
నా యాత్రానుభవాన్ని ఓ సారి సింహావలోకనం చేసుకుంటే సైన్స్ పట్ల నా ప్రేమ తక్కిన అన్ని అపేక్షలని క్రమంగా మించిపోయింది అనే చెప్పుకోవాలి. మొదటి రెండేళ్లు నేనే స్వయంగా తుపాకీతో వేటాడి నానా రకాల పక్షులని, జంతువులని వేటాడి నా అధ్యయనాల కోసం సేకరించాను. కాని పోగా పోగా ఆ భాద్యతని నా అనుచరుడికి అప్పజెప్పాను. ఎందుకంటే వేట నా పనికి అడ్డుతగులుతోంది అనిపించింది. ముఖ్యంగా నేను సందర్శించే ప్రాంతపు భౌగోళిక పరిసరాలని పరిశీలించే ప్రయత్నానికి ఇది అడ్డుతగులుతోంది....

మామయ్య అన్నట్టే డేవీ సిద్ధాంతాలకి ఆధారాలు ముందు ముందు కనిపిస్తాయన్న నమ్మకంతో ముందుకు సాగిపోయాను. కాని అసలు ఆ ఆచూకీయే లేదు. కాని మామయ్యతో వాదనకి దిగదలచుకోలేదు. నా మౌనం అర్థాంగీకారంగా తీసుకున్నాడు కాబోలు. మా అవరోహణ నిరాఘాటంగా కొనసాగింది.
మరో మూడు గంటలు ప్రయాణించాం గాని మేం దిగుతున్న సొరంగం అంతు కనిపించలేదు. తల పైకెత్తి చూస్తే దాని వ్యాసం క్రమంగా చిన్నది కావడం కనిపించింది. దాని గోడలు చిన్న వాలుతో నెమ్మదిగా దగ్గర పడుతున్నాయి. కిందకి...
బీగిల్ యాత్రతో నా జీవితం ఓ ముఖ్యమైన మలుపు తిరిగిందని చెప్పాలి. నా వృత్తి జీవనం మొత్తానికి అది పునాది అయ్యింది. చాలా చిన్న సంఘటనలు ఆ మలుపు తిరగడంలో కీలక పాత్ర పోషించాలి. మొదటిది మా మామయ్య పూనుకుని ముప్పై మైళ్లు ప్రయాణించి మా నాన్నగారితో మాట్లాడాలని నిశ్చయించుకోవడం. ఇక రెండవ విషయం నా ముక్కు ఆకారంతో వచ్చిన చిక్కు. అంతవరకు విశ్వవిద్యాలయాలలో దొరకని అసలు శిక్షణ ఈ యాత్రతో నాకు దొరికిందని అనిపించింది. ఈ యాత్ర వల్ల ఎంతో మనోవికాసం కలిగింది. ప్రకృతి శాస్త్రంలో ఎన్నో శాఖలలో నాకు పరిచయం ఏర్పడింది. నా పరిశీలనా శక్తి కూడా మరింత నిశితం అయ్యింది....

