శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.





రోజుల్లో రాజుగారి టంకశాల లండన్ లోటవర్ ఆఫ్ లండన్అనే కోటబురుజు లాంటి దుర్భేద్యమైన భవంతిలో ఉండేది. భవంతి చుట్టూ లోతైన కందకం వుంటుంది. చిన్న వంతెన మీద కందకాన్ని దాటగానే అవతల ఎత్తైన గోడలు. గోడలు దాటి లోపలికి ప్రవేశిస్తే అక్కడ ఇంకా ఎత్తైన రెండవ ప్రాకారం ఎదురవుతుంది. లోపలే సిపాయిల సిబిరాలు, మందుపాతర భాండారాలు వుంటాయి. అంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో వున్న టంకశాల మీద కన్నెయ్యడానికి కూడా సాధ్యం కాదన్నట్టు ఉండేది.

అంతవరకు శాస్త్రవిషయాల ధ్యాసలోనే జీవితం వెళ్లబుచ్చిన న్యూటన్ కి  టంకశాల నిర్వహణలో  కొన్ని కొత్త సమస్యలు తలెత్తాయి. టంకశాల కి వార్డెన్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నాణేల తయారీకి చెందిన రహస్యాలని బయటి వారితో పంచుకోనని ప్రమాణం చేశాడు న్యూటన్. రోజుల్లో నకిలీ నాణేల సమస్య చాలా ఉధృతంగా వుండేది. 1695  నాటికి సమస్య ఎంత తీవ్రరూపం దాల్చిందంటే బ్రిటిష్ ప్రభుత్వం దేశంలోని మొత్తం నాణేలన్నీ వెనక్కి రప్పించుకుని వాటి స్థానంలో కొత్త నాణేలని ప్రవేశ పెట్టాలని నిశ్చయించుకుంది. ఒక్క సారిగా అన్ని కొత్త నాణేల తయారీ అంటే మాటలు కాదు. టంకశాల లో ఉద్యోగులు రాత్రనక పగలనక శ్రమించడం మొదలెట్టారు. ప్రధాన టంక శాల సరిపోక ఎన్నో శాఖలు తెరిచారు.

పాత నాణాలని వెనక్కి తీసుకుని కొత్త నాణేలని ప్రవేశపెడితే సమస్య తీరదు. అసలు నకిలీ నాణేలని చేస్తున్నదెవరో తెలియాలి. త్వరలోనే వివరం తెలిసింది న్యూటన్ కి. వ్యక్తి  తెలివితేటల్లో తనకి మాత్రం తీసిపోడనిపించింది. వాడి పేరు విలియమ్ షాలొనర్. చవకబారు వాచీలకి మెరుగులు దిద్ది అధిక వెలకి అమ్ముకుంటూ తన వృత్తి జీవితాన్ని ఆరంభించాడు షాలొనర్. జపాన్ లో చెక్కపై అందమైన లోహపు పూత ఎలా వేస్తారో ఒక కళాకారుడికి లంచం ఇచ్చి నేర్చుకున్నాడు. పరిజ్ఞానంతో నెమ్మదిగా నకిలీ నాణేలు ఎలా చెయ్యాలో నేర్చుకున్నాడు

టంకశాల వార్డెన్ గా న్యూటన్ కి కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. పరిచయాలు మునుపట్లా పండితులతోను, తాత్వికులతోను కాదు. సంఘంలోని మురికి అంతా తన ముంగిట చేరినట్టు ఉండేది. హంతకులు, బందిపోట్లు, జేబుదొంగలు, బిచ్చగాళ్లుసమాజంలోని దుష్టవర్గంతో ఎంత వద్దనుకున్నా ఇప్పుడు అతడికి  వ్యవహారం  తప్పలేదు. లంచాలిచ్చి సాక్ష్యాధారాలని ఎలా నాశనం  చేస్తారు, పోలీసులకి అందకుండా నగరాలకి దూరంగా చిన్న చిన్న పల్లెల్లో రహస్య ప్రదేశాలలో ఎలా దాక్కుంటారు, పగటి పూట పెద్దమనుషుల్లా సంచరించే దుష్టసంతతి అంతా రాత్రి పూట రహస్య స్థావరాలలో ఎలా కలుసుకుంటారుమొదలైన వివరాలన్నీ ఇప్పుడు న్యూటన్ కి తెలిసి వస్తున్నాయి. తన అందమైన వైజ్ఞానిక ప్రపంచానికి అవతల ఇలాంటి క్షుద్రప్రపంచం ఒకటి వుంటుందని కూడా అంతవరకు తనకి తెలీదు.

