శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

చదువులలో మర్మమెల్ల చదివిన న్యూటన్

Posted by శ్రీనివాస చక్రవర్తి Sunday, October 18, 2015 2.    చదువులలో మర్మమెల్లవూల్స్ థార్ప్ నుండి కేంబ్రిడ్జ్ వంద కిలోమీటర్ల దూరం ఉంటుంది. గుర్రబ్బండిలో మూడు రోజుల ప్రయాణం. జూన్ 1661  లో ఐసాక్ కేంబ్రిడ్జ్ లోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలోకి అడుగుపెట్టాడు. పిడికెడు పొలాలు కూడా లేని వూల్స్ థార్ప్ గ్రామం నుండి 8000  జనాభా వున్న మహానగరంలోకి అడుగుపెట్టడం ఐసాక్ కి మొదట్లో సులభంగా మింగుడుపడలేదు. అంతవరకు ఇంటికి దూరంగా, అదీ ఇంత పెద్ద నగరంలో ఉండడం అలవాటు లేని ఐసాక్ కి కొత్త పరిస్థితులకి అలవాటు పడడానికి కొంత కాలం పట్టింది.


కేంబ్రిడ్జ్ లోని ట్రినిటీ కాలేజి (1690  నాటి చిత్రం)

కేంబ్రిడ్జ్ లో ఐసాక్ జీవితం దుర్భరం కావడానికి మరో కారణం కూడా వుంది. పిల్లవాడు విశ్వవిద్యాలయంలో సిజార్ (sizar)  గా ఉంటూ చదువుకోవాలని తల్లి షరతు పెట్టింది. సిజార్ అంటే ఒక రకంగా వారాలు చేసి చదువుకోవడం లాంటిది. చిన్న చితక పనులు చేసుకుంటూ అలాంటి విద్యార్థులు బోధనకి కావలసిన ఫీజు సొమ్ము సంపాదించుకుంటారు. భోజన శాలలో వడ్డన దగ్గర్నుండి, హాస్టల్లో సీనియర్ విద్యార్థులకి సుప్రభాతం పాడి లేపడం వరకు ఉండేవి సిజార్ల బాధ్యతలు. పనులన్నీ చెయ్యడం సున్నిత స్వభావుడైన ఐసాక్ కి తలవంపులుగా ఉండేది. తల్లికి ఫీజు కట్టగల స్తోమత లేకపోలేదు. కాని పిల్లవాడిగర్వం తగ్గాలని రకమైన అనుభవానికి గురిచేసిందా తల్లి!

కాలేజిలో ప్రవేశించిన ప్రతీ విద్యార్థికి గురువుని అప్పజెప్పుతారు. గురువే తల్లి, తండ్రి అన్నట్టుగా పిల్లవాడు మసలుకోవాలి.  ఐసాక్ కి విధంగా బెంజమిన్ పులీన్ అనే వ్యక్తి గురువుగా నియామకం అయ్యాడు.  గ్రీకు పండితుడైన వ్యక్తి గురించి పెద్దగా సమాచారం లేదు.

క్లాసులకి వెళ్ళడం, నోట్సు తీసుకోవడం, పుస్తకాలు చదువుకోవడం మొదలైన పనులతో ఐసాక్ జీవితం తీరిక లేకుండా సాగిపోతోంది. ప్రతీ విద్యార్థి ముఖ్యమైన నోట్సు పుస్తకంలో తాము నేర్చుకున్నది రాసుకుంటూ ఉండాలి. సీనియర్ పిల్లలు పుస్తకాన్ని తత్వాల పుస్తకం (philosophical notebook)  అని పిలిచేవారు. ఐసాక్ కి కూడా అలాంటి పుస్తకం ఒకటి వుంది.

నోట్సు లో మొదటి కొద్ది పేజీల్లో అరిస్టాటిల్ బోధన గురించి వుంది. ఐసాక్ తన స్వహస్తాలతో, చక్కని దస్తూరీతో అరిస్టాటిల్ నేర్పిన భావాల గురించి అందులో రాసుకున్నాడు. మరి పాశ్చాత్య వైజ్ఞానిక సాంప్రదాయంలో అరిస్టాటిల్ ఆద్యుడు, ఆరాధ్యుడు. కుర్రాడైన ఐసాక్ కి సంగతి తెలియకపోలేదు.   కారణం ఏంటో గాని తర్వాత కొన్ని పేజీలు ఖాళీగా ఉండిపోయాయి.  మళ్లీ 1663  లో అంటే ఐసాక్ తన మూడవ సంవత్సరంలో ప్రవేశించిన తరువాత కొత్త సంగతులు పుస్తకంలో చోటు చేసుకున్నాయి. కాని సారి రాసుకున్నది అరిస్టాటిల్ భావాల గురించో మరొకరి భావాల గురించో కాదు. ఇవి తన సొంత భావాలు! తన వినూత్న భావాల గురించి, తన పరిశోధనల ఫలితాల సారాంశం గురించి రాసుకునే ముందు  విధంగా రాసుకున్నాడు ఐసాక్ – “నేను ప్లేటో కి స్నేహితుణ్ణి, అరిస్టాటిల్ కి కూడా స్నేహితుణ్ణే, కాని అందరికన్నా ఎక్కువగా సత్యమే నా నేస్తం.”

