కెప్లర్
తరువాత
ఐసాక్
క్షుణ్ణంగా
అధ్యయం
చేసిన
పూర్వతరం
శాస్త్రవేత్త
గెలీలియో
గెలీలీ.
ఇటలీ
కి
చెందిన
గెలీలియోని
భౌతిక
శాస్త్ర
పితమహుడుగా
చెప్పుకుంటారు.
ఎందుకంటే
ఇతడు
ప్రయోగాత్మక
పద్ధతి
కి
పెద్ద
పీట
వేశాడు.
అంతవరకు
విజ్ఞాన
శాస్త్ర
చరిత్రలో
ఒక
విషయాన్ని
తర్కం
ద్వార,
వాదన,
చర్చల
ద్వార
తేల్చుకునే
వారు.
వాదన
సరైనదా
కాదా
అన్నదే
ప్రశ్న.
కాని
విజ్ఞానంలో
అన్నిటికన్నా
ముఖ్యమైనది
ప్రయోగం
ద్వారా
ప్రకృతి
చెప్పే
సాక్ష్యం.
గెలీలియో
చేసిన
ప్రయోగాలలో
మొట్టమొదటిది
అంతవరకు
భూమి
మీద
వింతలు
విశేషాలు
చూడడానికి
మాత్రమే
ఉపయోగించబడ్డ
దూరదర్శినిని
ఆకాశం
కేసి
గురి
పెట్టి
ఖగోళ
వస్తువులని
గమనించడం.
దూరదర్శినితో
ఖగోళాన్ని
పరిశీలిస్తున్న
గెలీలియో
దూరదర్శినితో
ఖగోళాన్ని,
అందులో
సంచరించే
వస్తువులని
చూడడం
మొదలెట్టిన
గెలీలియోకి
ఎన్నో
పూర్వపు
నమ్మకాలు
తప్పని
తెలిసింది.
ఉదాహరణకి
ఖగోళ
వస్తువులన్నీ
దైవ
సృష్టి
గనుక
అవన్నీ
పరిపూర్ణమైనవని,
అందుకే
పరిపూర్ణ
ఆకృతి
అయిన
గోళాకారంలో
ఉంటాయని
ఆరోజుల్లో భావించేవారు. కాని దూరదర్శినితో చందమామని చూసిన గెలీలియోకి అక్కడ కొండలు, మిట్టలు కనిపించాయి. అలాగే మచ్చలేని అగ్నిగోళం అని తలపోసే సూర్యుడి మీద మచ్చలు కనిపించాయి. చందమామ కి ఉన్నట్టే వీనస్ గ్రహానికి కూడా దశలు ఉంటాయని గుర్తించాడు. ఆ విషయాన్ని బయటికి చెప్తే మత ఛాందసుల నుండి తన ప్రాణానికే ప్రమాదం అని తెలిసిన గెలిలియో మార్మికంగా గుప్తభాషలో రాసుకున్నాడు. మిగతా తారల లాగానే సూర్యుడు కూడా ఒక తార అని గుర్తించాడు. అంతేకాక చీకటి ఆకాశంలో మనకి కనిపించే తారలలో పెక్కు తారలు కలిసి ఓ పెద్ద రాశిగా గుమి గూడి వున్నాయని ఊహించి, ఆ గుంపుకి Milky Way (పాలపుంత) అని పేరు పెట్టాడు. ఈ రకంగా ఎన్నో విప్లవాత్మక విషయాలని తెలుసుకుని ప్రపంచానికి చాటడం వల్ల గెలీలియో మతబోధనలకి విరుద్ధంగా వెళ్లాడు. మతానికి విరుద్ధంగా బోధిస్తూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నాడన్న నేరారోపణ మీద గెలీలియో మీద మతాధికారులు మరణ దండన విధించబోయారు. కాని ఆఖరు నిముషంలో ఆ గండం తప్పింది.
గెలీలియో
గీసిన
చందమామ
చిత్రాలు
గెలీలియో
కనుక్కున్న
సత్యాల
కన్నా
ఆ
సత్యాలని
కనుక్కోవడానికి
అతడు
అవలంబించిన
ప్రయోగాత్మక
పద్ధతి
ఐసాక్
ని
బాగా
ఆకట్టుకుంది.
ముఖ్యంగా
ప్రయోగం
చేసి
అనాదిగా
వస్తోన్న
అరిస్టాటిల్
భావాలని కూలదోసిన వైనం తలచుకుంటుంటే ఐసాక్ కి ఒళ్ళు గగుర్పొడిచేది. ఓ చిన్న ప్రయోగం చేసి అంత కాలంగా పాతుకుపోయిన భావాలని ఒక్కసారిగా ధ్వంసం చెయ్యడమే? వస్తువులు కింద పడే తీరు గురించి అరిస్టాటిల్ కొన్ని సూత్రాలు బోధించాడు. అయితే అవి శుద్ధ తప్పని అప్పుడు జనం గ్రహించలేకపోయారు, వాటిని గెలీలియో మట్టికరిపించిన దాకా ఆ నమ్మకాలే చలామణిలో వుండేవి. బరువైన వస్తువులు తేలికైన వస్తువుల కన్నా వేగంగా కిందపడతాయని అరిస్టాటి బోధించాడు. ఆ భావన తప్పని నిరూపించడానికి ఓ చక్కని ప్రయోగం చేశాడు.
ఇటలీలో
పీసా
నగరనికి
చెందిన
‘వాలు
సౌధం’
(Leaning Tower of Pisa) మీది కెక్కి ఓ పెద్ద గుండుని, ఓ చిన్న గుండుని ఒకసారి పడేశాడు. కింద నించుని చూస్తున్న జనం రెండు వస్తువులూ ఒకే సారి నేలని తాకడం చూసి ఆశ్చర్యపోయారు. అరిస్టాటిల్ ఇంతకాలం వాళ్లని ఎలా తప్పుదోవ పట్టించిందీ అర్థం చేసుకున్నారు. అయితే అరిస్టాటిల్ ఆ విధంగా పొరబడడానికి కచ్చితంగా ఓ కారణం వుంది. ఓ ఇనుప గుండుని, ఓ ఈకని ఒకే సారి కింద పడేస్తే గుండే ముందు పడుతుందని మనకి తెలుసు. అయితే అలా జరగడానికి కారణం గాలి నిరోధకత. భూమి గురుత్వ త్వరణం రెండు వస్తువుల మీద ఒకేలా వున్నా, గాలి నిరోధకత వేరుగా ఉండడం వల్ల గుండు ముందుగా పడుతుంది. గాలి నిరోధకతని తొలగిస్తే రెండు వస్తువులూ ఒకే సమయంలో కిందపడతాయి. దీన్ని నిర్ధారించుకోడానికి ఓ శూన్యమందిరంలో (గాలిని తొలగించి శూన్యాన్ని ఏర్పరచిన ఓ మందిరంలో) గుండుని, ఈకని పడేస్తే రెండూ ఒకేలా పడడం చూసి ఆశ్చర్యం కలుగుతుంది.
పీసా
నగరంలోని
వాలు
సౌధం
నుండీ
గెలీలియో
చేసిన
ప్రయోగం.
చలనానికి
సంబంధించి
ఆ
రోజుల్లో
చలామణిలో
వున్న
భావనలలో
మరో
ముఖ్య
భావనని
కూడా
గెలీలియో
సరిదిద్దాడు.
ఏ
వస్తువు
కైనా
నిశ్చల
స్థితి
సహజ
స్థితి
అని
అరిస్టాటిల్
బోధించాడు.
నిశ్చల
స్థితే
కాక,
సమవేగంతో
సరళ
రేఖలో
కదిలే
స్థితి
కూడా
వస్తువు
యొక్క
సహజ
స్థితే
నని
గెలీలియో
ప్రతిపాదించాడు.
ఎందుకంటే
ఏ
బాహ్యబలం
లేకుండా
ఈ
రెండు
స్థితుల
నుండి
వస్తువుని
మార్చలేము.
నిశ్చల
స్థితిలో
వున్న,
లేక
సమవేగంతో
సరళ
రేఖలో
కదులుతున్న
స్థితిలో
వున్న
వస్తువు
ఓ
బాహ్యబలం
ప్రయోగించబడినంత
వరకు
అదే
స్థితిలో
ఎప్పటికీ
వుంటుందన్న
భావనే
‘జడత్వం’
(inertia) అన్న భావనకి మూలం అయ్యింది. ఈ సూత్రం విశ్వజనీనంగా వర్తిస్తుంది. ఓ బల్ల మీద కదిలే బంతి దగ్గర్నుంది, సూర్యుడి చుట్టూ కదిలే గ్రహాల వరకు ఇదే సూత్రం వర్తిస్తుంది.
వస్తువుల
చలనం నుండి వస్తువుల లో వుండే పదార్థం మీదకు కూడా ఐసాక్ ధ్యాస మళ్లింది. అసలు పదార్థం అంటే ఏమిటి? పదార్థంలో ఏముంటుంది? ఒక వస్తువుని ఇంకా ఇంకా చిన్న అంశాలుగా బద్దలు కొడితే అలాంటి విభజన ప్రక్రియ ఎంతవరకు సాగుతుంది? ఈ ప్రశ్నలకి సంబంధించి ప్రాచీన గ్రీకులు చెప్పిన విషయాలు ఐసాక్ ని చాలా ప్రభావితం చేశాయి. క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దానికి చెందిన గ్రీకు తాత్వికుడు డెమాక్రిటస్ పదార్థంలో ఉండే అతి చిన్న అంశాలకి atoms (పరమాణువులు) అని పేరు పెట్టాడు. రూపంలో, పరిమాణంలో, బరువులో ఈ పరమాణువుల మధ్య తేడాలు ఉంటాయన్నాడు. విశ్వంలో ప్రతీ వస్తువు ఈ పరమాణువులతో కూర్చబడినదే నని బోధించాడు. ఈ భావన ఐసాక్ మనసుని ఆకట్టుకుంది. తదనంతర కాలంలో కాంతి కూడా ఒక కణరాశి అని న్యూటన్ ప్రతిపాదించినప్పుడు ఈ రకమైన ‘అణు చింతన’ అతణ్ణి ప్రభావితం చేసి వుండొచ్చు.
(ఇంకా వుంది)
postlink