కాని ఒక విధంగా మేధావికి అత్యంత ప్రియమైన వైజ్ఞానిక భావ ప్రపంచానికి, వాస్తవ ప్రపంచానికి మధ్య ఏదో సంబంధం కనిపించిందేమో. వైజ్ఞానిక భావ ప్రపంచంలో చలనాలన్నీ తీరుగా కొన్ని కచ్చితమైన నియమాలని అనుసరించి నడుచుకుంటాయి. పెద్ద గ్రహమైనా, చిన్నారి కాంతి కణమైనా దానికి సంబంధించిన నియమాలని అది తుచ తప్పకుండా పాటిస్తూ పోతుంది. కాని వాస్తవ ప్రపంచంలో అలాంటి అందం, క్రమం కొరవడినట్టు కనిపిస్తోంది. వైజ్ఞానిక ప్రపంచంలో తనకి కనిపించిన క్రమం, నియమబద్ధత వాస్తవ ప్రపంచంలో కూడా ఉంటే బావుంటుంది అనిపించింది. అవి లేకుంటే ఎలాగైనా వాటిని సాధించి, స్థాపించాలి అనిపించింది. ధర్మసంస్థాపనకి నడుం కట్టాడు న్యూటన్.

తన మనసులో ఇప్పుడు ఒకే లక్ష్యం. ఎలాగైనా షాలొనర్ ని పట్టుకుని, చెరసాలలో పడేయించాలి. అయితే న్యూటన్ తన అనుభవంలో చూసిన ఎంతో మంది నేరస్థులకి వీడికి మధ్య ఎంతో వ్యత్యాసం వుంది. వీడు సంఘంలో పెద్దమనిషిలా చలామణి అవుతుంటాడు. వీడి నిజస్వరూపం అందరికీ తెలిసినా సాక్ష్యాలు లేకపోవడం వల్ల ఎవరూ ఏమీ చెయ్యలేకపోయేవారు. ఖరీదైన గుర్రపు బగ్గీలో, పక్కన ఉంపుడుగత్తెతో లండన్ వీధుల్లో సంచరించే షాలొనర్ ఎక్కడైనా తారసపడితే  న్యూటన్ రక్తం ఉడికిపోయేది.

నకిలీ నాణేల వ్యాపారంతో బాగా సొమ్ము వెనకేసిన షాలొనర్ అక్కడితో ఆగక ఒక సారి పెద్దమనిషిలా పార్లెమెంట్ సమావేశానికి హాజరై, నాణేల తయారీలో దోషాలు వున్నాయని, దొంగలకి వాటిని  సులభంగా నకలు చెయ్యడానికి వీలవుతోందని నివేదన సమర్పించుకున్నాడు. ఎలాగైనా వీడి భరతం పట్టాలని నిశ్చయించుకున్నాడు న్యూటన్. అది విన్న షాలొనర్ ముసలి కుక్క నన్నేం చేస్తుంది?” అంటూ విర్రవీగాడు.  దాంతో ఒళ్ళు మండిపోయిన న్యూటన్  వెధవని ఎలాగైనా పట్టి ఉరితీయిస్తానని బహిరంగంగా సవాలు చేశాడు.

చట్టాన్ని గుప్పెట్లో పెట్టుకున్న షాలొనర్ ని లొంగ దీసుకోవాలంటే చట్టరీత్యా పోతే లాభం లేదని న్యూటన్ త్వరలోనే గ్రహించాడు. కొందరు విశ్వసనీయులైన పోలీసులని పంపించి రాత్రికి రాత్రి షాలొనర్ ని బంధించి న్యూగేట్ జైల్లో పడేయించాడు. అక్కడ జైలు అధికారులకి మరి న్యూటన్ ఏం ఆదేశాలు ఇచ్చాడో, వారు షాలొనర్ కి ఏం సంస్కారాలు చేశారో తెలియదు గాని, వాడు అంతకాలం పట్టుబడకుండా తను చేసిన తప్పులన్నీ వెళ్లగక్కాడు. వాడు చెప్పిన విషయాలకి అదే జైల్లో మగ్గుతున్న ముగ్గురు నేరస్థులు సాక్ష్యాలుగా  ఉండేట్టుగా ఏర్పాటు చేశాడు న్యూటన్. న్యాయవిచారణ వేగంగా జరిగింది. షాలొనర్ కి ఉరిశిక్ష పడింది.

ఉరిశిక్ష అమలు జరిపే తేదీ దగ్గర పడుతున్న కొద్ది షాలొనర్ గుండెల్లో గుబులు పెరిగింది. ప్రాణభిక్ష పెట్టమని న్యూటన్ ని అర్థిస్తూ రాశాడు. ఉత్తరం రాసిన రెండు రోజుల తరువాత పోలీసులు షాలొనర్ ని జైలు నుంచి బయటికి తెచ్చి, గుర్రపు బండిలో ఎక్కించుకుని, రోడ్డుకి ఇరుపక్కలా బారులు తీరిన ప్రజల ముందు వాణ్ణి ప్రదర్శిస్తూ తీసుకుపోయారు. జైలుకి రెండు మైళ్ల దూరంలో వున్న హైడ్ పార్క్ లో షాలొనర్ ని ఉరి తీశారు.

ప్రకృతి నియమాలని శోధించే శాస్త్రకర్త గానే కాకుండా సామాజిక నియమాలని నిలిపే ధర్మకర్తగా కూడా వ్యవహరించగలడని షాలొనర్ వ్యవహారంలో న్యూటన్ ఋజువు చేసుకున్నాడు. వయసు పైబడి వుండొచ్చు గాని పౌరుషానికి, ధీశక్తికి కొదవ లేదని నిరూపించుకున్నాడు.



 (ఇంకా వుంది)







3 comments

  1. "న్యూటన్ ఎంతపని చేసాడూ. ఒకణ్ణి ఉరితీయించాడు. అతడు నేరస్థుడని బూటకపు విచారణజరిపించి ఒక ధర్మాత్ముణ్ణి నిలువునా హత్యచేసాడు" అని అప్పట్లో అరోపణలు రాలేదా? నేటికాలపు మేథావులవంటి బుద్ధిశాలురు అప్పట్లో రాకపోయినా, ఇంక నేటిమేథావి వర్గం అటువంటీ ఉదారకార్యక్రమానికి పూనుకోవచ్చును. అన్నట్లు న్యూటన్ భారతదేశం వాడు కాదు కదా - ఐతే బ్రతికిపోయాడు. ఇండియన్ అయ్యుంటే మాత్రం మన మేథావులు ఆ హతమారిపోయిన వాణ్ణి మహాపురుషుణ్ణి చేయకుండా వదలరని గ్యారంటీగా చెప్పవచ్చును.

     
  2. సర్ మీ బ్లాగు టపాలు నా www.itzok.in లో రీపోస్టు చేసుకోవచ్చా?మీపేరుతో,మీ బ్లాగుకు లంకెతో.

     
  3. రాజేంద్ర కుమార్ గారు,
    తప్పకుండా పోస్ట్ చేసుకోండి!

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts