
ఆ విధంగా గెలీలియో తన పరిశీలనలని మాత్రమే ప్రచారం చేస్తూ కోపర్నికస్ ప్రసక్తి తేకుండా ఎంతో కాలం జగ్రత్తపడుతూ వచ్చాడు. కాని 1613 లో ఒక సందర్భంలో తన సహనం చచ్చిపోయినట్టుంది. ఆ సంవత్సరం సూర్యబిందువుల (sunspots) గురించి తను చేసిన పరిశీలనల గురించి ఓ చిన్న పుస్తకం రాశాడు. లిన్సియన్ సదస్సు ఆ పుస్తకాన్ని ప్రచురించింది. పుస్తకం ముందుమాటలో గెలీలియోని ఆకాశానికెత్తుతూ సూర్యబిందువులని మొట్టమొదట పరిశీలించిన ఘనత గెలీలియోదే నన్నట్టుగా రాశారు లిన్సియన్ సభ్యులు....
ఆ విధంగా మతాధికారుల స్పందన అంత ప్రోత్సాహకరంగా లేకపోయినా రోమ్ సందర్శనంలో గెలీలియోకి సంతోషాన్ని ఇచ్చిన విషయం మరొకటి ఉంది. రోమ్ లో లిన్సియన్ అకాడెమీ అనే ఓ వైజ్ఞానిక సదస్సు ఉంది. ప్రపంచంలో అదే మోట్టమొదటి వైజ్ఞానిక సదస్సు అని అంటారు. ఆ సదస్సులో గెలీలియోకి సభ్యత్వం దొరికింది. సభ్యుడిగా చేర్చుకోవడమే కాకుండా గెలీలియో గౌరవార్థం విందు కూడా ఏర్పాటు చేశారు. ఆ విందులో ఒక దూరదర్శిని సహాయంతో సూర్యబిందువులని (sunspots) ని బహిరంగంగా ప్రదర్శించారు. చర్చి స్పందన ఎలా ఉన్నా రోమ్ కి చెందిన వైజ్ఞానిక సమాజాల ఆదరణకి పొంగిపోయాడు గెలీలియో. సంతోషంగా...

గెలీలియో బోధనలకి అటు అరిస్టాటిల్ వాదుల నుండి, ఇటు చర్చి ప్రతినిధుల నుండి కూడా వ్యతిరేకత ఉండేదని కిందటి సారి చెప్పుకున్నాం.తన బోధనల మీద నమ్మకం కుదరకపోతే వాళ్లనే స్వయంగా వచ్చి తన దూరదర్శినిలో ఓ సారి తొంగి చూడమని ఆహ్వానించేవాడు గెలీలియో. కాని అసలు దూరదర్శిని పని తీరు మీదే అవిశ్వాసం వ్యక్తం చేశారు ఎంతో మంది. దూరదర్శినిలో కనిపించే దృశ్యాలన్నీ వట్టి భ్రాంతి అని, అదంతా అందులోని కటకాల మహిమ అని వాదించేవారు. వాళ్లని ఒప్పించడానికి దూరదర్శిని ప్రదర్శించే...

మరీ చిన్నదైన మెర్క్యురీని విడిచిపెట్టి, వీనస్ మీద అధ్యయనాలు మొదలుపెట్టాడు గెలీలియో. వీనస్ గ్రహం యొక్క భ్రమణంలో ఒక ప్రత్యేకత ఉంది. దాని సంవత్సర కాలం, దాని దిన కాలం ఇంచుమించు ఒక్కటే. అంటే వీనస్ యొక్క ఒక ముఖమే ఎప్పుడూ సూర్యుడి కేసి తిరిగి ఉంటుంది. (చందమామకి భూమికి మధ్య కూడా ఇలాంటి సంబంధమే ఉందని మనకి తెలుసు). కాని భూమి నుండి చూసే టప్పుడు, సూర్యుడి బట్టి వీనస్ స్థానం మారుతూ ఉంటుంది కనుక వీనస్ దశలు కూడా కనిపించాలి. టోలెమీ తదితరుల సిద్ధాంతం ప్రకారం...

గెలీలియో దూరదర్శినులతో చేస్తున్న పరిశీలనల గురించి కెప్లర్ మొట్టమొదట ’హెర్ వాకర్’ అనే వ్యక్తి ద్వారా విని సంతోషించాడు. విశ్వం గురించి శతాబ్దాలుగా తేలని సమస్యలు ఈ దూరదర్శిని వల్ల తేలే అవకాశం ఉందని అతడు మొదట్నుంచే ఊహించాడు. ఈ కొత్త పరికరం ఖగోళ విజ్ఞానంలో విప్లవం తీసుకురాగలదని ఆశిస్తూ దాన్ని ఇలా పొగిడాడు: “ఓ దూరదర్శినీ! విజ్ఞాన దాయినీ! నీ ఘనత ముందు ఎంత మహిమాన్వితమైన రాజదండమైనా సాటి రాదు. నిన్ను చేబూనిన వాడు దివ్యమైన ఈ సృష్టికే రాజవుతాడు, సామ్రాట్టు...

