శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

ఐసాక్ న్యూటన్ - బడి చదువులు ముగించి కళాశాలకి

Posted by శ్రీనివాస చక్రవర్తి Saturday, October 3, 2015నీడ గడియారం చేసినట్టే నీటి గడియారం కూడా నిర్మించాడు. విలియమ్ క్లార్క్ మరిది ఒకతను ఐసాక్  కి పెద్ద చెక్క తొట్టె చేసి ఇచ్చాడు.  తొట్టెలో పోసిన నీరు కింద వున్న రంధ్రం లోంచి స్రవిస్తూ ఉంటుంది.  తొట్టెలో నీటి మట్టం బట్టి సమయం ఎంత అయ్యిందో చెప్పొచ్చు. క్లార్క్ దంపతులు అప్పుడప్పుడు గడియారం చూసి సమయం తెలుసుకుంటూ ఉండేవారట.

రొజుల్లోనే నిజం బండికుడా తయారుచేశాడు. మనిషి కూర్చునేటంత స్థలం వున్న బండిలో కొక్కెని తిప్పుతుంటే బండి కదిలేది.  భౌతిక శాస్త్రం పరిశోధనలో ప్రయోగాలు చెయ్యడం ఒక ముఖ్య భాగం.   సరదాగా చేసినా సొంతంగా బొమ్మలు చేసుకునే  అనుభవం కారణంగా  ఐసాక్ కి సొంతంగా ప్రయోగాలు చేసుకునే కౌశలం అలవడింది.

రోజుల్లో ఇంగ్లండ్ కి చెందిన ఎంతో మంది పిల్లలాగానే ఐసాక్ న్యూటన్ కూడా బళ్లో ప్రాచీన గ్రీకు, లాటిన్ భాషలు చదువుకుని ఉండేవాడు. ఇవి కాక బైబిల పఠనం, కాస్త ఆంగ్ల వ్యాకరణం చదువులో భాగాలయ్యేవి.

ఐసాక్ చదువుకునే కింగ్స్ స్కూలు హెడ్ మాస్టరు పేరు హెన్రీ స్టోక్స్. ఎప్పుడూ ఏవో ప్రయోగాలు చేసుకుంటూ, యంత్రాలు నిర్మించుకుంటూ, దీర్ఘంగా ఆలోచించుకుంటూ చోట కూర్చునే ఐసాక్  అంటే అతడికి సదభిప్రాయం ఉండేది. కాని తీరా ఏడు పరీక్షల్లో ఐసాక్ కి వచ్చిన మార్కులు చుశాక అభిప్రాయం ఆవిరైపోయింది. గదికి పిలిచి అక్షింతలు వేశాడు. ఎనభై మంది వున్న క్లాసులో ఆఖరు నుండీ రెండో స్థానం వచ్చాడు ఐసాక్. అవమానానికి బాగా డీలా పడిపోయాడు.

జరిగిన అవమానం చాలనట్టు రోజు పొద్దున్నే క్లాసులోకి అడుగుపెడుతున్న ఐసాక్ కి పుండు మీద కారం చల్లినట్టయ్యింది.  తన కన్నా పై రాంకు వచ్చిన కుర్రాడు ఎక్కణ్ణుంచో మెరుపులా ఊడిపడి కడుపులో గుద్దాడు. తన్నిన బాధ కన్నా తన కన్నా పై రాంకు వచ్చిన వాడు తన్నాడన్న బాధకి ఐసాక్ విలవిలలాడాడు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవలసిందే! విషయం ఏంటో ముఖాముఖి తేల్చుకోవడానికి సాయంత్రం పక్కనే ఉన్న చర్చి వెనుక ఉన్న  ఖాళీప్రదేశానికి రమ్మన్నాడు. ఇద్దరూ హోరాహోరీగా కొట్టుకున్నారు. ప్రత్యర్థి ఐసాక్ కన్నా కాస్త పొడగరి. అయినా మనవాడు వెనకాడలేదు. రంగంలో దిగిందే తడవుగా అవతలి వాడి మీద (న్యూటన్ రెండవ గతి నియమాన్ని తలపించేలా!) గుద్దులు కురిపించాడు. ఐదునిముషాలు తిరిగేలోపు వాణ్ణి మట్టికరిపించాడు. మన వీరకిశోరం అక్కడితో ఆగలేదు. తనకి అన్యాయం చేసినవాణ్ణి పూర్తిగా మట్టి కరిపించడంతో ఆగక, కొత్త తరహాగా గోడలు కూడా కరిపించాలని బయల్దేరాడు. కింద పడ్డ కుర్రాణ్ణి లేపి, బరబర లక్కెళ్ళి  చర్చి గోడ మీద వాడి చెంప ఆన్చుతూ  ఈడ్చుకెళ్లాడు.  పాపం దెబ్బకి పిల్లవాడి చెంప చెక్కుకుపోయింది. నాటి నుండీ క్లాసులో ఐసాక్ హోదా  శాశ్వతంగా మారిపోయింది. అందరూ అతణ్ణి హీరోలా చూడడం మొదలెట్టారు. దొమ్మీల్లో నే కాక చదువులో కూడా క్లాసులో ముందు ఉండాలన్న ధృఢ సంకల్పంతో అప్పట్నుంచి క్లాసు పుస్తకాల మీద కూడా కాస్త శ్రద్ధ వహించి త్వరలోనే క్లాసులో మొదటి స్థానాన్ని సాధించాడు.
గ్రంథామ్ లో కింగ్స్ స్కూల్లో విధంగా రోజులు సాఫీగా గడచిపోయాయి. హెడ్ మాస్టరు హెన్రీ స్టోక్స్ ఐసాక్  ప్రతిభ గుర్తించాడు. ముఖ్యంగా గణితం, భౌతిక శాస్త్ర రంగాల్లో పిల్లవాడి సామర్థ్యం చూసిన  అతడు పై చదువులకి గొప్ప విశ్వవిద్యాలయాలకి వెళ్తే బావుంటుందన్న అభిప్రాయంలో ఉన్నాడు స్టోక్స్. కాని ఐసాక్ తల్లి ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. పోయిన తన భర్త విడిచిపెట్టిన భూములని చూసుకోడానికి ఆమెకి సహాయం కావాలి. కొడుకుని తిరిగి ఇంటికి పంపమని స్టోక్స్ కి కబురు పెట్టింది. వూల్స్ థార్ప్ కి తిరిగి వెళ్తే అక్కడ ఆవులు మేపుకోవడం తప్ప తను బావుకునేదేమీ వుండదని ఐసాక్ హెడ్ మాస్టరు వద్ద బావురు మన్నాడు. కాని హన్నా  మొండి పట్టు పట్టింది.  కొడుకుని గ్రంథామ్ నుండి తిరిగి వూల్స్ థార్ప్ కి తెప్పించి పొలం వ్యవహారాలలో పెట్టింది.

తల్లి మాట కాదనలేక ఐసాక్ పొలం వ్యవహారాలలోకి దిగాడు. అన్యమనస్కంగానే తన బాధ్యతలు నిర్వహించడానికి ప్రయత్నించాడు. ఇష్టం లేని పని చేయిస్తున్నందుకు ఒక పక్క తల్లి మీద కచ్చగా వుంది. ఎన్నో రకాలుగా కచ్చ తీర్చుకోడానికి ప్రయత్నించేవాడు. చెప్పిన పని వెంటనే చెయ్యడానికి ఒక్కొక్క సారి మొరాయించేవాడు. వీలు చిక్కితే చాలు పుస్తకం పట్టుకుని చల్లని చెట్టు నీడలో చతికిలబడి పుస్తకంలో మునిగిపోయేవాడు. లేదా చుట్టుపక్కల కట్టెలు కొట్టి బొమ్మలో, ప్రయోగాలో చేసుకునేవాడు. లేదా పడవలు తయారు చేసి నీట్లోకి వదిలి ఆనందించేవాడు. 

ఒకసారి అలాగే గొర్రెలని మేపడానికి వెళ్లినప్పుడు  పరధ్యానంగా ఏదో పన్లో మునిగిపోయాడు. గొర్రెలు పొరుగింటి రైతు పొలంలోకి దూరి అక్కడ మేయడం మొదలెట్టాయి. అది చూసి ఒళ్ళుమండిన రైతు ఐసాక్ తల్లి మీద పంచాయితీకి ఫిర్యాదు చేశాడు. కొడుకు చేసిన నిర్వాకానికి హన్నాకి నష్టపరిహారం చెల్లించక తప్పలేదు.

