శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.కృత్రిమమైన ఆహారరంజనాలు ప్రకృతిలో దొరకవు.ఇవి రసాయనకర్మాగారాలలో తయారవుతాయి.  వీటి అణువులు  సహజమైన రంజనాల అణువులకు పూర్తిగా భిన్నమైనవి. వీటిని సింథటిక్ ఫుడ్ కలర్స్  అంటాం.  అజో రంజనాలు, ఎరిత్రోసిన్, ఇండిగొ కారమిన్  మొదలైన వాటిని ప్రధాన మైన సింథటిక్ ఫుడ్ కలర్స్ గా   చెప్పుకోవచ్చు. కుర్క్యుమిన్ (Curcumin) రంగుకి సమానమైన రంగునిచ్చే  కృత్రిమ రంజనం  టెట్రజిన్ (Tatrazine).
  
 సహజ ఆహార రంజనాలు అన్నీ  ఆరోగ్యరీత్యా సురక్షితమైనవి  అని  గుడ్డిగా నమ్మే  అలవాటు మనలో చాలామందికి  వుంటుంది.  కానీ  సహజమైనవైనా, ప్రయోగశాలలో కృత్రిమగా తయారైన వైనా, అన్నీ రసాయనాలే! అవి మనకి  విష కారకాలా, కాదా అన్న విషయాన్ని పరీక్షచేసి  నిర్ధారించు  కోవాలి. దేనినిఎంత మోతాదులోవాడవచ్చో కూడా నిర్ణయించాల్సిన అవసర మూ వుంది. ఈపనిని   విషపదార్ధాలను అధ్యయనం చేసే  టాక్సికాలజిస్ట్ లు  నిర్వర్తిస్తారు.  

    ఏ ఆహారంజనాల వాడుకొంటె  మన ఆరోగ్యానికి  అపాయం వాటిల్లదో పరీక్షించి  నిర్ధారణ గా  చెప్పే పలుసంస్థలు ప్రపంచం లో  వున్నాయి.  యునైటెడ్  స్టే ట్స్  లో  ఆహారరంజనాల వాడుక నియం త్రణను  వారి ఫుడ్ డ్రగ్ ఆడ్మినిస్ట్రేష న్  FDA;  Food Drug & Cosmetic Act  లు చేస్తాయి.  ఆహార పదార్ధాలలోవాడుకోవడానికి   అనుమతిచ్చిన రంజనాలకి వారు FD&C సంఖ్యలను యిస్తారు. విషపదార్ధాలుకానివని నిర్ణయించిన వాటిని సౌందర్యసాధనాలలొనూ మందులతయరీలోను వైద్యపరికరాలలోనూ కూడా వాడుతారు.  యూరోపియన్ యూనియన్   వారు  వారు అనుమతించిన  రంజనాలకి E సంఖ్యలను యిస్తారు .కొన్ని రంజనాలపేర్ల తరువాత FCF అక్షరాలను చేర్చుతూ  For Coloring Food కి  సంక్షిప్తంగా యు. ఎస్. సూచిస్తే అవే అక్షరాలను  యునైటెడ్  కింగ్ డమ్  వారు For Coloring of Food  కి సంక్షిప్తంగా చేర్చి  బజారులో పెట్టడానికి  అనుమతిస్తారు. ఉదాహరణకి నీలివర్ణాన్నికలగజెసే  సంకలితానికి FD&C No1-Brilliant Blue FCF అని యుఎస్ వారూ, యుకె వారు   E133  అనీ సూచిస్తారు.    

మన భారతదేశం లో Prevention Of Food Adulteration Act 1954 (PFA) , The Prevention of Food Adulteration Rules 1955, 1999  సహజమైన, సింథటిక్  రకాల ఆహార రంజనాల వాడుకని నియంత్రిస్తాయి. సింథటిక్  రకాల ఆహార రంజనాలవాడుకకి అనుమతించిన వాటికి  కలర్  యిండెక్స్ లను  యిచ్చాయి. ఉదాహరణకి Tetrazine  కి 19140 సంఖ్య నూ, Brilliant Blue FCF కి 42090 సంఖ్యను యిచ్చాయి. 

