ఈ వృత్తాంతం ఈ మధ్యనే ఈమెయిల్ లో ఎవరో పంపారు. చిన్న సైన్స్ హాస్యం...
అమెరికా దక్షిణభాగంలో జరిగిన కథ.
ఓ స్థానిక స్కూల్ టీచరు తనకి కాల్ వచ్చిన ప్రతీ సారి ఫోన్ రింగ్ కావడం లేదని వాళ్ళ ఫోన్ కంపెనీకి ఫిర్యాదు చేసింది. కొన్ని సార్లే రింగ్ అవుతుంది. ఇంకా విచిత్రం ఏంటంటే రింగ్ కావడానికి కొంచెం ముందుగా వాళ్ల కుక్క ఓ సారి ఎందుచేతనో మూలుగుతుంది.
విషయం ఏంటో తేల్చుకుందామని ఓ టెక్నీషియన్ ఈవిడ ఇంటికి వచ్చాడు – భవిష్యత్తు తెలుసుకునే మహిమ గల ఆ కుక్క దర్శనం చేసుకుందామని.
ఇంటి బయట ఉన్న టెలిఫోన్ స్తంభం ఎక్కి, టెస్ట్ సెట్ తగిలించి, ఆవిడ ఇంటికి డయల్ చేశాడు.
వెంటనే కాదుగాని కాస్త ఆలస్యంగా ఫోన్ రింగయ్యింది. ఆ రింగ్ కి ముందు కుక్క ఓ సారి పాపం కుయ్యో మంది.
స్తంభం దిగొచ్చిన టెక్నీషియన్ పరిశోధన మొదలెట్టాడు. ఆ పరిశోధనలో తేలిన విషయాలు –
1. కుక్కని టెలిఫోన్ వ్యవస్థకి చెందిన గ్రౌండ్ వైర్ కి ఓ స్టీలు గొలుసుతో కట్టేశారు.
2. గ్రౌండ్ కడ్డీకి కట్టిన తీగ ఊడి వచ్చేసింది.
3. కాల్ వచ్చిన ప్రతీ సారి కుక్కకి 90 వోల్ట్ ల షాక్ తగులుతుంది.
4. ఆ దెబ్బకి కుక్క బాధగా మూలుగుతుంది. మూలిగి మూలశంక తీర్చుకుంటుంది!
5. ‘మూత్ర మహిమ’ వల్ల గ్రౌండ్ కడ్డీకి, తీగకి మధ్య మళ్లీ కనెక్షన్ ఏర్పడుతుంది. ఫోన్ మోగుతుంది!
అదండీ సంగతి!-)
ఆశ్రమం కట్టలేదా కుక్క గారికి ?
హహహ.. కుక్కకు యజమానికన్నా ముందుగా కుక్కకు తత్వం తెలిసివచ్చిందన్న మాట! బాగుంది. :)
ఇలాంటిది ఒకటి Reader's Digestలో చదివినట్లు గుర్తండి.
ఒకాయన "commode ని flush చేసినప్పుడల్లా కంప్యూటర్ restart అవుతుంది" అని customer supportకి కాల్‌చేశాడట. ఆ customer supportవాళ్ళు పరిశోధించి తేల్చిందేమిటయ్యాంటే. ఈ commodeని flushచేయడానికి ఆ customer వాడుతున్నా motor వల్ల ఇంట్లో voltage low అయిపోయి, ఆ voltage కంప్యూటర్‌కి సరిపోక shutdown అవుతోందట. Flush handleని వదిలేయగానే motor పనిచేయడం ఆగిపోతుంది కాబట్టి, voltage మళ్ళీ మామూలుగా అయిపోయి BIOS settings పుణ్యమా అని restart అయిపోతోందట.
Story is Nice