జలబంధాలు ఉపయోగపడతాయి. అలాంటి రెండు జలాశయాలు ఉన్నప్పుడు, పడవలో ఒక జలాశయం నుండి రెండవ జలాశయానికి ప్రయాణించవలసి ఉన్నప్పుడు, రెండు జలాశయాలకి సరిహద్దు ప్రాంతంలో రెండు నీటి ద్వారాలు (sluice gates) ఏర్పాటు చేస్తారు.
పడవ దిగువ ప్రాంతం నుండి ఎగువ ప్రాంతానికి వస్తోందని అనుకుందాం. పడవ సరిహద్దు ప్రాంతం లోకి ప్రవేశించగానే దాని వెనుక ఉన్న నీటి ద్వారాన్ని మూసేస్తారు. ఇప్పుడు ఎగువ ఉన్న జలాశయపు నీటిని దిగువన ఉన్న సరిహద్దు ప్రాంతం లోకి ప్రవహించనిస్తారు. సరిహద్దు ప్రాంతంలో నీటి మట్టం పెరుగుతుంది. దాంతో పాటు పడవ కూడా పైకి తేలుతుంది. సరిహద్దు ప్రాంతంలో ఉండే నీటి మట్టం ఎగువన ఉండే నీటి మట్టంతో సమానం అయినప్పుడు ఎగువన ఉండే నీటి ద్వారాన్ని ఎత్తేస్తారు. అప్పుడు పడవ ముందుకి సాగి ఎత్తున ఉన్న జలాశయం లోకి ప్రవేశిస్తుంది.
ఈ విధంగా నీటి ద్వారాలని ఎత్తుతూ, దించుతూ వివిధ మట్టాల వద్ద ఉండే జలాశయాల మధ్య పడవలలో ప్రయాణించడానికి వీలవుతుంది. యూరప్ లో ఎన్నో నదులలోను, ఈజిప్ట్ లో నైలు నది మీదను ఇలాంటి ఏర్పాట్లు వినియోగంలో ఉన్నాయి.
http://www.youtube.com/watch?v=s2Q-no03zdw
http://www.youtube.com/watch?v=InnehcZOLF4
(ఇంకా వుంది)
Interesting. The Timing of lock& un-lock need to be synchronised for each and every ferry/boat that may be a bit difficult.
Snkr
But that's exactly how it is done in many places. See this video on how it is done in Panama Canal.
http://www.youtube.com/watch?v=RfoTVvhiGzE
no need to go to places to see this system.There are number of locks still in working condition in Krishna western delta system,for ex near Duggirala, Kuchipudi etc.