
రచన - రసజ్ఞ
3. Morganian Genetics:
మెండెల్ తాను కనుక్కున్న సూత్రాలను మరికొన్ని మొక్కలలో, జంతువులలో చూపించగలిగితే జనాదరణ పొందవచ్చును అనుకున్నాడు. కాని తాను ఎంచుకున్న జీవాలలో ఆ సూత్రాలని చూపించలేకపోయిన విషయం ముందే చెప్పుకున్నాం. మరి మెండెల్ ఎందుకు చూపించలేకపోయాడు? అలా చూపించలేకపోవడానికి కారణాలు ఏమిటి? అసలు క్రొత్త లక్షణాలు ఎలా వస్తున్నాయి అనేవి తెలుసుకునే దిశగా Thomas Hunt Morgan (September 25, 1866 – December 4, 1945) అనే శాస్త్రవేత్త...

x-ray crystallography పద్ధతితో వైరస్ రూపురేఖలు తెలుసుకోవాలంటే ముందు వైరస్ ని స్ఫటికీకరించాలి (crystallize చెయ్యాలి). 1935 లో వెండెల్ మెరిడిత్ స్టాన్లీ అనే జీవరసాయన శాస్త్రవేత్త సరిగ్గా ఆ పని మీదే బయల్దేరాడు. టొబాకో మొసాయిక్ వైరస్ సోకిన పొగాకు ఆకుల్ని బాగా చూర్ణం చేసి అందులోంచి వైరస్ పదార్థాన్ని శుద్ధి చేసే పనిలో పడ్డాడు. ప్రోటీన్ వేర్పాటు పద్ధతులని వినియోగించి వైరస్ ని స్ఫటిక రూపంలో సాధించాడు. ఆ స్ఫటికని తిరిగి కరిగించి మొక్కలోకి...
అధ్యాయం 29
మామయ్యే నన్ను కాపాడాడు
నాకు మళ్లీ స్పృహ వచ్చేసరికి చీకట్లో నేల మీద పడుకుని వున్నాను. నా మీద కోట్లు, దుప్పట్లు కప్పబడి వున్నాయి. మామయ్య నన్నే కనిపెట్టుకుని వున్నాడు. నాకు ఎప్పుడు స్పృహ వస్తుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. నాలో మొదటి శ్వాస కదలగానే నా చెయ్యి చటుక్కున అందుకున్నాడు. నేను కళ్లు తెరవగానే ఆనందంతో కేక వేశాడు.
“హమ్మయ్య! బతికేవున్నాడు!”
“అవును మావయ్యా…” నీరసంగా అన్నాను, “బతికే వున్నాను.”
ఆ క్షణం ఆయన నా మీద చూపించిన కరుణ, ఆయన మాటల్లోని సానుభూతి, అంతవరకు నా పక్కనే వుండి నన్నే కనిపెట్టుకుని, ఓ తండ్రిలా...

డైఫ్రాక్షన్ పద్ధతిలో అతి సూక్ష్మమైన దూరాలని గుర్తించొచ్చని క్రిందటి సారి చూశాం. అయితే మనం కొలవదలచుకున్న దూరం (d), మనం వాడిన కిరణాల తరంగదైర్ఘ్యం (-lambda) ఒకే స్థాయిలో ఉంటేనే సరైన diffraction చిత్రాలు ఏర్పడతాయి. ఈ diffraction పద్ధతితో అణువుల పరిమాణాన్ని తెలుసుకోవాలంటే, ఆ అణువుల వ్యాసం ఉన్న స్థాయిలోనే వాడే కిరణాల తరంగదైర్ఘ్యం ఉండాలి. అణువుల వ్యాసం ముఖ్యంగా పరమాణువుల వ్యాసం 1 A (10^(-10) m) స్థాయిలో ఉంటుంది కనుక అంత చిన్న దూరాలని తెలుసుకోవడానికి...
ఈ సారి మళ్ళీ విన్నాను. ఈ సారి మళ్ళీ నా పేరు ఎవరో పలకడం స్పష్టంగా వినిపించింది.
అది మామయ్య గొంతికే! గైడు తో ఏదో అంటున్నాడు. Forlorad అనేది డేనిష్ పదం.
అప్పుడు అర్థమయ్యింది. నేను గోడ లోంచి మాట్లాడాలి. తీగలో కరెంటు ప్రవహించినట్టు గోడ ద్వారా శబ్దం ప్రసారం అవుతోంది.
ఇక ఆలస్యం చెయ్యడానికి లేదు. నా నేస్తాలు కాస్తంత దూరం జరిగారంటే ఇక ఆ మాటలు వినిపించవు. కనుక గోడ దగ్గరగా జరిగి వీలైనంత స్పష్టంగా పిలిచాను – “లీడెన్ బ్రాక్ మామయ్యా!”
కాసేపు ఆత్రుతగా ఎదురుచూశాను. శబ్దం యొక్క వేగం అంత ఎక్కువేమీ కాదు. గాలి సాంద్రత పెరిగినా శబ్ద వేగంలో...