కాపెల్ క్యూరిగ్ వద్ద హెన్స్లోని విడిచిపెట్టి నేను వేరేగా ముందుకు సాగిపోయాను. దిక్సూచిని, మాప్ ని ఆధారంగా చేసుకుని సరళరేఖలో కొండలు దాటుకుంటూ బార్మౌత్ దిశగా సాగిపోయాను. నేను ఎంచుకున్న దిశలో ఏదైనా దారి కనిపిస్తే ఆ దారి మీదుగా ప్రయాణించాను గాని, లేకుంటే ఎక్కువగా కొండల మీదుగానే ప్రయాణిస్తూ పోయాను. ఈ రకమైన యాత్రా పద్ధతి నాకు బాగా నచ్చింది. దారిలో ఎన్నో అద్భుతాలు చూస్తూ ఆనందంగా ముందుకు సాగిపోయాను. బార్మౌత్ లో కొందరు కేంబ్రిడ్జ్ నేస్తాలని కలుసుకున్నాను....
ద్రవ నైట్రోజెన్ ని మింగడం ఎలా?
లైడెన్ ఫ్రాస్ట్ ప్రభావం ద్రవ నైట్రోజెన్ విషయంలో కుడా కనిపిస్తుంది. ద్రవ నైట్రోజెన్ కింద చిందినప్పుడు నైట్రోజెన్ బిందువులు నేలకి అతుక్కుపొకుండా, అటు ఇటు దొర్లడం చూస్తే తమాషాగా ఉంటుంది. ద్రవ నైట్రోజెన్ -200 C వద్ద ఉంటుంది. కనుక అది నేలని తాకినప్పుడు దాని అడుగు భాగం ఆవిరి ఐపోతుంది. నేలకి ద్రవానికి మధ్య ఏర్పడ్డ పొర ద్రవాన్ని పైకెత్తుతుంది.
ద్రవ నైట్రోజెన్ తో చేసే ఓ స్టంట్ కి మూలం కూడా లైడెన్ ఫ్రాస్ట్ ప్రభావమే నంటాడు జెర్ల్ వాకర్. ఈ స్టంట్ లో ప్రదర్శకుడు నోట్లోకి గుక్కెడు ద్రవ నైట్రోజెన్ తీసుకుని,...
నీటి మరుగు స్థానం (boiling point) కన్నా బాగా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉన్న పెనం మీద నీటి బిందువు చాలా ఎక్కువ సేపు నిలుస్తుందన్న విషయాన్ని మొట్టమొదట 1732 లో హెర్మన్ బోర్హావే కనుక్కున్నట్టు సమాచారం. ఆ తరువాత 1756 లో యోహాన్ గోట్లోబ్ లైడెన్ ఫ్రాస్ట్ ఈ ధర్మాన్ని విస్తృతంగా అధ్యయనం చేశాడు. తన అధ్యయనాల ఫలితాలని “A tract about some qualities of common water” అనే పరిశోధనా వ్యాసంగా ప్రచురించాడు. కనుక ఈ ప్రభావానికి లైడెన్ ఫ్రాస్ట్ పేరే అతికింది. కిందటి పోస్ట్ లో చిత్రం 2 లోని గరిష్ఠ బిందువుని కూడా అందుకే లైడెన్ ఫ్రాస్ట్ బిందువు అంటారు.
లైడెన్...

ఈ వృత్తాంతం ఈ మధ్యనే ఈమెయిల్ లో ఎవరో పంపారు. చిన్న సైన్స్ హాస్యం...
అమెరికా దక్షిణభాగంలో జరిగిన కథ.
ఓ స్థానిక స్కూల్ టీచరు తనకి కాల్ వచ్చిన ప్రతీ సారి ఫోన్ రింగ్ కావడం లేదని వాళ్ళ ఫోన్ కంపెనీకి ఫిర్యాదు చేసింది. కొన్ని సార్లే రింగ్ అవుతుంది. ఇంకా విచిత్రం ఏంటంటే రింగ్ కావడానికి కొంచెం ముందుగా వాళ్ల కుక్క ఓ సారి ఎందుచేతనో మూలుగుతుంది.
విషయం ఏంటో తేల్చుకుందామని ఓ టెక్నీషియన్ ఈవిడ ఇంటికి వచ్చాడు – భవిష్యత్తు తెలుసుకునే మహిమ గల ఆ కుక్క...

కాగే నీట్లో బుడగలు మాలికలుగా, స్తంభాలుగా ఏర్పడ్డ దశని ‘బీజకారక మరుగుదల’ (nucleate boiling) అంటారు (fig. 2). పాత్ర ఉష్ణోగ్రత పెరుగుతుంటే పాత్రలోకి ప్రవేశించే శక్తి ప్రవాహం కూడా క్రమంగా పెరుగుతుంటుంది. కాని ఈ ఒరవడి ఒక దశలో తిరుగుముఖం పడుతుంది. ఆ దశలో ఉష్ణోగ్రత పెరుగుతున్న కొద్ది పాత్రలోకి పోయే శక్తి ప్రవాహం తగ్గుతుంటుంది. దీన్నే సంక్రమణ దశ (transition regime) అంటారు (fig. 2). పాత్ర ఉష్ణోగ్రత పెరుగుతుంటే, ఇంకా ఇంకా వేడిమి నీట్లోకి ప్రవేశించాలి....

http://www.wiley.com/college/phy/halliday320005/pdf/leidenfrost_essay.pdf
జెర్ల్ వాకర్ రాసిన వ్యాసం నుండి కొన్ని అంశాలు.
ముందుగా అసలు మరగడం అంటే ఏంటి? నీరు ఎలా మరుగుతుంది? అన్న ప్రశ్నల మీద చర్చతో వ్యాసం మొదలవుతుంది.
నీరు ఎలా మరుగుతుందో శ్రద్ధగా గమనించాలంటే ఒక పాత్రలో కొంచెం నీరు తీసుకుని కింద పొయ్యి వెలిగించాలి. నీరు వేడెక్కుతుంటే మొట్టమొదట మనకు కనిపించే పరిణామం నీట్లోంచి నెమ్మదిగా బుడగలు పైకి రావడం. నీట్లో కరిగి వున్న...
postlink