శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

భూగర్భంలో ప్రళయ భీకర తుఫాను

Posted by V Srinivasa Chakravarthy Sunday, October 27, 2013


ఆదివారం 23
ఇంతకీ మేం ఇప్పుడు ఎక్కడున్నాం? మా పడవ శరవేగంతో ఎటో దూసుకుపోతోంది.

రాత్రి భయంకరంగా ఉంది. తుఫాను తగ్గుముఖం పట్టే సూచనలేం కనిపించలేదు. తుఫాను హోరుకి చెవులు చిల్లులు పడుతున్నాయి. చెవుల నుండి రక్తం కారుతోంది. అలాంటి పరిస్థితుల్లో సంభాషణ అసంభవం.

అలుపు లేని మెరుపులు మరింత తీక్షణమైన తేజంతో చెలరేగిపోతున్నాయి. తెలుపు, నీలి రంగుల గజిబిజి కాంతి రేఖలతో నింగి, నీరు అలంకరించబడ్డాయి. ఆ కాంతి రేఖలు కింది నీటి మీద పడి, మళ్లీ పైకి తుళ్ళి, పైనున్న కరకు రాతి చూరుని తాకుతున్నాయి. ఆ ధాటికి పైనున్న ఎత్తైన రాతి చూరు నెత్తిన పడుతుందేమో నని భయంగా వుంది! కొని మెరుపు తీగలు అగ్నిగోళాల్లా రాశీకృతమై బాంబుల్లా పేలిపోతున్నాయి. ఆ శబ్ద, కాంతుల దారుణ దాడికి ఇంద్రియాల పటుత్వం సన్నగిల్లుతున్నట్టు అనిపిస్తోంది. శబ్దం మరీ ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు  చెవులు ఒక శబ్దానికి మరో శబ్దానికి మధ్య తేడా పోల్చుకోగల విచక్షణ కోల్పోతాయేమో! లోకంలో వున్న మందుపాతర అంతా ఒక్కసారిగా పేలినా ఇంత శబ్దం పుట్టదని అనిపించింది.

మేం ఎటుపోతున్నాం? మావయ్య పడవ లో బోర్లా పడుకుని వున్నాడు.

సోమవారం, ఆగస్టు 24
ఈ వాతావరణంలో మార్పు రాదా?
నేను, మావయ్య సొమ్మసిల్లిపోయి వున్నాం కాని, హన్స్ మాత్రం ఎప్పట్లాగే చెక్కుచెదర కుండా వున్నాడు.
దక్షిణ-తూర్పు దిశగా పడవ తరలిపోతోంది. ఏక్సెల్ దీవిని విడిచిపెట్టిన దగ్గర్నుండి రెండొందల కోసులు ప్రయాణించాం.

మధ్యాహ్నం కల్లా తుఫాను భీభత్సం ద్విగుణీకృతం అయ్యింది. పడవ మీద ఉన్న వస్తువులని గట్టిగా పట్టుకుని అందరం బోర్లా పడి వున్నాం. అలలు అల్లంత ఎత్తుకి లేచి పడుతున్నాయి.
మూడు రోజుల పాటు అలా మాట మంతి లేకుండా మ్రాన్పడి పడి వున్నాం. ఏవైనా అనాలని నోరు విప్పినా గొంత పెగలదు. పెగిలినా అవతలి వాడి చెవికి దగ్గరగా జరిగినా ఏమీ వినిపించదు.
మావయ్య నాకు దగ్గరగా జరిగి ఒక్క మాట మాత్రం అనగలిగాడు – “దారి తప్పినట్టున్నాం. నాకేం అర్థం కావడం లేదు.”
అందుకు బదులుగా నేనీ పదాలు రాశాను – “తెరచాప కిందకి దించుదాం.”
మావయ్య ఒప్పుకుంటున్నట్టుగా తలాడించాడు.
అలా ఊపిన తల కాస్త పైకెత్తాడో లేదో అల్లంత దూరం నుండి ఓ అగ్నిగోళం కెరటాల మీద దూసుకొస్తూ పిడుగులా మా పడవ మీద పడింది. ఆ దెబ్బకి  తెరచాపని కట్టిన గుంజ అల్లంత దూరంలో ఎగిరిపడింది.

ఒక్క క్షణం మాకు ఏవయ్యిందో అర్థం కాలేదు. భయంతో ముఖాలు పాలిపోయాయి.
తెలుపు నీలం రంగులు కలగలసిన ఆ అగ్నిగోళం పడవ లో నెమ్మదిగా అటు ఇటు దొర్లుతోంది. దాని చిత్రం ఏంటంటే అది దాని అక్షం మీద బ్రహ్మాండమైన వేగంతో పరిభ్రమిస్తోంది.

(ఇంకా వుంది)

2 comments

  1. Unknown Says:
  2. scien fiction movie chusinattugaa unsi mee post
    http://www.googlefacebook.info/

     
  3. idi Jules Verne rasina Journey to the Center of the Earth ane sci fi novel ki anuvaadam.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts