అలాగే రాబర్ట్ బ్రౌన్ ని (చిత్రం) కూడా ఎన్నో సార్లు కలుసుకున్నాను. (జర్మను తత్వికుడు) హమ్బోల్ట్ ఇతణ్ణి ‘వృక్షశాస్త్రపు మారాజులలో ముఖ్యుడు’ (facile Princeps Botanicorum) అని పొగుడుతాడు. ఇతడు చేసిన అత్యంత సూక్ష్మమైన, నిర్దుష్టమైన పరిశీలనలు, ఇతడికి గొప్ప పేరు తెచ్చాయి. ఇతడికి విస్తారమైన పరిజ్ఞానం ఉండేది. కాని అతడితోనే అదంతా భూస్థాపితం అయిపోయింది. దానికి కారణం ఎక్కడైనా దోషం దొర్లుతుందేమో నన్న అతడి భయమే. తన జ్ఞానాన్నంతా నాకు మాత్రం లేదనకుండా ధారాదత్తం చేసేవాడు. కాని కొన్ని విషయాలలో మాత్రం ఆ ఔదార్యం కొరవడడం విచిత్రంగా అనిపించేది. బీగిల్ యాత్రకి ముందు రెండు, మూడు సార్లు ఆయన్ని సందర్శించాను. అలా ఒక సారి తనని కలుసుకున్నప్పుడు ఓ సూక్ష్మదర్శిని లోంచి చూసి ఏం కనిపిస్తోందో చెప్పమన్నాడు. అలాగే చూశాను. నాకు కనిపించినవి ఏదో వృక్ష కణంలోని జీవపదార్థపు అతిసూక్ష్మమైన ప్రవాహాలు అనుకున్నాను. కాని పూర్తిగా సంశయం తీరక ‘నేను చూసిందేంటి?’ అని అడిగాను. “అదో చిన్ని రహస్యం!” అని ఊరుకున్నాడు బ్రౌన్.
అతడిలో ఎంతో ఔదార్యం లేకపోలేదు. బాగా వయసు పైబడ్డాక, ఆరోగ్యం బాగా క్షీణించాక, ఇక ఏ పనీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా రోజూ ఓ ముసలి పనివాడి ఇంటికి వెళ్లి తనకి ఏదో ఒక పుస్తకం చదివి వినిపించేవాడట. (ఆ పనివాడికి ఆర్థిక సహాయం కూడా చేసేవాడు.) ఇలాంటి ఔదార్యం ముందు ఆయనలో ఏదైనా వైజ్ఞానిక ప్రలోభం గాని, అసూయ గాని ఉన్నా పెద్దగా కనిపించవు.
మరి కొందరు ప్రముఖులతో కూడా పరిచయం ఉండేది. వారిని కొన్ని సందర్భాలలో కలుసుకున్నాను. అయితే వారి గురించి అంతగా చెప్పవలసింది ఏమీ లేదు. సర్ జాన్ హెర్షెల్ అంటే నాకు అపారమైన గౌరవం ఉండేది. ఒకసారి కేప్ ఆఫ్ గుడ్ హోప్ లో ఆయన ఇంటికి భోజనానికి వెళ్ళాను. తరువాత లండన్ లో కూడా ఓ సారి ఆయన ఇంటికి వెళ్లాను. మరి కొన్ని సందర్భాలలో కూడా ఆయన్ని కలుసుకోవడం జరిగింది. పెద్దగా మాట్లాడేవారు కాదు గాని ఆయన మాట్లాడే ప్రతీ మాట ఎంతో అర్థవంతంగా ఉంటుంది.
ఒకసారి సర్ ముర్చిసన్ ఇంటికి ఉదయానే ఫలహారానికి వెళ్లాను. హంబోల్ట్ నన్ను చూడగోరుతున్నాడంటే వెళ్ళాను. హంబోల్ట్ అంతటి వాడు నన్ను చూడాలని అనుకోవడం నాకు గొప్ప మన్ననలా అనిపించింది. కాని తీరా ఆయన్ని కలుసుకున్నాక కొంచెం నిరాశ చెందాననే చెప్పాలి. బహుశ ఆయన గురించి నేను చాలా గొప్పగా ఊహించుకున్నానేమో. మా సంభాషణలో నాకు ప్రత్యేకించి ఏమీ గుర్తు లేదు. ఆయన చాలా హుషారుగా, చాలా సేపు మాట్లాడడం మాత్రం గుర్తుంది.
ఇలా అంటే నాకు మరో విషయం గుర్తొస్తోంది. హెన్స్లే వెడ్జ్ వుడ్ ఇంట్లో ఒకసారి బకుల్ (Buckle) ని కలుసుకున్నాను.
ఇతగాడు విషయసేకరణ కోసం ఓ ప్రత్యేక పద్ధతి కనిపెట్టాడు. తను చదివిన పుస్తకాలనీ కొనుక్కుంటాడు. ఏవైనా ఆసక్తికర మైన విషయలు చదివితే అవన్నీ ఓ విషయసూచిక రూపంలో వేరేగా రాసుకుంటాడు. ఏ పుస్తకంలో ఎక్కడ ఏ విషయం వుందో ఆ విషయసూచిక చెప్తుంది. అతడికి అద్భుతమైన జ్ఞాపక శక్తి వుంది. తను చదివిన విషయాలు ఏ పుస్తకంలో, ఎక్కడ ఉంటాయో అన్నీ గుర్తుంటాయి. ఈ పద్ధతి వల్ల ఎలాంటి అంశం మీదనైనా అద్భుతమైన సంఖ్యలో పరిచయ గ్రంథాలని పేర్కొనగలిగేవాడు. ఆయన రాసిన ‘మానవ నాగరికతా చరిత్ర’ అన్న పుస్తకంలో ఇలాంటి పరిచయ గ్రంథాలు ఎన్నో పేర్కొనబడ్డాయి. ఈ పుస్తకం అత్యంత ఆసక్తికరంగా అనిపించి రెండు సార్లు చదివాను. అయితే ఆ పుస్తకంలో అతడు చేసిన ప్రతిపాదనలకి ఎంత విలువ ఉందో నాకు సందేహమే. బకుల్ మంచి మాటకారి. అతడు చెప్పిందంతా నోరు మెదపకుండా విన్నాను. అయినా అసలు నాకు నోరు విప్పే అవకాశం ఇస్తేగా? ఇంతలో శ్రీమతి ఫారర్ గానం మొదలుపెట్టింది. అది వినాలని నేను అక్కణ్ణుంచి వెళ్లిపోయాను. అప్పుడు బకుల్ పక్కకి తిరిగి ఓ మిత్రుడితో అన్నాట్ట – “డార్విన్ సంభాషణల కన్నా అతడి పుస్తకాలే బావుంటాయ్!”
(ఇంకా వుంది)

హృదయ పూర్వక ధన్యవాదాలు!
Sar very very tanku sar