శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

నిప్పుల మీద నడవడం సాధ్యమా?

Posted by V Srinivasa Chakravarthy Thursday, May 31, 2012

ఎన్నో సినిమాల్లో జనం నిప్పుల్లో నడిచేసేయడం చూపిస్తారు. డబ్బులు రావాలనో, జబ్బులు తగ్గాలనో, ‘జాబు’లు రావాలనో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇక కొందరైతే నిప్పుల మీద నడవడం గొప్ప మహిమాన్వితులకే తప్ప, నరాధములకి సాధ్యం కాదంటుంటారు.

మహిమల సంగతేమోగాని నిప్పుల మీద నడిచే ప్రక్రియ ఒక భౌతిక ధర్మం మీద ఆధారపడి జరుగుతుంది. ఇదే ప్రక్రియ మనకి వంటగదిలో కూడా ఒక సందర్భంలో కనిపిస్తుంది.

అట్టు వేసే ముందు ‘ఆంధ్ర ఆడబడుచులు’ పెనం తగినంతగా వేడెక్కిందో లేదో తెలుసుకోడానికి ఒక చిన్న ప్రయోగం చేస్తారు. పెనం మీద కాస్త నీరు చల్లి చూస్తారు. పెనం మీద పడ్డ నీరు ఊరికే ఆవిరైనంత మాత్రాన పెనం బాగా వేడెక్కినట్టు కాదు. ఆ బిందువులు పెనం మీద కాసేపు ‘చిందులు వేసినప్పుడె పెనము వేడెక్కెను సుమతీ!’


బాగా వేడెక్కిన పెనం మీద నీటి బొట్లు వెంటెనే ఆవిరి కావు, పైకి లేచి లేచి పడుతుంటాయి. గంతులు వేస్తాయి, నాట్యాలాడుతాయి.



ఈ నాట్యానికి ఆధారమైన భౌతిక ధర్మం పేరు లైడెన్ ఫ్రాస్ట్ ప్రభావం (Leidenfrost effect). క్లుప్తంగా ఈ ప్రభావం ఇలా పని చేస్తుంది.

పెనం నీటి మరుగు బిందువు (boiling point) కన్నా కాస్త ఎక్కువగా, 110 C వద్ద ఉందనుకుందాం. పెనం మీద పడ్డ బిందువు ముందు పెనం ఉపరితలం మీద పరుచుకుంటుంది. నెమ్మదిగా వేడెక్కి ఆవిరై మాయమైపోతుంది.



అలాకాక పెనం బాగా వేడెక్కి (200-300 C) వద్ద ఉందనుకోండి. బిందువు అడుగు భాగం పెనాన్ని తాకగానే ఆ అడుగుభాగం మాత్రం ఆవిరవుతుంది. ఆవిరి ఉష్ణోగ్రత బాగా ఎక్కువగా ఉండడం వల్ల అది వ్యాకోచిస్తుంది. వ్యాకోచించిన ఆవిరి పైనున్న నీటి బొట్టుని పైకి తంతుంది. బొట్టు ఎగిరి పడుతుంది. అలా ఎగిరిన బొట్టు మళ్లీ కింద పడుతుంది. పెనం మళ్ళీ తంతుంది. పెనం వేడికి నీటి బొట్ల బృంద నాట్యం అలా సాగుతుంది.


ఈ లైడెన్ ఫ్రాస్ట్ ప్రభావం ఆధారంగా మరి కొన్ని సాహసోపేతమైన ప్రదర్శనలు కూడా చేస్తారు.

1) ద్రవ రూపంలో ఉన్న నైట్రోజెన్ ని గుక్కెడు నోట్లోకి తీసుకుని వెంటనే బయటకి ఉమ్మేయడం.

2) కరిగిన సీసం లోకి వేగంగా (తడిసిన) చేయి ముంచి తీసేయడం,

వంటివి వాస్తవంలో ఎంతో మంది చేసి, ఈ ప్రభావం “మహిమ” ఏంటో నిరూపించారు.



నిప్పుల మీద నడిచేటప్పుడు కూడా ఈ ప్రభావం పాత్ర కొంత వరకు ఉందని తెలిసింది. పాదాల మీద సహజంగా చెమట వల్ల గాని, నీటి తడి గాని ఉండడం వల్ల నిప్పు మీద నడిచినప్పుడు, పాదానికి నిప్పు కణికకి మధ్య సన్నని ఆవిరి పొర ఏర్పడి పాదానికి రక్షణగా ఏర్పడుతుంది. అయితే ఆ పొర కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఏర్పడుతుంది. పరిస్థితులలో కాస్త తేడా వచ్చినా కాళ్లు కాలడం ఖాయం.



ఈ ప్రభావం మీద ఓ చక్కని వ్యాసం ఇక్కడ ఉంది.

http://www.wiley.com/college/phy/halliday320005/pdf/leidenfrost_essay.pdf

దీని రచయిత జెర్ల్ వాకర్ అని ఓ పేరుమోసిన ఫిజిక్స్ ప్రొఫెసర్. ఇందులో ఈ ప్రభావం గురించి, దాని చరిత్ర గురించి చాలా విపులంగా, లోతుగా అత్యంత ఆసక్తికరంగా, హాస్యంగా చర్చిస్తాడు.

