1669 లో యోహాన్ జోఅకిమ్ బెచర్ (1635-1682) ఈ భావనని మరింత హేతుబద్ధంగా మార్చే ఉద్దేశంతో దాని పేరు మార్చాడు. ఘనపదార్థాలలో మూడు రకాల “పృథ్వీ” తత్వాలు ఉంటాయని ఊహించాడు ఇతడు. వీటిలో ఒక దాని పేరు “టెరా పింగ్విస్” (కొవ్వు పట్టిన పృథ్వి). దీని వల్లనే మండే గుణం అబ్బుతోందని భావించాడు బెచర్.బెచర్ బోధించిన అయోమయపు భావనలని జార్జ్ ఎర్నెస్ట్ స్టాల్ (1660-1734) అనే మరో జర్మన్ వైద్యుడు అనుసరించాడు. ఉన్నవి సరిపోనట్టు జ్వలన లక్షణాన్ని వర్ణించడానికి ఇతడు మరో కొత్త పదాన్ని సూత్రీకరించాడు. అదే “ఫ్లాగిస్టాన్”. “నిప్పు పెట్టడం” అనే అర్థం గల గ్రీకు...

1700 లో సరిగ్గా అలాంటి ఆవిరి యంత్రాన్నే థామస్ సవేరీ (1650-1715) అనే ఓ ఇంగ్లీష్ ఇంజినీరు తయారుచేశాడు. అయితే దాని పని తీరు ప్రమాదకరంగా ఉండేది. ఆ యంత్రంలో అధిక పీడనం వద్ద ఆవిరిని వాడేవారు. అయితే ఆ రోజుల్లో అధికపీడనం వద్ద ఆవిరిని సురక్షితంగా నియంత్రంచడానికి తగ్గ సాంకేతిక పరిజ్ఞానం ఉండేది కాదు. తరువాత థామస్ న్యూకొమెన్ (1663-1729) అనే మరో ఇంగ్లీష్ వ్యక్తి సవేరీతో కలిసి పని చేస్తూ తక్కువ పీడనం వద్ద పని చెయ్యగల ఆవిరి యంత్రాన్ని తయారుచేశాడు (చిత్రం)....

ఇవ్వాళ ఆంధ్రభూమిలో ప్రచురితమైన వ్యాసం. లింకు ఇక్కడ: http://www.andhrabhoomi.net/intelligent/akasaniki-389...
నిషేధం లేకపోతే నిమ్న జాతి లోహాలని బంగారంగా మార్చవచ్చని, ఆ విధంగా రసాయనికులు అణువాదాన్ని నిరూపించగలరని బాయిల్ నమ్మకం.కాని అలా అనుకోవడంలో బాయిల్ నిజంగా పొరబడ్డాడు. ఎందుకంటే లోహాలు మూలకాలని అప్పుడు తెలీదు. నిజానికి ప్రస్తుతం మూలకాలుగా గుర్తించబడే తొమ్మిది పదార్థాలు ప్రాచీన లోకంలో సుపరిచితమైన పదార్థాలు. వాటిలో ఏడు లోహాలు (బంగారం, వెండి, రాగి, ఇనుము, తగరం, సీసం పాదరసం), రెండు అలోహాలు (non-metals) (కార్బన్, సల్ఫర్) ఉన్నాయి. ఇవి కాకుండా మధ్యయుగపు రసవాదులకి మరి నాలుగు పదార్థాలతో కాస్తోకూస్తో పరిచయం ఏర్పడింది (అవి ఆర్సెనిక్, ఆంటిమొనీ,...

ఫిబ్రవరి 14, సోమవారం నాడు ఆంధ్రభూమిలో ప్రచురితమైన మా వ్యాసం. బొమ్మపై నొక్కితే పెద్దగా కనిపిస్తుంది. http://www.andhrabhoomi.net/intelligent/deep-brain-103
...