కొడుక్కి ఎలాగైనా బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో హన్నా ఆసామిని తోడుగా ఇచ్చి పంపించేది. పుత్రరత్నం  ఊహాలోకాల్లోకి పారిపోబోయినప్పుడల్లా జబ్బ పట్టుకుని వెనక్కు లాగమని ఆసామికి హెచ్చరించింది. కాని ఉపాయం కూడా పెద్దగా పని చెయ్యలేదు. పంటంతా బండికి ఎక్కించి గ్రంథామ్ కి వెళ్ళి మంచి ధరకి అమ్ముకు రమ్మని ఆసామిని తోడిచ్చి కొడుకుని పంపించేది. కాని తీరా గ్రంథమ్ కి వెళ్లాక ఐసాక్ నేరుగా తను అంతకు ముందు బస చేసిన క్లార్క్ దంపతుల ఇంటికి వెళ్లి, అక్కడ ఏదో పుస్తకం తీసి చదువులో మునిగిపోయేవాడు. అమ్మకం పూర్తయ్యాక సాయంత్రం ఆసామి వచ్చి ఐసాక్ ని పిలుచుకుని తిరిగి వూల్స్ థార్ప్  దారి పట్టేవాడు.

 అలా రెండేళ్ళు దుర్భరంగా గడిచాయి. గ్రంథామ్ కి వచ్చిపోతుండే ఐసాక్ ని  హెడ్ మాస్టర్ స్టోక్స్ మాత్రం కంట  కనిపెడుతూ ఉండేవాడు. అంత ప్రతిభ గల పిల్లవాడు ఇలా పశువులని కాచుకుంటూ కాలం వెళ్లబుచ్చడం అతడికి బాధ కలిగించింది. వూల్స్ థార్ప్ కి వెళ్ళి, ఐసాక్ తల్లి హన్నా ని కలుసుకుని, ఐసాక్ తరపున వకాలతా పుచ్చుకుని మాట్లాడాడు. ఐసాక్ సామన్యుడు కాడని, మంచి చదువు చెప్పిస్తే ఎంతో ఎత్తుకు వెళ్లగల సత్తా వున్నవాడని వివరించాడు. కాని స్వతహాగా మొండి స్వభావం గల హానా హెడ్ మాస్టరు మాట విన్లేదు. పైగా పొలాలు, పాలు, పశువులు, పిడకలుఇవి తప్ప మరోటి తెలీని పల్లెటూరి వనిత ఆమె. కొడుకు ఇవి కాక మరింకేవైనా చేస్తున్నాడంటే తన జీవితాన్ని పాడుచేసుకుంటున్నాడని ఆమె నమ్మకం. కనుక ఆమెకి అర్థమయ్యేలా ఎన్నో సార్లు చెప్పి చూశాడు స్టోక్స్. చివరికి మనసు మార్చుకుని ఐసాక్ కాలేజికి  వెళ్లడానికి ఒప్పుకుంది.


విధంగా ఐసాక్  పద్దెనిదవ ఏట తల్లి మనసు మార్చుకుని కుర్రవాడు  మళ్లీ చదువుకోడానికి అనుమతి ఇచ్చింది. మంచి విశ్వవిద్యాలయాలలో చదువుకోవాలంటే అందుకు కఠినమైన ప్రవేశ పరీక్షలు పాసు కావాలి. పరీక్షలకోసం సన్నాహంలో మునిగిపోయాడు ఐసాక్. హెడ్ మాస్టరు స్టోక్స్ దగ్గరుండి చదువుని పర్యవేక్షించాడు. పిల్లవాడు సరిగ్గా చదవక పోతే తనకి మాట వస్తుందని అతడికి తెలుసు. స్టోక్స్ నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా ఐసాక్ శ్రద్ధగా చదివాడు. కేంబ్రిడ్జ్ లోని ప్రఖ్యాత ట్రినిటీ కాలేజిలో చదువుకోవడానికి అవకాశం దొరికింది.

(ఇంకా వుంది)

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email