అధ్యాయం 18
భూగర్భంలో రెండు వింతలు
మర్నాడు ఉదయం ఓ ఒంటరి రవికిరణం మమ్మల్ని మేలుకొలిపింది.
సొరంగంలోకి ఎలాగో చొచ్చుకొచ్చిన ఆ కిరణం గరుకైన లావా శిలల కోటి ముఖాల మీద పడి నలు దిశలా చిందడం వల్ల సొరంగం అంతా సున్నితమైన మెరుపులు కురిపించింది.
ఆ పాటి కాంతి సహాయంతో చుట్టూ ఉన్న వస్తువులని పోల్చుకోడానికి వీలయ్యింది.
“ఏవంటావ్ ఏక్సెల్,” అన్నాడు మామయ్య మెల్లగా సంభాషణ మొదలెడుతూ. “కోనిగ్స్ బర్గ్ లో మన బుల్లి ఇంట్లో ఇంత ప్రశాంతంగా ఎప్పుడైనా ఉందంటావా? గుర్రపు బళ్ల చప్పుళ్లు, కూరల వాళ్ల కేకలు, పడవల వాళ్ల అరుపులు ఇవేవీ లేకుండా ఇంత హాయిగా, నిశ్శబ్దంగా…”
“ఈ నూతి లోతుల్లో నిజంగానే చాలా నిశ్శబ్దంగా వుంది. కాదనను. కాని ఎందుకో ఈ మౌనం భయంకరంగా అనిపించడం లేదూ?”
“చాల్చాల్లే ఊరుకో!” దబాయిస్తున్నట్టుగా అన్నాడు మామయ్య. “ఇప్పటికే ఇంత భయపడిపోతే ఇక ముందు ముందు ఎలా ఉంటావో? అసలైన భూగర్భంలోకి ఇంకా మనమొక ఇంచి కూడా పోలేదు.”
“అదేంటి అలా అంటున్నావ్?”
“అవును. ప్రస్తుతానికి మనం దీవిలో నేల మట్టానికి వచ్చాం. పైన అగ్నిబిలం నుండి మొదలైన ఈ నిలువు సొరంగం కింద సముద్రమట్టం వద్ద ఆగిపోతుంది.”
“కచ్చితంగా చెప్పగలవా మామయ్యా?”
“నిస్సందేహంగా. కావలిస్తే ఇదుగో ఈ బారోమీటర్ ని అడుగు.”
మేం సొరంగంలో కిందకి దిగుతుంటే వేగంగా పైకి లేచిన పాదరసం ఇరవై తొమ్మిది అంగుళాల గుర్తు వద్ద ఆగింది.
నిజానికి సముద్ర మట్టం వద్ద వాయు పీడనం కన్నా సొరంగం లో పీడనం ఎక్కువైతే ఇక ఈ బారోమీటర్ పని చెయ్యదు.
“బాగేనే వుంది గాని,” మరో కొత్త భయం పుట్టి అడిగాను, “లోపలికి పోతున్న కొద్ది పీడనం పెరుగుతూ పోతే మనకి ఏ ఇబ్బందీ ఉండదా?”
“ఉండదు. ఎందుకంటే మనం చాలా నెమ్మదిగా కిందకి దిగుతాం కనుక మన ఊపిరితిత్తులు పరిసరాల పీడనానికి అలవాటు పడిపోతాయి. విమాన యానం చేసేటప్పుడు పైన గాలి పలచన అవుతుంది కనుక శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది.* కాని మనకి ఆ సమస్య లేదు. కనుక పద ఆలస్యం చెయ్యకుండా చకచక ముందుకి సాగిపోదాం. ఇందాక మనం కింద పడేసిన మూట ఎక్కడుంది?”
(*ఈ పుస్తకం రాయబడ్డ కాలానికి (1864) విమానాలు లేవన్న సంగతి గమనించాలి. – అనువాదకుడు.)
ముందు రోజు సాయంత్రం ఆ మూట కోసమే వృధాగా వెతికాం. మామయ్య హన్స్ ని అడిగాడు. వేటగాడికి ఉండే నిశితదృష్టితో కాసేపు వెతికిన హన్స్,
“డెర్ హుప్పె” అన్నాడు.
“అదుగో పైన.”
నిజంగానే పైనే ఉంది ఆ మూట. మేం ఉన్న చోటికి ఓ నూరు అడుగులు పైన పొడుచుకొస్తున్న ఓ రాతికి తగులుకుంది ఆ మూట. అనడమే ఆలస్యంగా ఆ ఐస్లాండ్ వాసి పిల్లిలా సొరంగపు గోడలు ఎగబ్రాకి కొద్ది నిముషాలలోనే మూటతో తిరిగొచ్చాడు.
“రండి టిఫిన్ చేద్దాం. అయితే ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇంకా ఎంత దూరం వెళ్లాలో తెలీదు.”
ఓ బిస్కట్టు, కాస్త మాంస రసం, దీంతో పాటు కాస్త జిన్ కలిపిన నీరు తాగి దాంతోనే కడుపు నిండింది అనుకున్నాం.
ఫలహారం పూర్తయ్యాక మామయ్య జేబులోంచి ఓ చిన్న పాకెట్ నోట్ బుక్ తీశాడు. వైజ్ఞానిక పరిశీలనలు నమోదు చేసుకోవడానికి వాడే పుస్తకం. తన పరికరాలని ఓ సారి సంప్రదించి తన నోట్ బుక్ లో ఇలా రాసుకున్నాడు.
“జులై 1. సోమవారం.”
“సమయ మానిని – 8:17 ఉ. బారోమిటర్ - 29.7 ఇంచిలు; థర్మామీటర్ – 6 C (43 F); దిశ – తూర్పు/దక్షిణ-తూర్పు.”
(ఇంకా వుంది)

0 comments