అధ్యాయం 4.
కేంబ్రిడ్జ్ ప్రొఫెసరు న్యూటన్
లండన్ లో ప్లేగు ప్రమాదం తగ్గుముఖం పట్టాక న్యూటన్ కేంబ్రిడ్జ్ కి తిరిగొచ్చాడు. మళ్లీ ట్రినిటీ కాలేజిలో చేరాడు. ఇక ఎం.ఏ. పరీక్షలు పాసైతే ఎం.ఏ. పట్టం అందుకోవచ్చు. సెప్టెంబర్ 1667 లో ఎం. ఏ. పరీక్షలు. ఆ పరీక్షలో మొదటి మూడు రోజులు మౌఖిక పరీక్ష వుంటుంది. నాలుగో రోజు లిఖిత పరీక్ష. ఏదో అంశం ఇచ్చి ఆరు గంటల్లో దాని గురించి రాసుకు రమ్మన్నారు. న్యూటన్, అతడి మిత్రుడు జాన్ విల్కిన్స్ ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఇద్దరికీ ట్రినిటీ కాలేజిలో ప్రతిష్ఠాత్మక మైన ఫెలోషిప్ దక్కింది. అంటే కాలేజిలో మేధావి వర్గానికి చెందిన సమాజంలో శాశ్వత సభ్యత్వం అన్నమాట. ఇద్దరి సంతోషానికి హద్దుల్లేవు.
మిత్రులిద్దరూ ఆ శుభసందర్భంలో విందుచేసుకుని వేడుకగా గడపాలని అనుకున్నారు. న్యూటన్ అలా సరదాగా మిత్రులతో గడిపిన సందర్భాలు అతి తక్కువ. ఇద్దరూ తమ గదులకి అందంగా రంగులు వేసుకున్నారు. పాత కుర్చీలు అవతల పారేసి కొత్తవి కొనుక్కున్నారు. న్యూటన్ కి తన మీద తన వేషధారణ మీద కొత్త స్పృహ కలిగింది. ఇకనైనా ఓ పల్లెటూరి బైతులా తయారవకుండా కాస్త హుందాగా ఓ కేంబ్రిడ్జ్ మేధావిలాగా కనిపించాలని అనుకున్నాడు. బోలెడు ధనం వెచ్చించి కొత్త బట్టలు, బూట్లు కొనుక్కున్నాడు. జులై 1668 లో ఎం.ఏ. పట్టం చేతికి అందింది.
విందులు వేడుకలు నెమ్మదిగా సద్దుమణిగాయి. న్యూటన్ మళ్లీ తన అధ్యయనాల్లో మునిగిపోయాడు. ఆగస్టు నెలలో ఒకసారి లండన్ నగరాన్ని సందర్శించినట్టు ఆధారాలు వున్నాయి. అగ్నిప్రమాదం వల్ల నగరంలో ఇంచుమించు 4/5 వంతు నాశనమైపోయింది. ఆ శిధిల నగరాన్ని సందర్శించిన న్యూటన్ అక్కడ ఇంచుమించు రెండు నెలలు వున్నాడు. మరి అంతగా నాశనమైన నగరానికి ఎందుకు వెళ్ళాడు అన్నవిషయంలో పెద్దగా వివరాలు లేవు. తన ప్రయోగాలకి కావలసిన సామగ్రి, కొన్ని పుస్తకాలు కొనుక్కుని వుండొచ్చు. లేదా నగరంలో ఉండే ప్రముఖ గణిత వేత్తలనో, తత్వవేత్తలనో కలుసుకుని వుండొచ్చు.
న్యూటన్ జీవితం ఇప్పుడో ముఖ్యమైన మలుపు తిరగబోతోంది. ఇంతవరకు తనో విద్యార్థి మాత్రమే. ప్రతిభలో, పాండిత్యంలో, పరిశోధనా పటిమలో ఎంత ఎత్తుకు వెళ్లినా హోదా రీత్యా తనో విద్యార్థి మాత్రమే. కాని ఇప్పుడు పరిస్థితి వేరు. తను ఇక విద్యార్థి కాడు. శాస్త్రవేత్తల సమాజంలో తనకి సభ్యత్వం లభించింది. తన పరిశోధనలకి మన్నన లభించే రోజులు ముందున్నాయి. తన విప్లవాత్మక భావాలని వైజ్ఞానిక సమాజం సమ్మతించే అవకాశాలు ముందున్నాయి.
