శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

కింద పడడం అంటే ఏమిటి? - న్యూటన్ వివరణ

Posted by శ్రీనివాస చక్రవర్తి Saturday, February 20, 2016
చందమామ  భూమి చుట్టూ తిరుగుతుందన్న విషయం చాలా కాలంగా తెలుసు. గ్రహాలు సూర్యుడు చుట్టూ తిరుతాయా లేదా అన్న విషయంలో వుండే వివాదం, చందమామ భూమి చుట్టూ తిరిగే విషయంలో లేదు. చందమామ మీద భూమి నిశ్చయంగా గురుత్వ బలాన్ని ప్రయోగిస్తోంది. అందుకనే అది భూమి చుట్టూ తిరుగుతోంది. లేకుంటే అది సరళరేఖలో ప్రయాణిస్తూ అంతరిక్షంలో ఎటో కొట్టుకుపోయేది. మరి విసిరిన రాయి కింద పడుతున్నప్పుడు, చందమామ ఎందుకు కింద పడదు?

అప్పుడు న్యూటన్ కి ఒక సమాధానం స్ఫురించింది. బహుశ గురుత్వాకర్షణ దూరం మీద ఆధారపడుతుందేమో. వస్తువుల మధ్య దూరం ఎక్కువైతే గురుత్వం తక్కువగా ఉంటుందేమో. చందమామ కన్నా రాయి భూమికి దగ్గరగా ఉంది కనుక దాని మీద ఆకర్షణ ఎక్కువ కావడం వల్ల, అది కింద పడుతోంది. చందమామ దూరం కావడం వల్ల కింద పడకపోయినా భూమి చుట్టు తిరుగుతోంది.

ఇలా ఆలోచిస్తున్న న్యూటన్ భావాలు క్రమంగా స్పష్టం కాసాగాయి. ఎలాంటి పరిస్థితుల్లో వస్తువు కింద, అంటే భూమి మీద, పడుతుంది? ఎలాంటి పరిస్థితుల్లో అది భూమి చుట్టూ కింద పడకుండా తిరుగుతూ ఉంటుంది? ప్రశ్నలకి సమాధానంగా న్యూటన్ ఊహించిన వర్ణన గమనార్హం. భౌతిక విషయాల మీద అతడికి ఉండే సహజమైన లోదృష్టికి, గ్రహింపుకి ఇది చక్కని తార్కాణం.

భూమి మీద  ఎత్తయిన కొండ మీద నించున్నట్టు ఊహించుకున్నాడు న్యూటన్ (కింద చిత్రం). అక్కణ్ణుంచి క్రమంగా పెరిగే వేగాల వద్ద రాళ్లని నేలకి సమాంతరంగా విసురుతున్నాడు. వేగం తక్కువగా వున్న రాళ్ళు కొండకి దగ్గరిగా నేల మీద పడతాయి. వేగం పెరుగుతున్న కొద్ది కొండకి ఇంకా ఇంకా దూరంగా పడతాయి. భూమి చదునుగా ఉన్నట్లయితే రాయి వేగం పెరుగుతున్న కొలది విసిరిన చోటి నుండి ఇంకా ఇంకా దూరంగా రాయి పడుతుంది.

అయితే వైఖరి ఇలాగే కొనసాగుతూ పోదు. ఎందుకంటే భూమి గుండ్రంగా వుంది. కనుక  అలా రాయి విసిరే వేగన్ని పెంచుతూ పోతే  కింద పడుతున్న రాయి  భూమి వంపు వెంటకిందపడుతుంది కనుక, ఒక దశలో భూమి వంపునే అనుసరిస్తూ కదులుతుంది కాని పూర్తిగాకిందపడదు. అలాంటి స్థితిలో ఇక రాయి ఎప్పటికీ భూమి చుట్టూనే తిరుగుతూ ఉంటుందిచందమామలా!


చందమామ భూమి చుట్టూ ఎందుకు తిరుగుతుంది అన్న ప్రశ్నకి న్యూటన్ ఊహించిన వివరణ

చందమామ గమనాన్ని విధంగా అర్థం చేసుకున్న తరువాత న్యూటన్ ధ్యాస ఇతర గ్రహాల చలనాల మీదకి మళ్లింది. చందమామ భూమి చుట్టూ తిరుగుతున్నట్టే సౌరమండలంలోని గ్రహాలన్నీ  సూర్యుడి చుట్టూ సూర్యుడి గురుత్వాకర్షణకి లోనై తిరుగుతుంటాయి.

ఇప్పుడు కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు జనిస్తాయి. మరి గ్రహాల మధ్య కూడా పరస్పర ఆకర్షణ ఉండాలి కదా? కాని అవి ఒక దాని చుట్టూ ఒకటి తిరగకుండా సూర్యుడి చుట్టూ ఎందుకు తిరుగుతాయి? అలాగే చందమామ మీద సూర్యుడి గురుత్వం కూడా పని చేస్తూ ఉండాలి కదా? మరి చందమామ సూర్యుడి చుట్టూ కాక భూమి చుట్టూ ఎందుకు తిరుగుతుంది? ఇలా ఆలోచిస్తున్న న్యూటన్ కి రెండు విషయాలు అర్థమయ్యాయి.

సూర్యుడుకి గ్రహాలకి మధ్య గురుత్వాకర్షణ వుంటుందని అంతకు ముందే న్యూటన అర్థం చేసుకున్నాడు. మరి చందమామ భూమి చుట్టూ తిరిగే తీరుని గమనిస్తే, భూమి చందమామ మీద చూపించే ఆకర్షణ కూడా గురుత్వాకర్షణే నని అనుకోవలసి వుంటుంది. అలా ఆలోచిస్తూ పోతే  విశ్వంలో వస్తువులన్నిటి మధ్య గురుత్వాకర్షణ వుంటుంది అని అనుకోవాలి.

మరయితే చందమామ భూమి చుట్టూనే ఎందుకు పరిభ్రమిస్తుంది? సూర్యుడి చుట్టూ ఎందుకు పరిభ్రమించదు? అన్న ప్రశ్నకి సమాధానంగా న్యూటన్ కి ఇలాంటి వివరణ స్ఫురించింది.

(ఇంకా వుంది)

1 Responses to కింద పడడం అంటే ఏమిటి? - న్యూటన్ వివరణ

  1. thank you sir

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email