ఆ విధంగా 19 వ శతాబ్దపు తొలి దశలలో వైరల్ వ్యాధుల పరిజ్ఞానం ఓ చిత్రమైన దశలో వుంది. వైరస్ లు అనేవి వున్నాయని తెలుసు, వాటి వల్ల వ్యాధులు కలుగుతాయని తెలుసు, ఆ వ్యాధులని ఎలా అరికట్టాలో కూడా కొంత వరకు తెలుసు. కాని అసలు వైరస్ లు ఎంత వుంటాయి, ఎలా వుంటాయి, ఎలా పని చేస్తాయి మొదలైన విషయాలు మాత్రం బొత్తిగా తెలీని పరిస్థితి నెలకొంది.
వైరస్ యొక్క పరిమాణం గురించి, రూపురేఖల గురించి, క్రియల గురించి తెలుసుకోడానికి ఓ కొత్త సాంకేతిక నైపుణ్యం ఎంతో ఉపయోగపడింది....

రచన - రసజ్ఞ
2.1.2.b. Iojap అనువంశికత (Iojap inheritance):
ప్లాస్టిడ్ అనువంశికతలో ముఖ్యంగా చెప్పుకోవలసినది ఈ Iojap అనువంశికత. మొక్కజొన్న మొక్కలో రెండు రకాల ఆకులుంటాయి. కేంద్రక క్రోమోజోములలో (no.7) Ij అనే జన్యువు (బహిర్గత లక్షణం) ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగు ప్రో ప్లాస్టిడ్ల (chloroplasts) వలన ఆకుపచ్చ రంగు ఆకులూ, ij అనే జన్యువు (అంతర్గత లక్షణం) ఉన్నప్పుడు రెండు రకాల ప్రో ప్లాస్టిడ్లు (chloroplasts, leucoplasts) ఆకుపచ్చ పైన తెల్లని చారలు...

మా చెల్లెలు స్వాతి రాసిన వ్యాసం ఇది. బయటి వారు ఈ బ్లాగ్ లో వ్యాసాలు రాసే ఒరవడి పెరుగుతోంది. ఇది ఇలాగే సాగితే జనవిజ్ఞానరంగంలో ఓ వెబ్ జైన్ ప్రారంభించాలని వుంది.
– శ్రీ.చ.
రచన: స్వాతి చీమకుర్తి
లూయిస్ పాశ్చర్ 27 డిసెంబర్ 1822 న ఫ్రాన్స్ లో జురా అనే ప్రాంతం లో జన్మించారు.
1849 వ సంవత్సవరం లో స్ట్రాస్బౌర్గ్ (Strasbourg) విశ్వవిద్యాలయం లో రసాయన శాస్త్ర ప్రొఫెసర్ అయ్యారు. అక్కడ ఆయన సేంద్రీయ సంయోగం (organic synthesis) ద్వారా స్ఫటిక...

బ్లాగర్లకి నూతన సంవత్సర శుభాకాంక్షలు!
రచన - రసజ్ఞ
2.1.1.b మాతృ నిర్ణయము (Mother determination):
ఇది శాశ్వతంగా ఉండే మాతృ ప్రభావం. Diver, Boycott & Garstang అనే శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాల (1925 - 1931) ద్వారా, Lymnaea peregra అనే మంచి నీటి నత్త (fresh water snail) లలో గుల్ల (shell) ఏర్పడేటప్పుడు, ఆ గుల్ల కుడి వైపుకు చుట్టుకుంటే వాటిని సవ్య (dextral) గుల్లలనీ, ఎడమ వైపుకి చుట్టుకుంటే అపసవ్య (synstral) గుల్లలనీ అంటారు. వీటిల్లో...
postlink