కొన్ని తాత్విక ప్రశ్నలుఅన్న శీర్షికతో ఎన్నో విషయాల గురించి పుంఖానుపుంఖాలుగా రాసుకుంటూ పోయాడు. “గాలి,” “నేల,” “నిద్ర”, “కాలం” – ఇలా ఎన్నో ప్రగాఢమైన విషయాల గురించిన చర్చ పుస్తకంలో చోటు చేసుకుంది. అన్యుల దగ్గర్నుండి విన్నవి, సొంతంగా ఆలోచించి తెలుసుకున్నవిఇలా ఎన్నో విషయాలు పుస్తకంలో కెక్కాయి. ఐసాక్ లో అరిస్టాటిల్ భావాలనే ప్రశ్నించేటంత తెగువ పుట్టడానికి కారణం కొంతవరకు అతడు రోజుల్లో చదివిన కొందరు వైజ్ఞానిక విప్లవవీరుల రచనలే.

అలాంటి విప్లవకారులలో ప్రథముడు నికొలాస్ కోపర్నికస్ (1473–1543). పోలండ్ కి చెందిన ఖగోళ శాస్త్రవేత్త 1543  లో భూమి చుట్టూ లోకమంతా పరిభ్రమిస్తుంది అన్న అరిస్టాటిల్ భావాలని వ్యతిరేకించాడు.  భూమితో పాటు తక్కిన గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని ప్రతిపాదించిన కోపర్నికస్ రెండు వేల ఏళ్లుగా చలామణిలో వున్న అరిస్టాటిల్ సిద్ధాంతాలని నిలదీశాడు.నికొలాస్ కోపర్నికస్

కోపర్నికస్ సైద్ధాంతికంగా చెప్పిన దానికి తగిన గణితపరమైన సమర్ధన నిచ్చినవాడు యోహానెస్ కెప్లర్ (1571–1630). జర్మనీ కి చెందిన ఖగోళ శాస్త్రవేత్త గతంలో ఖగోళ వేత్తలు వర్ణించిన గ్రహ గతులకి చెందిన సమాచారాన్నంతటినీ మూడు నియమాల లోకి కుదించాడు. వాటినే కెప్లర్ నియమాలు అంటారు. కెప్లర్ మొదటి నియమం ప్రకారం గ్రహాలు సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతాయి. సూర్యుడు దీర్ఘవృత్తానికి కేంద్రంలో కాక దానినాభివద్ద, అంటే కేంద్రానికి కాస్త పక్కగా ఉంటాడు. కనుక సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహం కొంత కాలం సూర్యుడికి దగ్గరిగాను, మరి కొంత కాలం సూర్యుడికి దూరంగాను కదులుతుంటుంది.  విధంగా గ్రహగతులు వృత్తాలు అనే ప్రాచీన భావనని కెప్లర్ మట్టికరిపించాడు.యోహానెస్ కెప్లర్

కెప్లర్ యొక్క రెండవ నియమం గ్రహం యొక్క వేగానికి సంబంధించినది. గ్రహం సూర్యుడికి దగ్గరిగా వచ్చినప్పుడు దాని వేగం పెరుగుతుంది. అలాగే దూరంగా జరిగినప్పుడు వేగం తక్కువవుతుంది. సూర్యుడి నుండి గ్రహం యొక్క దూరానికి, స్థితిలో గ్రహం యొక్క వేగానికి మధ్య సంబంధాన్ని తెలుపుతుంది కెప్లర్ రెండవ నియమం.

ఇక కెప్లర్ మూడవ నియమం సూర్యుడి నుండి ఒక గ్రహం యొక్క సగటు దూరానికి, సూర్యుడి చుట్టూ గ్రహం యొక్క పరిభ్రమణ కాలానికి మధ్య సంబంధాన్ని తెలుపుతుంది.అపారమైన ఖగోళ పరిశీలనలని అంత అందంగా మూడు నియమాలని కుదించిన కెప్లర్ మేధస్సుని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు ఐసాక్. కెప్లర్ సాధించిన విజయంలో అతడికి గణితం యొక్క సత్తా ఏంటో స్పష్టంగా కనిపించింది. మరింత అధునాతన గణితాన్ని ఉపయోగించి మూడు నియమాలని కూడా మరింతగా కుదించడానికి వీలవుతుందా? ఇలాంటి ప్రశ్నలు ఐసాక్ మనసులో తారాడసాగాయి.

(ఇంకా వుంది)

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Total Pageviews

There was an error in this gadget
There was an error in this gadget

విజ్ఞానులు

GuestBooker 2.5

Recent Posts

Popular Posts

Follow by Email