కొన్ని రంజనాల విషయం లొ ప్రపంచదేశాలు  భిన్నాభిప్రాయాలను వ్యక్తపరచ డాన్నిచూస్తున్నాము. ఉదాహరణకి FD&C Yellow5-Tatrazine వాడుకని నార్వే, ఆస్ట్రియాలు నిషేధించాయి.FDA వారి Adverse Reaction Monitoring System(ARMS)కంప్యూటరైజ్డ్  డాటాబేస్ అధారంగా  ప్రజలలొ ఈరంజనాల వాడుకలోవచ్చే   అనారోగ్య పరిణామాలను  అధ్యయనంచేసి అవసర మైన ప్పుడు వాటి వాడుకలో  సరికొత్తసూచనలు యిస్తూవుంటుంది.  FDA సలహా మండలివారు 1986 లొ FD&C Yellow5-Tatrazine వాడడం వల్ల చర్మపై ఎర్రని దద్దుర్లు వచ్చెఒకానొక వ్యాధి 10000 మందిలో ఒకరికి వస్తుందనీ, మరి కొంతమందిలో ఉబ్బసరోగం వచ్చిన ధాఖాలాలున్నట్టుగా నిర్ధారించింది. అయితే  వారు FD&C Yellow5-Tatrazine ని వాడవచ్చుననీ కానీ దానిని  వ్యపారస్థుడు డబ్బాపై  ఆ రంజనానికి  అతి సున్నితత్వం  వున్నవారు  వాడకూడదని తెలిపే చీటీ అతికించి  అమ్మాలనే  నిబంధనను ప్రవేశపెట్టింది.

 FD&CN01-Brilliant Blue రంజనాన్నిబెల్జియం,ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లెండ్  స్వీడన్,ఆస్త్రియా, నార్వేలు నిషేధించాయి.భారతదేశపు PFA వారు నిబంధన 26 ప్రకారం   సహజ రంజనాలైన బీటా కరొటిన్,కుర్క్యుమిన్ ,క్లోరోఫిల్, లవంటి  పదకొండు  రంజనాలని అవి  సహజ ఉత్పత్తుల నుండి తయారైనవైనా లేదా ప్రయోగశాలలోతయారైన వైనా  వాడడానికి  అనుమతించింది. అలాగే నిబంధన 28 ప్రకారం 8 సింథటిక్ రంజనాలను అనుమతించింది. ఇవి ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులలొ నున్న  రంజనాలు.  వీటిలో టెట్రజిన్ 19140 కూడావుంది.  అయితే వీటిని ఏఏ ఆహారపదార్ధాలలో వాడాలో ప్రత్యేకించిన సూచనలిచ్చింది.  వాటిలో ఐస్ క్రీం , బిస్కట్లు, కస్టర్డ్ పౌడర్లు,  యోగర్ట్,  భటానీలు,  స్ట్రాబెర్రీస్ మొదలైనవివున్నాయి.  FD&C No 3 Red Erythrosine, E127 వాడుకవల్ల థైరాయిడ్ ట్యూమర్లు వచ్చాయని 1990 పరీక్షలలో తేలినందువల్ల దానిని   అనుమతించిన రంజనాల జాబితానుండి తొలగించింది.

   అనుమతిలేని రంగుల వినియోగమూ,  అనుమతివున్న వాటి ని  మితిమీరి  వినియోగించడమూ  జరిగినప్పుడు అవి మన శరీరాలపై  చెడుప్రభాలను చూపుతాయి. దీర్ఘకాలంపాటు సింథటిక్ రంజనాలను కలిపిన ఆహారపదార్ధాలను తినడంవల్ల,  హైపర్ అసిడిటి,  థైరాయిడ్ ట్యూమర్ లు,  ఉబ్బసం,  అలర్జీలు ,  లివర్  కిడ్నిలు దెబ్బతినడం,  కాన్సర్ వచ్చేఅవకాసాలు ఎక్కువ. ఉదాహరణకి Rhodomine B  వాడుక  ఎదుగుదలలోనూ, కిడ్ని,లివర్ ల పనితీరులలో మందకొడితనాన్ని  తీసుకొచ్చిన సంఘటనలున్నవని   పరిశోధనలు చెపుతున్నాయి.ఏది ఏమైనా అహారరంజనాల వాడుకలోగల  అరోగ్యపరమైన  బధ్రత విషయం  చర్చనీయాంశమే!  కొంతమంది  కొన్నిరకాల రంజనాలకి సున్నితత్వాన్ని కలిగివుంటారు. అటువటివారిలో అధిక చురుకుదనం,ఆస్త్మా, ఎలర్జీవంటివి  పొడచూపవచ్చు.  ప్రతి వ్యక్తీ తన శారీరక ఆరోగ్య  విషయంలో  వైద్యుల సలహామేరకూ, తన అనుభవాన్నిబట్టి  రంజానలు కలిపిన ఆహారాన్నితినవచ్చా కూడదా అని స్వయం నిర్ణయం పై అధార పడడం శ్రేయస్కరం.  పిల్లలవిషయంలో  మరింతగా తల్లితండ్రులు జాగ్రత్త పడవలసిన అవసరంవుంది. బహుళ జాతి కంపెనీలు మన దేశములోని సూపర్ మార్కెట్లలొ  పిల్లలను ఆకట్టుకోగల ఆకర్షణీయమైన రంగులతో  అనేక అహారపదార్ధాలు  అందుబాటులో పెడుతున్నాయి.
                               

Natural food colors   hopperfoods.com.                                      


  

Synthetic food colors, eisemancolorblog.wordpress.com  


సింథటిక్ రంజనాలు  సహజ రంజనాల కంటే ఎక్కువప్రకాశవంతంగా వుంటాయి. అదువల్ల వాటిని చాలాతక్కువమోతాదులో  కలుపుకోవాలి. సాధారణంగా ఇక కిలోగ్రామ్   అహార పదార్ధానికీ 10నుండి50 మిల్లిగ్రాముల సింథటిక్ రంజనాన్ని కలుపుతారు .  సహజ రంజనాలు  అంత గాఢంగా  వుండవు కనక వాటిని ఒక కిలో గ్రామ్ అహార పదార్ధానికీ  10మిల్లిగ్రామ్  ల నుండి 10 గ్రాముల వరకూ వాడుతారు. సహజ రంజనాలకు సర్వసమానమైన  రంజనాలను  కలుపుకోనే  నిష్పత్తులు   రంజనానికీ రంజనానికీ  వేరువేరుగావుంటాయి.ఇవి చాలాసమర్ధవంతమైన  రంజనాలు. బీటా కరొటిన్ ని ఒక కిలో గ్రామ్ ఆహారపదార్ధానికీ  ఒకటినుండీ30 మిల్లిగ్రాములు  కలుపుతారు. 

ఆరంజ్ జ్యూస్ తయారు చేసేటప్పుడు బీటా కరొటిన్ ని కలుపుతారు.  ఒక్ లీటర్  బీటకరొటిన్  ని   తాగాలంటే  40 సంవత్సరాలపాటు రోజుకీ పది లీటర్ల  జ్యూస్ చొప్పున  ప్రతీరోజూ  తాగాల్సి వుంటుంది. అంత తక్కువ గా ఆ రంజనం  ఆహారసంకలితంగా ఆరంజ్ జ్యూస్ లో  కలుస్తుంది.         .   


  


       
  
       


     

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email