బ్లాగర్లు సయ్యంటే జెర్ల్ వాకర్ వ్యాసం నుండి ముఖ్యాంశాలు రెండు, మూడు పోస్ట్ లలో చర్చిస్తాను. ‘బోరు’మంటే మానుకుంటాను.

(ఇంకా వుంది?)



14 comments

  1. laddu Says:
  2. sye sye.

     
  3. Mauli Says:
  4. హ్మ్, మరి అగ్నిప్రవేశం కూడా సాధ్యమేనా! చెమట వల్ల కాని, నీటి తడి వల్ల కాని మంటలు ఆరిపోయి ఆ వ్యక్తి అగ్ని పునీత అవడం సాధ్యమా ?

    @అయితే ఆ పొర కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఏర్పడుతుంది

    అగ్ని ప్రవేశం చేసే వ్యక్తి నిరపరాధి అయితే ఈ పోరా ఆటోమాటిక్ గా ఏర్పడుతుంది అనుకోవచ్చా !

     
  5. Anonymous Says:
  6. Please continue it.

     
  7. Anonymous Says:
  8. అనుకోండి. అగ్నిపునీత అవడం సాధ్యమే, ఈజీ కూడా. ఓ మారు ప్రయత్నించి చూడండి. @ Mauli

     
  9. Mauli Says:
  10. శ్రీనివాస చక్రవర్తి గారు ,

    అజ్ఞాత గా నా వ్యాఖ్యకు సమాధానం ఇవ్వాల్సిన ఖర్మ ఏంటి అండి మీకు.

     
  11. Anonymous Says:
  12. నిజం, చక్రవర్తిగారికి అజ్ఞాతగా సమాధానం ఇచ్చే ఖర్మ లేదు. ఆ అజ్ఞాత చెప్పినట్టు ప్రయోగం చేసి తెలుసుకోండి. సక్సెస్ అయితే మీరు అగ్ని పునీత, లేదంటే అవి మూఢనమ్మకాలు అనేయొచ్చు. రెండువిధాలా గెలుపు మనదే.

     
  13. మౌళి గారు, అగ్నికి నీతులు తెలీవు. చెయ్యి పెడితే కాల్చుతుందంతే.
    అయినా మీరు పరిహాసానికి అడుగుతున్నారా, నిజంగానే అడుగుతున్నారా?
    (అజ్ఞాతగా రాసింది నేను మాత్రం కాదు!)

     
  14. Anonymous Says:
  15. అగ్నికి నీతులు తెలీవు. చెయ్యి పెడితే కాల్చుతుందంతే
    :)) good answer

     
  16. Mauli Says:
  17. సరదాకి అడగడానికి మీరు నాకు పరిచయస్తులు కాదు కదండీ. పరిహాసానికి కాదు, నిజం గానే అడిగాను. అగ్నిపునీతులు అన్న పదం వాడడానికి కారణం, మీరు 'మహిమాన్వితులు', 'మహిమ' అని విన్నట్లే, ఈ పదం కూడా వాడుకలో ఉంది. ఇప్పుడు చెపుతార..

    మీ బ్లాగు లో వచ్చే సమాధానాలకు మీరే బాధ్యులు.

     
  18. Anonymous Says:
  19. @ మీ బ్లాగు లో వచ్చే సమాధానాలకు మీరే బాధ్యులు.
    ఇపుడు తప్పుగా ఎవరేమన్నారని అలా డైరెక్ట్‌గా బెదిరిస్తున్నారేమిటండి? ఇది మీకు న్యాయమా? అగ్నిపునీత అవుతారో, పుడంగి అవుతారో విజ్ఞానశాస్త్రంలో రాసి లేదు. మరి, తెలుసుకోవాలనీ మరీ జిజ్ఞాస ఎక్కువగా వుంటే స్వయంగా ప్రయోగాత్మకంగా తెలుసుకోవడమే పిజిక్సుకు అంగీకారమైన ఓ శాస్త్రపద్ధతి. ఎవరో అదే సలహా చెప్పారు. ఇలా బెదిరించడం ఏమైనా బాగుందా? ఆలోచించుకుని, మీ అగ్ని ప్రయోగాలను మీ బ్లాగులో పోస్టండి. చక్రవర్తిగారు ప్రయోగశాలలో వున్నారు, తీరిక లేక నన్ను పురమాయించారు. నేను ప్రయోగ శాల సహాయకుడను.

     
  20. Anonymous Says:
  21. ఓ పిచ్చి పువ్వా అనోన్ గ కాకుండా కాస్త పేరు పెట్టుకుని రాయి. నీకో ఓ పేరు ఉండి ఏడుస్తుంది కదా.

    :kasi.

     
  22. Anonymous Says:
  23. :kasi - is it the name of your picci? Good name for today.

     
  24. Anonymous Says:
  25. @Mouli,
    Could you please tell us the procedure of becoming ""Agni Puneetha"", how much time one has to spend in the fire, and at what temperature the fire should be??

    "Film Boiling" is effective only in a range of temperatures above the boiling point of the water, and it lasts only for a few seconds. Fire will reach the skin after that "time".....Raj.

     
  26. chandu Says:
  27. "బ్లాగర్లు సయ్యంటే జెర్ల్......"
    నేను సయ్యండి. మీరు మొదలు పెట్టండి. ఈ వ్యాసం ఆసక్తిగా ఉంది.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts