(ఈ పోస్ట్ లోని అంశానికి ప్రస్తుతం దేశంలో జరుగుతున్న వ్యవహారానికి మధ్య పోలిక ఉండడం కాకతాళీయం!)
ప్రిన్సిపియా
ప్రచురణ
తరువాత
న్యూటన్
పేరు
వైజ్ఞానిక
లోకం
అంతా
మారుమ్రోగిపోయింది.
ఆ
గ్రంథానికి
సంపాదకీయం
వహించిన
ఎడ్మండ్
హాలీ
పరిచయంలో
న్యూటన్
ని
పొగుడుతూ
ఓ
కవిత
రాస్తాడు.
ఆ
కవితలో
ఆఖరు
వాక్యం
ఇలా
వుంటుంది
– “ఇంతకు
మించి
దేవతల
స్థాయిని
ఏ
మానవుడూ
సమీపించలేడు.”
న్యూటన్
సాధించిన
అసమాన
విజయాన్ని
పొగుడుతూ
బ్రిటిష్
కవి
అలెగ్జాండర్
పోప్
ఇలా
అంటాడు
–
Nature and nature’s laws
lay hid in night
God said “Let Newton be!”
and all was light.
(ప్రకృతి నేలే నియమాలన్నీ చీకటి దాగిన తరుణాన
“రారమ్ము న్యూటన”ను దేవుని ఆనకు కాంతులు నిండెను ఇలలోన.)
స్కాట్లాండ్
కి
చెందిన
గణితవేత్త
డేవిడ్
గ్రెగరీ
“రాబోయే
యుగాల
జ్యామితి
కారుల,
తాత్వికుల
మన్ననకి
నీవు
అర్హుడివి”
అంటాడు. ఫ్రాన్స్ లో న్యూటన్ గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్న రోజుల్లో ఆ దేశానికి చెందిన ద మోవ్ అనే గణితవేత్త న్యూటన్ గురించి మరింత తెలుసుకోవాలన్న కుతూహలంతో బ్రిటన్ కి చెందిన జాన్ ఆర్బట్నాట్ అనే మిత్రుణ్ణి ఇలా అడుగుతాడు – “అసలు న్యూటన్ మామూలు మనుషుల్లాగానే ఉంటాడా? అతడు కూడా తినడం, తాగడం, నిద్రపోవడం వంటివి చేస్తాడా?” ఆ ప్రశ్నలు వింటుంటే గీతలో అర్జునుడు స్థితప్రజ్ఞుడి లక్షణాల గురించి అడుగుతూ, “అతడు ఎలా వుంటాడు? ఎలా మాట్లడతాడు? ఎలా కూర్చుంటాడు? ఎలా సంచరిస్తాడు” అన్న ప్రశ్నలు గుర్తుకు రాక మానవు. న్యూటన్ కి సన్నిహితుడైన హంఫ్రీ బాబింగ్టన్ అనే శాస్త్రవేత్త ఆ పుస్తకం గురించి “మహా మహా పండితులకే ఆ పుస్తకం ఏ మాత్రం అర్థం కావడానికైనా ఏడేళ్ల అధ్యయనం అవసరం,” అన్నాట్ట.
1689 లో న్యూటన్ జీవితంలో ఓ ముఖ్యమైన పరిణామం జరిగింది. వైజ్ఞానిక రంగంలో మహోన్నత స్థానంలో వున్నవాడిగా, ప్రముఖ పౌరుడిగా న్యూటన్ పార్లమెంట్ కి ఎంపిక అయ్యాడు. ఆ కాలంలో రాజ కుటుంబం యొక్క శక్తులని కట్టడి చేస్తూ రాజ్యాంగ సవరణలు జరిగాయి. బ్రిటిష్ పాలక విధానాలు పూర్తి ప్రజాస్వామ్యం దిశగా పరిణమిస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాలలో న్యూటన్ క్రమం తప్పకుండా హాజరు అయ్యేవాడని సమాచారం. పార్లమెంట్ సమావేశాలకి వెళ్లి వస్తున్నా కేంబ్రిడ్జ్ లో తన ఆచార్య స్థానాన్ని మాత్రం వొదులుకోలేదు.
ఇలా
ఉండగా
1695 లో
న్యూటన్
జీవితంలో మరో ముఖ్యమైన మార్పు వచ్చింది. బ్రిటిష్ దేశపు టంకశాలలో ఓ ముఖ్య అధికారిగా నియామకం అయ్యాడు న్యూటన్. ఏడాదికి ఐదారు వందల పౌండ్ల జీతం. ఎంత ప్రముఖుడైనా ఒక శాస్త్రవేత్తకి అది చాలా భారీ జీతం అని చెప్పాలి. టంకశాలలో రెండవ ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించడం అంటే సామాన్యం కాదు. ఆ సందర్భంలో మొట్టమొదటి సారిగా బ్రిటిష్ రాజు మూడవ విలియం దర్శనం చేసుకుని తన భుజాల మీద అంత పెద్ద బాధ్యతని ఉంచినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.
వెంటనే
కేంబ్రిడ్జ్
కి
తిరిగొచ్చి
మకాం
మార్చడానికి
సన్నాహాలు
చేసుకున్నాడు.
ముప్పై
ఐదేళ్ల
శ్రమ
ఫలితం
అంతా
పెట్టెలకి
ఎత్తించాడు.
వేల
పేజీల
వ్రాతపత్రులు,
లక్షల
పదాలతో
కూడిన
ఉత్తరప్రత్యుత్తరాలు,
గణితం,
కాంతి
శాస్త్రం,
గురుత్వం
మొదలైన
రంగాల్లో
రచనలు
అన్నీ
హడావుడిగా
సర్దించాడు.
కాని
తన
ప్రయోగ
సామగ్రిని
మాత్రం
తరలించడానికి
వీలుపడలేదు.
ఎంతో
సామాను
తన
ఇంట్లోనే
మిగిలిపోయింది.
ఆ
ఇల్లే
తదనంతరం
‘న్యూటన్
మ్యూజియమ్’
గా
తీర్చిదిద్దబడింది.
1666 లో లండన్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఆ నగరపు ఆర్థిక స్థితి బాగా దెబ్బతిన్నది. ధనికులకి, పేదలకి మధ్య వ్యత్యాసం మరింత పెరిగింది. డబ్బు, పలుకుబడి, పరపతి వున్న వారు ఇంపైన నగర ప్రాంతల్లో జీవించేవారు. లేని వారు ఊరవతల మురికి వాడల్లో జీవించేవారు. ఇరుకైన, మురికైన ఇళ్ళలో కొన్ని పదుల వేల మంది జనం జీవించేవారు. చట్టవ్యతిరేక వ్యవహారాలు పేదరికానికి పరిష్కారంగా తోస్తాయి. ఆ ప్రాంతం హంతుకులకి, దోపిడీ దారులకి ఆలవాలంగా ఎదిగింది. ఇలాంటి వ్యవహారాలలో భాగంగా నకిలీ నాణేల వ్యాపారం బాగా ఊపందుకుంది. ఆ వ్యాపారం టంకశాలకి వార్డెన్ గా పని చేస్తున్న న్యూటన్ కి తలనొప్పిగా దాపురించింది.
(ఇంకా వుంది)
0 comments