న్యూటన్ ప్రతిభని గుర్తించిన వారిలో ముఖ్యుడు, మొదటి వాడు ఐసాక్ బారో. ఇతడు కేంబ్రిడ్జ్ లో గణిత ఆచార్యుడిగా వుండేవాడు. విద్యార్థి దశలో న్యూటన్ ఇతగాణ్ణి పలుమార్లు కలుసుకుని వుండొచ్చు. 1664 లో ఐసాక్ బారో ఇచ్చిన గణిత ఉపన్యాసాలకి న్యూటన్ హాజరు అయ్యానని చెప్పుకున్నాడు. గణితంలో న్యూటన్ చేసిన కృషి గురించి బారోకి తెలుసు. ఆ విషయం గురించి 1669 లో మొట్టమొదటి సారిగా జాన్ కాలిన్స్ అనే గణితవేత్తకి బారో ఇలా రాశాడు – “హైపర్బోలా కి సంబంధించి మెర్కాటర్ గారు చేసిన లెక్కల గురించి నాకు తెలుసు. అయితే నాకు తెలిసిన ఓ యువ గణిత మేధావి అలాంటి లెక్కలు చెయ్యడానికి కొన్ని అద్భుతమైన విధానాలు రూపొందించాడు.”
బారో చెప్తున్న ఆ యువగణిత మేధావి న్యూటన్! ఈ ఉత్తరానికి ఓ నేపథ్యం వుంది. నికొలాస్ మెర్కాటర్ (Nicolas
Mercator) అనే
గణితవేత్త
Logarithmotechnia అనే
పుస్తకం
రాశాడు.
అందులో
లాగరిథమ్స్
(సంవర్గమానాలు)
అనే
గణిత
అంశానికి
సంబంధించిన
ఎన్నో
లెక్కలు
చేసి
చూపించాడు.
కఠినమైన
లెక్కలని
సులభతరం
చెయ్యడానికి
సంవర్గమానాలు
వాడుతారు.
అలాంటి
లెక్కల్లో
‘లాగరిథమ్
టేబిల్స్’
ని
వాడుతారు.
ఆ
పట్టికల్లో
సంవర్గమానం
అనే
ప్రమేయం
యొక్క
విలువలు
వరుసగా
ఇస్తారు.
ఆ
విలువలని
లెక్కించడానికి
కొన్ని
గణిత
విధానాలు
ఉన్నాయి.
ఉదాహరణకి
సంవర్గమానాలు
లెక్కించడానికి
మెర్కాటర్
ఈ
కింది
అనంతశ్రేణిని
వాడొచ్చని
సూచించాడు.
అయితే ఇదే శ్రేణిని న్యూటన్ అంతకు ముందే స్వచ్ఛందంగా తను కనిపెట్టిన క్యాల్కులస్ ని ఉపయోగించి నిరూపించాడు. ఇదొక్కటే కాక ఇలాంటి మరెన్నో శ్రేణులని న్యూటన్ De Analysi per
Aequationes Infinitas (అనంత
శ్రేణుల
విశ్లేషణ)
అన్న
పుస్తకంలో
విపులంగా
వర్ణించాడు.
ఈ
విషయమే
బారో
తన
మిత్రుడు
జాన్
కాలిన్స్
కి
తెలిపాడు.
అంతేకాక
అదే
ఉత్తరంలో
ఈ
అంశం
మీద
న్యూటన్
చేసిన
రచనని
పంపుతానని
కూడా
బారో
మాట
ఇచ్చాడు.
న్యుటన్ అనంత శ్రేణుల మీద రాసిన లాటిన్ పుస్తకం - De Analysi per Aequationes Infinitas
(ఇంకా
వుంది)
0 comments