ఇందాక మామయ్య తీసుకున్న పరిశీలనలలో చివర్లో కొలిచిన దిశ మా ఎదుట ఉన్న వాలు సొరంగానికి వర్తిస్తుంది.
“ఇక చూసుకో ఏక్సెల్,” మామయ్య ఉత్సాహంగా అన్నాడు. “ఇప్పట్నుంచి మనం నిజంగా భూగర్భంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ క్షణమే మన యాత్ర మొదలవుతుంది.”
ఆ మాటలంటూ మామయ్య అంత వరకు తన మెడకి వేలాడుతున్న రుమ్ కోర్ఫ్ పరికరాన్ని చేతిలోకి తీసుకున్నాడు. రెండవ చేత్తో ఆ పరికరానికి లాంతరలో ఉన్న చుట్టతీగకి మధ్య విద్యుత్ సంపర్కాన్ని కల్పించాడు. లాంతరు లోంచి పెల్లుబికిన కాంతి మా ఎదుట ఉన్న చీకటి దారిని ప్రకాశవంతం చేసింది.
హన్స్ మోస్తున్న పరికరం కూడా అదే విధంగా వినియోగించబడింది. చుట్టూ ఎలాంటి ప్రమాదకర, జ్వలనీయ వాయువులు ఉన్నా ఈ అద్భుత విద్యుత్ పరికరం సహాయంతో ఎంతో సేపు కృతిమ కాంతి ఉత్పన్నం చేసుకోవచ్చు.
“ఇక బయల్దేరదాం,” అన్న మాటలకి ముగ్గురం ముందుకు నడిచాం.
ఎవరి భారం వాళ్లు మోస్తూ ముందుకు సాగాం. త్రాళ్లు, బట్టలు ఉన్న మూటని ఈడ్చుకుంటూ హన్స్ అందరి కన్నా ముందు నడిచాడు. ఇక చివరిలో నేనున్నాను. అందరం ఓ చీకటి ప్రాంగణంలోకి ప్రవేశించాం.
చీకటి ప్రాంగణంలోకి అడుగుపెట్టే ముందు చివరిసారిగా ఓ సారి (మళ్ళీ అసలెప్పుడైనా చూస్తానో లేదో తెలీదు కనుక) ఆ పొడవాటి చీకటి సొరంగానికి అవతల కనిపించే చిన్న పాటి ఐస్లాండ్ ఆకాశపు తునకని ఆత్రంగా చూసుకుని ముందుకు అడుగేశాను.
1229 లో జరిగిన అగ్నిపర్వత విస్ఫోటానికి పర్వత గర్భంలోని లావా ద్రవం ఈ సొరంగాన్ని ఏర్పరుస్తూ పైకి ఎగజిమ్మింది. సొరంగపు గోడల మీద దట్టమైన పొరలా ఏర్పడి దాని మీద ఎన్నెన్నో తళుకులు అలమింది. ఈ కృత్రిమ విద్యుత్ కాంతి ఆ గోడల మీద పడి ప్రతిబింబితమై కోటి కాంతులై ప్రజ్వరిల్లింది.
మేం నడుస్తున్న వాలు బాట మీద వేగంగా పోవడం పెద్ద కష్టం కాదు. సుమారు నలభై ఐదు డిగ్రీల వాలు ఉన్న ఈ సొరంగం లో వేగంగా ముందుకు జారకుండా నిలదొక్కుకోవడం కష్టం.
మా కాళ్ల కింద మెట్లలా అనిపిస్తున్నదే మా నెత్తి పైన స్టాలాక్ టైట్ లుగా ఏర్పడింది. ఎన్నో చోట్ల సచ్ఛిద్రంగా ఉన్న లావా పొర ఎన్నో చోట్ల గోడలు బొబ్బలెక్కినట్టు చిప్పిల్లింది. రంగుదేలిన క్వార్జ్ స్ఫటికాల హంగులతో, నాజూకైన గాజు మాలికలతో, ఆ సహస్ర సుసంపన్న సుదీప వైభగం గల పరిసరాలలో మేం ముందుకు సాగిపోతుంటే ఒక్కసారిగా ఎవరో మంత్రం వేసినట్టు జేగీయమానం అవుతాయేమో నన్న ఆలోచనకి ఒళ్లు గగుర్పొడిచింది. భూగర్భంలో జీవించే ఏవరో పిల్ల దేవతలు ఈ భూవాసుల ఆగమనానికి ఆహ్వానంగా వేల దివ్వెలు వెలిగించినట్టు అనిపించింది.
http://www.freewebs.com/flash012/
“అబ్బ! ఎంత అందం!” ఆనందాన్ని పట్టలేక బయటికి అనేశాను. “ఈ దృశ్యం ఎంత బావుంది కదా మామయ్యా? ఈ లావా వన్నెల అందమే అందం. ఈ చివరలోని అరుణ ఛాయ ఆ చివరికి చేరేసరికి అతిసూక్ష్మంగా రూపాంతరం చెందుతూ పచ్చని పసిమిగా మారిపోతోంది కదూ? ఒక్కొక్క స్ఫటిక ఓ చక్కని కాంతి గుళికలా వుందేం?”
“అవునా? అంత నచ్చిందేం అల్లుడూ?పోగా పోగా ఇంకా గొప్ప వైభవాలు చూస్తావు. పద పద. వేగంగా నడువు.”
(ఇంకా వుంది)

0 comments