మొట్టమొదటి సారిగా చందమామ కేసి దూరదర్శినిని గురిపెట్టిన గెలీలియోకి ఆ అనుభవంతో తన జీవితమే కాక, విజ్ఞానం కూడా ఓ మలుపు తిరగబోతోందని తెలీదు. నవంబర్ 1609 లో గెలీలియో తన చంద్ర పరిశీలనలు మొదలెట్టాడు. అందుకు తను నిర్మించిన X20 దూరదర్శినిని వాడుకున్నాడు. నవంబర్ 30 నుండి డిసెంబర్ 18 వరకు రోజు క్రమబద్ధంగా పరిశీలనలు చేసి ఆ వివరాలన్నీ ’సైడీరియస్ నున్సియస్ (Sidereus Nucius) అనే పుస్తకంలో పొందుపరిచాడు. చందమామ ఉపరితలం అంతా “పెద్ద పెద్ద కొండలతోను, లోతైన...

ఆ విధంగా గెలీలియో వస్తువుల చలనం గురించి ఎన్నో మౌలిక విషయాలని కనుక్కున్నా, తను సాధించిన అతి ముఖ్యమైన విప్లవం అతడి చేతికి ఓ దూరదర్శిని చిక్కడంతో మొదలయ్యింది.దూరదర్శినిని కనిపెట్టింది గెలీలియోయే అనుకుంటారు చాలా మంది. కాని ఆ పరికరాన్ని కనిపెట్టింది హోలాండ్ కి చెందిన హన్స్ లిపర్షే అనే వ్యక్తి. కళ్లద్దాలు తయారు చేసే ఈ వ్యక్తి, అక్టోబర్ 1608 లో దూరదర్శినిని కనిపెట్టాడు. కటకాలని (lenses) వాడి దృశ్యాన్ని వృద్ధి చేసే ప్రక్రియ చాలా కాలంగా తెలిసినదే....

ఈ విషయంలో అరిస్టాటిల్ చెప్పింది తప్పని నిరూపించడానికి గెలీలియో అట్టహాసంగా ఓ బహిరంగ ప్రదర్శన చేశాడు. బరువైన వస్తువులు ఎందుకు ముందు కింద పడతాయో వివరించడానికి అరిస్టాటిల్ వాదులు ఏవో చిత్రమైన వివరణలు ఇచ్చేవారు. కాని ఆ వివరణలేవీ పట్టించుకోకుండా గెలీలియో ప్రయోగాన్ని ఆశ్రయించాడు. పీసా నగరంలో ఓ ఎత్తైన భవనం ఉంది. ఇది సన్నగా పొడవుగా ఓ ధ్వజస్తంభంలా ఉంటుంది. నిర్మాణ దోషాల వల్ల ఇది కొద్దిగా ఒక పక్కకి ఒరిగి ఉంటుంది. దీన్ని leaning tower of Pisa అంటారు....

ఆధునిక భౌతిక శాస్త్రం గెలీలియోతో మొదలయ్యిందని చెప్పుకుంటారు. ప్రతీ వివాదంలోను ప్రయోగాత్మక పద్ధతికి, వస్తుగత దృష్టికి ప్రాధాన్యత నిస్తూ, ఆధునిక శాస్త్రీయ పద్ధతికి (scientific method) పునాదులు వేశాడు. ప్రయోగ ఫలితాల ద్వారా ప్రకృతి చెప్పే సాక్ష్యాధారాల బలం ముందు ఎంతటి అధికార బలం, అహంకర బలం అయినా తల ఒగ్గవలసిందేనని నిరూపించాడు. శాస్త్ర సత్యాన్ని నిలబెట్టేందుకై ప్రాణాలని కూడా లెక్క చెయ్యకుండా మతవ్యవస్థతో తలపడ్డ ధీరాత్ముడు గెలీలియో. గెలీలియో పుట్టింది...

చందమామ మీద నీరు, ఆక్సిజన్కాని ఇవన్నీ సాధ్యం కావాలంటే మనం ముఖ్యంగా సమకూర్చుకోవలసినది ఆక్సిజన్, నీరు. చంద్రుడి మీద వీటి కోసం ఎక్కడ వెతకాలో చెప్తాడు క్లార్క్.చంద్రుడి మీద ఆక్సిజన్ శుద్ధ రూపంలో దొరక్క పోవచ్చు. కాని ఒక విషయం గుర్తుంచుకోవాలి. మన భూమిలో కూడా పైపొర (crust) లో బరువు బట్టి చూస్తే సగం భాగం ఆక్సిజనే (ఆక్సైడ్ల రూపంలో, ఉదాహరణకి సిలికాన్ డయాక్సయిడ్ – SiO2) ఉంటుంది. కనుక చందమామ మీద ఉండే మట్టి కూడా ఇందుకు పూర్తిగా ఉండే అవకాశం తక్కువ. కనుక...
postlink