శ్రీరామఆంధ్రభూమి దినపత్రికలో మా సైన్సు బ్లాగు గురించి పరిచయం చేస్తూ పోయిన శనివారం సిసింద్రిలో ప్రచురించారు. పరిచయం చేసినందుకు జ్యోతి గారికి ధన్యవాదములు. http://www.andhrabhoomi.net/sisindri/telugulo-science-928
...
“ఆల్కెమీ”, “ఆల్కెమిస్ట్” అన్న శబ్దాలని కొద్దిగా మార్చి రాయడంతో ఒక రసాయనవేత్తగా బాయిల్ దశ తిరిగింది. 1661 లో బాయిల్ “ద స్కెప్టికల్ కైమిస్ట్” (సందేహాత్ముడైన రసాయనికుడు) అన్న పుస్తకాన్ని ప్రచురించాడు. ఆల్కెమిస్ట్ అన్న పదంలోని “అల్” తీసేసి, వట్టి కైమిస్ట్ అని ఇక్కడ వాడాడు. ఆ నాటి నుండి ఈ రంగంలో పని చేసే వాళ్లకి కెమిస్ట్ లు అన్న పేరు సార్థకం అయ్యింది. అసలు ఈ రంగమే కెమిస్ట్రీగా చలామణి కాసాగింది.ఇందులో బాయిల్ తానొక “సందేహాత్ముడి” నని చెప్పుకున్నాడు. ఎందుకంటే ఈ రంగంలో ప్రాచీనుల భావాలనిక గుడ్డగా నమ్మనని చాటుకున్నాడు. మూల సూత్రాల నుండి...
“ఆల్కెమీ”, “ఆల్కెమిస్ట్” అన్న శబ్దాలని కొద్దిగా మార్చి రాయడంతో ఒక రసాయనవేత్తగా బాయిల్ దశ తిరిగింది. 1661 లో బాయిల్ “ద స్కెప్టికల్ కైమిస్ట్” (సందేహాత్ముడైన రసాయనికుడు) అన్న పుస్తకాన్ని ప్రచురించాడు. ఆల్కెమిస్ట్ అన్న పదంలోని “అల్” తీసేసి, వట్టి కైమిస్ట్ అని ఇక్కడ వాడాడు. ఆ నాటి నుండి ఈ రంగంలో పని చేసే వాళ్లకి కెమిస్ట్ లు అన్న పేరు సార్థకం అయ్యింది. అసలు ఈ రంగమే కెమిస్ట్రీగా చలామణి కాసాగింది.ఇందులో బాయిల్ తానొక “సందేహాత్ముడి” నని చెప్పుకున్నాడు. ఎందుకంటే ఈ రంగంలో ప్రాచీనుల భావాలనిక గుడ్డగా నమ్మనని చాటుకున్నాడు. మూల సూత్రాల నుండి...
ఇంటర్నెట్ చదువులు, బ్లాగ్ వ్యాసాలు మొదలైన వన్నీ నగరాల వాళ్లకే గాని, సరైన విద్యుత్ సరఫరా కూడా లేని మన పల్లెల్లో పిల్లలకి వీటి వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదని కొంత మంది వాదిస్తూ ఉంటారు. ఇలాంటి వాదనలని వమ్ము చేస్తూ బీహార్ లోని ఓ చిన్న గ్రామం నుండీ వచ్చిన వార్త....http://timesofindia.indiatimes.com/city/patna/Ex-IITian-starts-world-class-school-in-Bihar-village/articleshow/7419365.cmsబీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లాలో, చమన్ పురా గ్రామంలో ఓ కొత్తరకమైన బడి స్థాపించబడింది. దాని పేరు చైతన్య గురుకుల్ పబ్లిక్ స్కూల్. దాన్ని స్థాపించినవాడు...
ఆ విధంగా రసాయనిక చరిత్రలో మొట్టమొదటి సారిగా సంఖ్యాత్మక కొలమాన పద్ధతులతో ఒక పదార్థాన్ని వర్ణించడానికి వీలయ్యింది.అయితే బాయిల్ నియమం వర్తించాలంటే ఉష్ణోగ్రత స్థిరంగా ఉండాలని బాయిల్ పేర్కొనలేదు. ఆ విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదని అనుకుని ఉంటాడు. తదనంతరం 1680 దరిదాపుల్లో బాయిల్ నియమాన్ని స్వతంత్రంగా కనుక్కున్న ఫ్రెంచ్ భౌతికశాస్త్రవేత్త ఎద్మె మారియో (1630-1684), ఆ నియమం వర్తించాలంటే ఉష్ణోగ్రత స్థిరంగా ఉండాలని ప్రత్యేకంగా పేర్కొన్నాడు. అందుకే యూరప్ ఖండం మీద బాయిల్ నియమాన్ని తరచు మారియో నియమంగా వ్యవహరిస్తూ ఉంటారు.బాయిల్ ప్రయోగాలు...

ఈ సోమవారం నాడు ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురించబడ్డ "ప్రాచీన భారతంలో రసాయన పర్వం" అనే వ్యాసాన్ని, ఆంధ్రభూమి వారి సౌజన్యంతో,ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.
http://www.andhrabhoomi.net/intelligent/prachina-973
...

ఫాన్ హెల్మాంట్ జీవితం చివరి దశలలో వాయువుల అధ్యయనం మీద (ముఖ్యంగా గాలి యొక్క అధ్యయనం మీద) ధ్యాస క్రమంగా పెరగసాగింది. 1643 లో ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త ఎవాంజెలిస్టా టోరిసెల్లీ (1608-1647) గాలి ఒత్తిడి చేస్తుందని, దానికి పీడనం ఉందని నిరూపించాడు. ముప్పై అంగుళాల మట్టం ఉన్న పాదరసపు స్తంభాన్ని (mercury column) నిలుపగలిగేటంత పీడనం గాలిలో ఉందని నిరూపించాడు.ఆ విధంగా వాయువుల పట్ల అవగాహన విషయంలో కొద్దిగా మబ్బులు తొలగాయి. వాయువులు కూడా పదార్థమే. వాటికీ...
భాష్పశీల (సులభంగా ఆవిరయ్యే, volatile) ద్రవాలని వాళ్లు ఏమని పిలిచేవారో ఓసారి గమనిస్తే, ఈ ఆవిరుల పట్ల ప్రాచీనులకి ఉండే మనోభావంలోని రహస్యం అర్థమవుతుంది. అలాంటి ద్రవాలని వాళ్ళు “spirits” అనేవారు. Spirit అంటే ’ఊపిరి’, లేక ’వాయువు’ అన్న స్థూలార్థం ఉంది. అయితే ఆ పదానికి అదేదో నిగూఢమైన, పారలౌకికమైన తత్వం (ఆత్మ) అన్న భావం కూడా ఉంది. ఉదాహరణకి “spirits of alchohol” అని “spirits of turpentine” అంటుంటాం. మనకి తెలిసిన భాష్పశీల ద్రవాలలోకెల్లా ఆల్కహాలు ఎంత పాతది అంటే, “spirits” అన్న పదం ప్రముఖంగా ఆల్కహాలు గల మత్తుపానీయాలకి ఉద్దేశించిన...
postlink