అయితే
కాల్కులస్
ని
ఇంచుమించు
న్యూటన్
కాలంలోనే
స్వతంత్రంగా
రూపొందించిన
మరో
గణితవేత్త
వున్నాడు.
ఇతడు
జర్మనీకి
చెందిన గాట్ ఫ్రీడ్ విల్హెల్మ్ లీబ్నిజ్. న్యూటన్, లీబ్నిజ్ లలో కాల్కులస్ ని ముందు ఎవరు కనిపెట్టారు అన్న విషయంలో ఎంతో వివాదం వుంది. అయితే ఆ వివాదాలు చారిత్రకులకి ఆసక్తికరంగా ఉంటాయి. అవి మనకి ప్రస్తుతం అప్రస్తుతం.
ఈ
కొత్త
గణిత
ఉపకరణంతో
చలన
రాశులని
మరింత
సమర్ధవంతంగా
వర్ణించడానికి
వీలయ్యింది.
అంతవరకు
కొరకరాని
కొయ్యలుగా
మిగిలిన
ఎన్నో
సమస్యల
పరిష్కారం
సాధ్యమయ్యింది.
పట్టున
ఇరవై
నాలుగు
ఏళ్లు
కూడా
నిండని
న్యూటన్
స్వల్పకాలంలో
ప్రపంచ
విఖ్యాత
గణితవేత్త
స్థాయికి
ఎదిగాడు.
క్యాల్కులస్
వల్ల
సాధ్యమైన
ఓ
ముఖ్యమైన
సమస్య
గ్రహ
చలనాలకి
సంబంధించిన
సమస్య.
గ్రహ
చలనాలని
వర్ణించే
మూడు
ప్రాథమిక
సూత్రాలని
అంతకు
ముందే
కెప్లర్
వర్ణించాడు.
అయితే
అసలు
గ్రహాలు
సూర్యుడి
చుట్టూ
ఎందుకు
తిరుగుతున్నాయి?
ప్రత్యేకించి
అలాంటి
కక్ష్యలలో
ఎందుకు
తిరుగుతున్నాయి?
అన్న విషయంలో ఎవరికీ పెద్దగా అవగాహన ఉండేది కాదు.
అసలు
గ్రహాలు
సూర్యుడి
చుట్టూ
ఎందుకు
తిరుగుతాయి?
గ్రహాలు
వస్తువులు
కనుక,
వాటికి
జడత్వం
ఉంటుంది
కనుక
అంతరిక్షంలో
వాటి
మీద
ఏ
బలమూ పని చెయ్యనట్టు అయితే అవి సమవేగంతో సరళ రేఖలో ప్రయాణిస్తూ అంతరిక్షంలో కొట్టుకుపోవాలి. కాని అవి ఒక వస్తువు చుట్టూ ప్రదక్షణ చేస్తున్నాయి కనుక వాటి మీద ఏదో బలం పని చేస్తూ వుండి వుండాలి. ఒక వస్తువు వృత్తాకారంలో సమమైన కోణీయ వేగంతో కదులుతున్నప్పుడు ఆ వస్తువు మీద ఆ వృత్తం యొక్క కేంద్రం నుండి ఓ బలం పని చేస్తూ ఉండాలని న్యూటన్ తన క్యాల్కులస్ విధానాలని ఉపయోగించి నిరూపించాడు.
ఈ
సత్యాన్ని
అర్థం
చేసుకోడానికి
ఓ
చిన్న
ప్రయోగం
చెయ్యొచ్చు.
ఓ
రాయికి
దారం
కట్టి
దాన్ని
గిరగిరా
తిప్పండి.
రాయి
మీ
చెయ్యి
చుట్టూ
వృత్తాకారంలో
ప్రదక్షిణ
చేస్తుంది.
రాయి
మీద
మీ
చేతిలో
వున్న
దారం
బలం
ప్రయోగిస్తోంది.
దారం
బిగుతుగా
వుంటుంది
కనుక
దారం
ఆ
రాయిని
మీ
చేతి
వైపునకు
అంటే
కేంద్రం
దిశగా
లాగుతోంది
అన్నమాట.
అంటే
రాయి
యొక్క
గమన
దిశకి
లంబంగా
దాని
మీద
పని
చేసే
బలం
వుంది.
ఇప్పుడు ఉన్నట్లుండి మీరు దారాన్ని వదిలేసినట్టయితే సరిగ్గా ఆ క్షణం రాయి ఏ దిశలో కదులుతోందో ఆ దిశలో ముందుకు ప్రయాణిస్తూ కింద పడుతుంది.
ఆ
విధంగా
గ్రహాల
మీద
సూర్యుడు
తన
వైపునకి
ఆకర్షిస్తున్నట్టుగా
బలం
ప్రయోగిస్తున్నాడు
అని
అర్థం
చేసుకోవచ్చు.
ఈ
రకమైన
ఆకర్షణకే
న్యూటన్
గురుత్వం
(gravity) అని పేరు పెట్టాడు.
న్యూటన్
కి
గురుత్వం
అనే
శక్తి
ఉంటుందన్న
ఆలోచన
ఎలా
వచ్చింది
అన్న
ప్రశ్న
వెనుక
మనకందరికీ
తెలిసిన
ఓ
కథ
వుంది.
ఆ
కథ
గురించి
ప్రత్యక్షంగా
న్యూటన్
నోటి
నుండి
విన్న
అతడి
స్నేహితుడు
విలియమ్
స్టుక్లీ ఏమంటున్నాడో విందాం. 1726 లో అంటే న్యూటన్ మరణానికి ఓ ఏడాది ముందు ఈ స్టుక్లీ అప్పటికి కెన్సింగ్టన్ అనే ఊళ్లో ఉంటున్న న్యూటన్ ని సందర్శించాడు. మిత్రులు ఇద్దరూ భోజనం చేసి టీ తాగడానికి తోట లోకి వెళ్లి ఓ ఆపిల్ చెట్టు కింద కూర్చున్నారు. ఆ సమాగమం గురించి స్టుక్లీ ఇలా అంటున్నాడు – “ఇద్దరం కాసేపు పిచ్చాపాటీ మాట్లాడుకున్నాం. అప్పుడు న్యూటన్ ఏవో పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అన్నాడు. చాలా కాలం క్రితం సరిగ్గా ఇలాంటి పరిసరాలలోనే తనకి గురుత్వం అనే భావన స్ఫురించింది అన్నాడు. ఓ చెట్టు నీడలో నిశ్చలంగా దేని గురించో ధ్యానిస్తున్నప్పుడు కింద పడుతున్న ఓ ఆపిల్ కనిపించగా ఆ ఆలోచన వచ్చింది అన్నాడు.”
కింద
పడుతున్న
ఆపిల్
ని
చూస్తున్నప్పుడు
న్యూటన్
మనసులో
స్ఫురించిన
గురుత్వ
సిద్ధాంతం
పూర్వులైన
దే
కార్త్,
గెలీలియో
తదితరులు
వర్ణించిన
‘జడత్వం’
అన్న
భావన
న్యూటన్
కి
బాగా
తెలుసు.
ఏదో
బలం
పని
చేస్తే
తప్ప
నిశ్చలంగా
ఉన్న
వస్తువు
కదలదని
తెలుసు.
కనుక
వదిలేసిన
వస్తువు
కింద
పడడానికి
కారణం
ఏదో
బలం
అయ్యుండాలి.
అది
కంటికి
కనిపించకపోవచ్చు.
కాని
అలాంటి
బలం
లేకపోతే
వస్తువు
కింద
పడదు.
ఆ
బలం
భూమి నుండి పుడుతూ ఉండొచ్చు. భూమి ఆపిల్ ని ఆకర్షించడం వల్ల ఆపిల్ ‘కింద’ పడుతోందేమో.
జడత్వనికి
మరో
ముఖం
కూడా
వుంది.
సరళ
రేఖలో
సమవేగంతో
కదులుతున్న
వస్తువు
మీద
ఓ
బలం
పని
చేస్తే
తప్ప
ఆ
వస్తువు
యొక్క
గమన
దిశ
మారదు.
కావాలంటే
నేలకి
సమాంతరంగా
ఓ
రాయి
విసిర్తే
అది
ముందు
సమాంతరంగా
కదిలినా
క్రమంగా
ఆ
దిశ
నుండి
విచలనం
చెందుతూ
నేల
దిశగా
తిరిగి
కొంత
దూరంలో
నేల
మీద
పడుతుంది.
ఆ
రాయికి
ఓ
ఎత్తయిన
కొండ
మీద
నుంచి
విసిరినా
అదే
జరుగుతుంది.
రాయి
విసిరిన
వేగం
తక్కువగా
ఉంటే
విసిరిన
చోటికి
దగ్గర్లోనే
కింద
పడుతుంది.
వేగంగా
విసిరితే
దూరంగా
పడుతుంది.
కాని
కిండ
పడడం
మాత్రం
ఖాయం.
అప్పుడు
న్యూటన్
ఓ
కొత్త
ప్రశ్న
తట్టింది.
మరి
చందమానని
కూడా
ఓ
పెద్ద
రాయిగా
ఊహించుకుంటే?
చందమామ
ఆకాశంలోనే
ఎందుకు
ఉంటుంది?
భూమి
చుట్టూ
తిరుగుతుంటుంది
గాని
ఎందుకు కింద పడదు?
(ఇంకా వుంది)
0 comments